📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

mass exam cheating: అరుణాచల్‌లో పోటీ పరీక్షల కేసులో 53 మంది అరెస్ట్‌

Author Icon By Vanipushpa
Updated: May 22, 2025 • 5:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హర్యానా(Haryana)కు చెందిన అభ్యర్థులు అరుణాచల్‌ ప్రదేశ్‌(Arunachalpradesh)లోని సెంటర్లలో పోటీ పరీక్షలు రాశారు. సుమారు 2,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరికి హర్యానా నుంచి కొందరు సహాయం చేశారు. ఎలక్ట్రానిక్(Electronic) పరికరాల ద్వారా సమాధానాలు చెప్పారు. ఒక అభ్యర్థి అనుమానాస్పద ప్రవర్తనతో ఈ మాస్‌ చీటింగ్‌ బయటపడింది. (mass exam cheating) దీంతో హర్యానాకు చెందిన 53 మంది అభ్యర్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మే 18న జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీ కోసం నియామక పరీక్షలను సీబీఎస్‌ఈ నిర్వహించింది.

mass exam cheating: అరుణాచల్‌లో పోటీ పరీక్షల కేసులో 53 మంది అరెస్ట్‌

కింగ్‌కప్ పబ్లిక్ స్కూల్‌లో ఒక అభ్యర్థి అనుమానాస్పద ప్రవర్తన
కాగా, హర్యానాకు చెందిన కొందరు అభ్యర్థులు అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌ని పరీక్షా కేంద్రాలను ఎంచుకున్నారు. వారు అక్కడకు చేరుకుని పరీక్షలకు హాజరయ్యారు. మే 18న సాయంత్రం ల్యాబ్ అటెండెంట్ పరీక్ష సమయంలో కింగ్‌కప్ పబ్లిక్ స్కూల్‌లో ఒక అభ్యర్థి అనుమానాస్పద ప్రవర్తనను సిబ్బంది గమనించారు. అతడ్ని చెక్‌ చేయగా లోదుస్తుల్లో దాచిన చిన్న ఎలక్ట్రానిక్ పరికరం, చిన్న ఇయర్‌పీస్ దొరికాయి. దీంతో పోలీసులను రప్పించారు. అభ్యర్థులందరినీ తనిఖీ చేయగా హర్యానాకు చెందిన 23 మంది వద్ద ఇలాంటి పరికరాలు లభించాయి. దీంతో వారిని అరెస్ట్‌ చేశారు.
ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా సమాధానాలు అందాయి
మరోవైపు వివేకానంద కేంద్ర విద్యాలయంలో మరో అనుమానితుడిని పోలీసులు పట్టుకున్నారు. దర్యాప్తు తర్వాత మిగిలిన నిందితులను అరెస్ట్‌ చేశారు. ఉదయం జరిగిన ఇతర పరీక్షలకు హాజరైనా అభ్యర్థుల వద్ద కూడా ఇలాంటి పరికరాలు ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. హోటల్స్‌తోపాటు ఇతర ప్రదేశాల్లో ఉన్న హర్యానాకు చెందిన మొత్తం 53 మంది అభ్యర్థులను అరుణాచల్‌ ప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.
కాగా, ఇటానగర్‌లో పోటీ పరీక్షలు రాసిన ఈ అభ్యర్థులకు 2,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానా నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా సమాధానాలు అందాయని పోలీస్‌ అధికారి తెలిపారు. జీఎస్‌ఎం ఆధారిత గాడ్జెట్‌లు, మైక్రో ఇయర్‌పీస్‌లు, అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించి హర్యానా అభ్యర్థులు పరీక్షల్లో మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు.
హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌పై దర్యాప్తు
మరోవైపు నాగాలాండ్‌లోని దిమాపూర్, సిక్కిం, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ పరీక్షా కేంద్రాల్లో కూడా ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినట్లు తెలిసిందని పోలీస్‌ అధికారి తెలిపారు. దీంతో ఈ హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌పై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 2,600 కిలోమీటర్ల దూరం నుంచి దీనికి నేతృత్వం వహించిన హర్యానా సూత్రధారి, వ్యక్తుల కోసం వెతుకుతున్నట్లు వివరించారు.

Read Also: Chhattisgarh: మళ్ళీ ఎన్‌కౌంటర్ – బీజాపూర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం

#telugu News 53 arrested in Ap News in Telugu Arunachal Breaking News in Telugu competitive exam case Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.