📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Anantapuram: మైనర్ బాలికను పెళ్లాడిన వృద్ధుడు.. పోలీస్ అధికారులకు పిర్యాధు

Author Icon By Anusha
Updated: May 27, 2025 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా(Anantapuram)లో జరిగిన దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పదహారేళ్ల బాలికను అరవై ఏళ్ల వృద్ధుడు బలవంతంగా వివాహం చేసుకున్నాడు. అతడి చెర నుంచి తప్పించుకున్న బాలిక ధైర్యంగా పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఈ అమానుష ఘటన రాయదుర్గం నియోజకవర్గం(Rayadurgam Constituency)లో చోటుచేసుకుంది.పూర్తి వివరాలు,బాధిత బాలిక కుటుంబం రోజువారీ కూలి పనులపై ఆధారపడి జీవిస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, భర్త మరణించడంతో పుట్టింటిలోనే ఉంటోంది. రెండో కుమార్తె మైనర్‌ (16). ఆ కుటుంబ ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకున్న గుమ్మఘట్ట మండలం, పూలకుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు (60) ఈ దారుణానికి ఒడిగట్టాడు. అతడి భార్య రెండేళ్ల క్రితమే మరణించింది. అతడికి వివాహమైన కుమారుడు, పెళ్లికి సిద్ధంగా ఉన్న కుమార్తె ఉన్నారు.

బలవంతంగా

గత నెలలో బాలిక ఇంటికి వెళ్లిన రామాంజనేయులు ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులను అడిగాడు. అందుకు వారు నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన రామాంజనేయులు(Ramanjaneyulu) వారిని బెదిరించి ఇంటి బయటే బాలిక మెడలో బలవంతంగా తాళి కట్టాడు. మరుసటి రోజు బాలికను ఇంటికి తీసుకెళ్లి కాపురానికి ఒత్తిడి చేశాడు.ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టంలేని ఆ బాలిక వారం తిరిగేలోపే పుట్టింటికి తిరిగి వచ్చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన రామాంజనేయులు ఈ నెల 24న బంధువులతో కలిసి బాలిక ఇంటిపై దాడి చేశాడు. బాలిక తల్లి, తండ్రి, అక్కను చితకబాది బాలికను బలవంతంగా ఒక వాహనంలో తీసుకెళ్లాడు. అనంతరం రెండు రోజుల పాటు ఆ బాలికను ఒకచోట నిర్బంధించి, తీవ్రంగా కొట్టాడు.

Anantapuram: మైనర్ బాలికను పెళ్లాడిన వృద్ధుడు.. పోలీస్ అధికారులకు పిర్యాధు

దర్యాప్తు

ఆదివారం రాత్రి ఎలాగోలా ఆ వృద్ధుడి చెర నుంచి తప్పించుకున్న బాధిత బాలిక అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా పొలాల గుండా నడుచుకుంటూ వచ్చి దారిలో ఒకచోట సేదతీరింది. సోమవారం ఉదయం, స్థానికుల సహాయంతో అనంతపురం ఎస్పీ కార్యాలయానికి(Anantapur SP office) చేరుకుంది. అక్కడ, తనకు జరిగిన ఘోరంపై అధికారులకు ఫిర్యాదు చేసింది. బాలిక చెప్పిన వివరాలు విన్న అధికారులు, వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read Also : Godavari River: గోదావరిలో 8 మంది యువకుల గల్లంతు ఒక మృతదేహం లభ్యం

#ChildMarriage #EndAbuse #JusticeForMinorGirl #StopExploitation Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.