📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Train: సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో బాలికపై యువకుడు లైంగిక దాడి

Author Icon By Vanipushpa
Updated: April 4, 2025 • 3:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ట్రైన్లో మైనర్ బాలికను 25 ఏళ్ల యువకుడు లైంగికంగా వేధించడమే కాకుండా వీడియోలు చిత్రీకరించిన దారుణ ఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిని పట్టుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఒక్కసారిగా యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాలిక తీవ్ర భయాందోళనకు గురైంది. ఇంతకీ బాలికను నిందితుడు ఏ విధంగా వేధింపులకు గురిచేశాడు.
బాత్రూమ్‌లోనే బాలికపై లైంగిక వేధింపులు
హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ ప్రదేశాలను చూడటానికి ఒడిస్సా నుంచి ఓ కుటుంబం హైదరాబాద్‌కు బయలుదేరింది. రక్సెల్ సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బాలిక కుటుంబం హైదరాబాద్‌కు పయనమైంది. ఈ క్రమంలో అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో మైనర్ బాలిక ట్రైన్‌లో వాష్‌ రూమ్‌కు వెళ్లింది. బాలిక ఒంటరిగా వెళ్లడాన్ని చూసిన ఓ వ్యక్తి ఆమెను ఫాలో అయ్యాడు. బాత్రూమ్‌లోనే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు దుండగుడు. అంతటి ఆగకుండా తాను చేస్తున్న ఘోరాన్ని, బాలిక దృశ్యాలను తన మొబైల్‌లో రికార్డు చేశాడు నిందితుడు. దుండగుడి వేధింపులతో తీవ్ర భయాందోళనకు గురైన బాలిక అక్కడి నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యుల వద్దకు వచ్చి జరిగిన ఘోరాన్ని తెలియజేసింది. దీంతో వెంటనే బాలిక తండ్రి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో నిందితుడు
నిందితుడు హైదరాబాద్‌ నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలిని, నిందితుడిని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి పోలీసులు విచారిస్తున్నారు. అలాగే బాలికకు వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించారు. వాష్‌రూమ్‌లోకి వెళ్లిన వెంటనే దుండగుడు లైంగిక దాడికి దిగడంతో బాలిక ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైంది. హైదరాబాద్‌లోని ప్రదేశాలను చూసేందుకు వస్తున్న బాలికపై దుండగులు ఇలాంటి దారుణానికి పాల్పడటం సంచలనంగా మారింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై రైల్వే పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

#telugu News a girl on the Secunderabad Express train. A young man sexually assaulted Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.