📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Bihar: అకాల వర్షాలతో బీహార్ అతలాకుతలం 80 మంది మృతి

Author Icon By Anusha
Updated: April 11, 2025 • 6:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్ రాష్ట్రంలో అకాల వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటివరకు 80 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి విజయ్ కుమార్ మండల్ శుక్రవారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హఠాత్తుగా వర్షాలు పడటంతో ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారు. పిడుగులు, గాలివానలు, వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నివాస గృహాలు, చిన్న నిర్మాణాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి.మంత్రి విజయ్ కుమార్ మాట్లాడుతూ, “ప్రస్తుతం రాష్ట్రం అత్యంత సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. భారీ వర్షాలు వలన ప్రజలు చనిపోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 4 లక్షల చొప్పున పరిహారం అందిస్తోంది. అలాగే గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి” అని వివరించారు.

ఆస్తి న‌ష్టం

రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ నాయ‌కుడు, ప్ర‌తిప‌క్ష‌నేత తేజ‌స్వి యాద‌వ్ రాష్ట్రంలో అకాల వ‌ర్షాలు సృష్టిస్తున్న బీభ‌త్సంపై ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాల‌కు ప్ర‌భుత్వం స‌రైన ప‌రిహారం అందించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. భారీ మొత్తంలో ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌డం తీవ్రంగా బాధించింద‌ని తేజ‌స్వి యాద‌వ్ పేర్కొన్నారు. ఆక‌స్మిక వ‌ర్షాల కార‌ణంగా గోదుమ రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని, గోదాముల‌లో దాచిన పంట కూడా నాశ‌న‌మైంద‌న్నారు. బాధిత రైతుల‌కు ప్ర‌భుత్వం త‌గిన ప‌రిహారం ఇవ్వాల‌ని, వారిని అన్ని విధాల ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు.  

పిడుగుపాటుకు

బెగూసరాయ్, దర్భంగా జిల్లాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఈ రెండు జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి చెందడం కలచివేస్తోంది. మధుబని జిల్లాలో విషాదం మరింత తీవ్రంగా ఉంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు పిడుగుపాటుకు బలయ్యారు. తండ్రీకూతుళ్లు కళ్లముందే పిడుగుపాటుకు గురై విగతజీవులుగా మారడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సమస్తిపుర్ జిల్లాలో కూడా ఒక వ్యక్తి పిడుగుపాటుకు గురై మరణించారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

Read Also: Tamil Nadu: తమిళనాడులో అన్నాడీఎంకే బీజేపీ పొత్తు ఖరారు

#BiharDisaster #BiharRains #LightningStrike #UnseasonalRain #WeatherAlert Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.