हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Alluri District: అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు మృతి

Anusha
Alluri District: అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో (Alluri District) భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.దేవీపట్నం అటవీ ప్రాంతంలోని కొండమొదలు వద్ద గ్రేహౌండ్స్‌ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.రంపచోడవరం, మారేడుమిల్లి అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టు నేతలు చనిపోయారు. చనిపోయిన వారిలో మావోయిస్టుల అగ్రనేత చలపతిరావు (Chalapathy Rao) భార్య అరుణ, గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌, అంజు ఉన్నారు. మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఘటనా స్థలంలో మూడు ఏకే 47 రైఫిల్స్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కొండమొదలు, కొయ్యలగూడెం, చింతకూరు దగ్గర ఈ కాల్పులు జరిగాయి. చనిపోయినవారిలో అరుణ స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. గాజర్ల రవి కేంద్ర కమిటీ సభ్యుడు కాగా అంజు ఏవోబీ స్పెషల్‌ జోన్‌ కమిటీలో ఏసీఎంగా ఉన్నారు. 

మావోయిస్టులు

మావోయిస్టుల అగ్రనేత చలపతిరావు భార్య అరుణ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితురాలుగా ఉన్నారు. 2018లో డుంబ్రిగుడ దగ్గర వారిని మావోయిస్టులు కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. అరుణ సొంత ఊరు విశాఖపట్నం జిల్లాలోని కరకవానిపాలెం (Karakavanipalem) కాగా ఉదయ్‌పై రూ.25 లక్షలు, అరుణపై రూ.20 లక్షల రివార్డు ఉంది.కాగా,ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంతేకాదు గత రెండు, మూడు నెలలుగా వరుసగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌ (Maoists encounter) లలో దాదాపు 200మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు.

 Alluri District: అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు మృతి
Alluri District

కేంద్ర కమిటీ

కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో ఎక్కువమంది చనిపోయారు. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారు. ఇటీవల జనవరిలో ఒడిశా-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నక్సలిజం కేంద్ర కమిటీ సభ్యులు చలపతి (Chalapati) అలియాస్ రామచంద్రారెడ్డి మరణించారు. సీఎం చంద్రబాబుపై గతంలో అలిపిరిలో జరిగిన దాడి కేసులో చలపతి కీలక సూత్రధారి. చిత్తూరు జిల్లా వాసి అయిన అతడిపై రూ.కోటి రివార్డు ఉంది. తాజాగా చలపతి భార్య అరుణ కూడా ప్రాణాలు కోల్పోయారు. 

Read Also: Bangalore: బెంగళూరులో బైక్ టాక్సీల రద్దు.. ఆటో చార్జీలు పెంపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870