📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Honeymoon murder:పెళ్లికి మూడు నెలల ముందే హత్యకు కుట్ర..!

Author Icon By Vanipushpa
Updated: June 16, 2025 • 5:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మేఘాలయ (Meghalaya) లో జరిగిన రాజారఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసు దర్యాప్తు చేస్తున్నాకొద్ది ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. రాజా రఘువంశీని పెళ్లి చేసుకున్న తర్వాతనే తన ప్రియుడు రాజ్‌ కుశ్వాహ (Raj Kushwaha) తో కలిసి సోనమ్‌ భర్త హత్యకు కుట్రపన్నిందని భావిస్తుండగా.. పెళ్లికి మూడు నెలల ముందే హత్యకు కుట్ర జరిగిందని తాజాగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్‌ రఘువంశీల వివాహం మే 11న జరిగింది. అయితే పెళ్లికి కొన్ని నెలల ముందే వారి వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో ఫిబ్రవరిలో అంటే సుమారుగా పెళ్లికి మూడు నెలల ముందే తన ప్రియుడు రాజ్‌కుశ్వాహతో కలిసి సోనమ్‌.. కాబోయే భర్త రాజా రఘువంశీ హత్యకు కుట్రపన్నినట్లు విచారణలో తేలింది. ప్రియుడితో పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో రాజా రఘువంశీని పెళ్లిచేసుకుని హత్యచేస్తే.. విధవరాలైన తనను ప్రియుడికి ఇచ్చి రెండో పెళ్లి చేస్తారని సోనమ్‌ భావించింది.

Honeymoon murder:పెళ్లికి మూడు నెలల ముందే హత్యకు కుట్ర..!

మేఘాలయలో ప్లాన్ – ట్రెక్కింగ్‌లో మర్డర్

పోలీసుల విచారణలో సోనమ్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. కానీ హత్య చేస్తే కటకటాలపాలై జీవితం సర్వనాశనం అవుతుందనే విషయాన్ని మాత్రం సోనమ్‌, ఆమె ప్రియుడు రాజ్‌కుశ్వాహాలు ఆలోచించకపోవడం ఆశ్చర్యకరం. కాగా మే 11న రాజా, సోనమ్‌ల వివాహం జరగగా మే 23న రాజారఘువంశీ హత్యకు గురయ్యాడు. హనీమూన్‌ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లి మరీ సోనమ్‌ హత్య చేయించింది. రాజ్‌కుశ్వాహ ముగ్గురు స్నేహితులు ఈ హత్యలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారు. ఉత్తరఖాసీ కొండల్లో రాజా, సోనమ్‌ ట్రెక్కింగ్‌ చేస్తుండగా నిందితులు దాడిచేసి హతమార్చారు. ఆ తర్వాత హంతకులు, సోనమ్‌ కలిసి రాజా రఘువంశీ మృతదేహాన్ని లోయలో పడేశారు. సోనమ్‌ను ఇండోర్‌కు తీసుకెళ్లి దాచిపెట్టారు. మరో మహిళను హత్యచేసి తగులబెట్టి అది సోనమ్‌ మృతదేహంగా నమ్మించాలని చూశారు.

నకిలీ మృతదేహం స్కెచ్ విఫలం

కానీ 18 రోజులపాటు చూసినా మరో మహిళ హత్య సాధ్యం కాలేదు. దాంతో సోనమ్‌ పోలీసుల ఎదుట లొంగిపోయింది. తనను ఎవరో కిడ్నాప్‌ చేసి ఇక్కడికి తీసుకొచ్చారని నాటకం ఆడింది. కానీ అప్పటికే హత్యలో సోనమ్‌ పాత్ర ఉందని అనుమానిస్తున్న పోలీసులు ఆమె మాటలు నమ్మలేదు. విచారణలో హత్యలో తనపాత్ర కూడా ఉన్నట్లు ఒప్పుకుంది. మరో మహిళను హత్య చేసి దాన్ని సోనమ్‌గా చూపించాలని కుట్ర. కానీ 18 రోజులు గడిపినా, వారు ఆ పని చేయలేకపోయారు.
చివరికి సోనమ్ పోలీసులకు లొంగిపోయి “తనను కిడ్నాప్ చేశారు” అన్న డ్రామా వేసింది.
విచారణలో పోలీసులు సత్యాన్ని బయటపెట్టారు. సోనమ్ తన పాత్రను అంగీకరించింది.

Read Also: Meghalaya: హనీమూన్ జంట విషాదం: చివరి వీడియోలో కీలక దృశ్యాలు

#telugu News A conspiracy to murder Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today the wedding..! three months before

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.