हिन्दी | Epaper
అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’

Millets for Health:ఆరోగ్య సిరికి’నవ రత్నాలు

Hema
Millets for Health:ఆరోగ్య సిరికి’నవ రత్నాలు

Millets for Health:తిండి కలిగితే కండ కలుగోయ్ కండ కలిగినవాడే మనిషోయ్” అన్నారు గురజాడ.. ఇక్కడ తిండి అనే దానిలో ఆయన ఉద్దేశం పోషకాహార తిండి తప్ప ఆహార పరిమాణం కండ అంటే ఊబకాయం కాదు. సామర్థ్యం. ఆహార భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కూడా శారీరక సామర్థ్యం కలిగిన దేశమే ప్రగతి పథంలో ముందుకు పోతుందని ఆయన అభిప్రాయం. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది
జగద్విదితమే. పాత తరంలోకి వెళితే ఏడు పదులు వయసు దాటిన మన తల్లిదండ్రులు బంధువులు శత సంవత్సరాలు వరకూ ఎటువంటి అనారోగ్యం లేకుండా జీవిస్తూ వచ్చిన మన తాత ముత్తాతల ఆరోగ్య రహస్యం రాగిముద్ద, జొన్నరొట్టె, కొర్రసంగటి.. రాగి సంకటి, నువ్వుల
లడ్లు.. వంటి చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవడమే. వారిలో ఊబకాయం, మధుమేహం, హై బీపీ లాంటివి మచ్చుకైనా కనిపించలేదు.

కళ్లజోడు అవసరం లేకుండా పుస్తకం చదివేవారు. ఎంత దూరమైనా అలసట లేకుండా నడిచేవారు. వారికి విటమిన్లు, ఖనిజాలు ,(minerals) కార్బోహైడ్రేట్ల గురించి వారికి ఏమాత్రం అవగాహన లేదు. హాస్పిటల్కు వెళ్లిన దాఖలాలే చాలా అరుదు. ఆ కాలంలో సూపర్ స్పెషలిస్ట్ వైద్యులు అవసరం లేకపోయింది. సప్త పదులు దాటినా వారు చాలా
ఉత్సహంగా చురుకుగా ఉండేవారు. ఇప్పటి తరంలో 30 సంవత్సరాలకే వృద్ధాప్య ఛాయలు ముంచుకొస్తున్నాయి. శారీరక వ్యాయామం చేయలేని పరిస్థితి (situation)

. ఇప్పుడు మనం 50 అడుగులు దూరంలో ఉన్న కిరాణా షాపుకు వెళ్లి సరుకులు తేవాలంటే వాహనం కావాలి. కనీసం సైకిల్ కూడా తొక్కలేని పరిస్థితి. స్కూల్కు నడిచి వెళ్లే పిల్లలే కనిపించడం లేదు.

సమీప దూరంలో స్కూల్ ఉన్నప్పటి నడిచి వెళ్లలేక రోడ్డుపై లిఫ్ట్ అడిగే పిల్లలు కోకొల్లలు. చాలా ఇళ్ళల్లో ఊబకాయం కలిగిన పిల్లలు దర్శనమిస్తున్నారు. చిన్న వయసులోనే మధుమేహం సంక్రమిస్తుంది. నాలుగు అడుగులు కూడా వేయలేక శిలా విగ్రహంలా ఒకే చోట కూర్చునే పరిస్థితి నెలకొంది. దీనికంతటికీ కారణం మనం తినే తిండిలోనే దాగి ఉంది. మన పాత తరం వారు తిన్న చిరుధాన్యాల స్థానంలో నేడు మన కంచాల్లో వరి గోధుమలు వచ్చి చేరాయి. ఈ ప్రయాణం చిరుధాన్యాల నుంచి పిజ్జాల వరకూ చేరుకుంది. నేషనల్ శాంపుల్సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా యాభై కోట్ల మంది.. తిండిలేక

Millets for Health


కాదు, సరైన పోషకాలు లేక అల్లాడిపోతు న్నారని రోగ గ్రస్తులు అవుతున్నారని తన నివేదికలో తెలి పింది. ఆధునిక సమాజంలో ఆరోగ్యదాయనిగా ఉండే చిరు ధాన్యాల వినియోగం తగ్గి అనారోగ్యానికి హేతువుగా నిలిచే వరి, గోధుమ ధాన్యాల వినియోగం వల్లనే ఈ పరిస్థితిదాపురించిందని ఇప్పుడిప్పుడే గ్రహించడం మొదలుపెట్టాం. అందుకే తిరిగి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ చిరు ధాన్యాల వైపు ప్రజలు ఆసక్తి చూపుతున్న పరిణామాలను విశ్లేషిస్తూ నేటి సండే కవర్ స్టోరీ కథనం.

చరిత్రను ఒకసారి తిరగేస్తే..

మన ఆహార మూలాలైన చిరుధాన్య పంటలు ప్రకృతి ప్రసాదిత వరంగానే కాకుండా. ఔషధ గుణాల సమ్మిళితమైన ఆహారమనే విషయం స్పష్టమవుతుంది. మన దేశంలో క్రీ.పూ. 3000 నుంచి చిరుధాన్యాల వాడకం ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. నాగరికత ప్రారంభమైన కాలం నుంచే వీటిని సాగు చేసేవారు. ఆరో దశకం వరకూ చిరుధాన్యాలే ప్రధాన ఆహార పంటలు ప్రతి రైతూ ఒక చిరుధాన్యం పండించే వారు. కుటుంబ సమేతంగా ఆ పంట వంట తినేవారు. ఈ ధాన్యాల గురించి యజుర్వేదంలో కూడా ప్రస్తావించడం జరిగింది.

అప్పటినుండే సామ్, కుట్కి, రాగి వంటి పేర్లు మన ప్రాచీన వ్యవసాయ, ఆహార సంప్రదాయాలలో ఇవి అంతర్భాగంగా ఉన్నాయి. ఆఫ్రికా, చైనా, భారత్లో నాగరికతలు విలసిల్లిన తొలినాళ్ల నుంచే చిరుధాన్యాలను
వాడేవారు. శాతవాహనుల కాలంలో దక్కన్ పీఠభూముల్లో వరిపంట కంటే జొన్న పంటే ఎక్కువగా ‘సాగైందని వివిధ ఆధారాలను బట్టి తెలుస్తోంది. చంద్రగుప్త మౌర్యుల కాలంలో భారతదేశంలో ప్రజల ముఖ్య ఆహారం జొన్నలు, కొర్రల’ నిగ్రీకు చరిత్రకారుడు మెగస్తనీసు పేర్కొన్నాడు ‘భారత్ నుంచి ఇటలీకి జొన్నపంట పరిచయం అయ్యిందన్నారు’ గ్రీకు రచయిత ప్లినీ. చిరుధాన్యాల్లో విలువైన పోషకాలు ఉన్నాయంటూ కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో చెప్పుకొచ్చారు. రాజుల కాలం నుంచే కాదు, హరప్పా నాగరికత నుంచే కొర్రల్ని పండించేవారని శాస్త్రవేత్తలు సైతం నిర్ధారించారు.చిరుధాన్యాల ప్రత్యేకతలు..

పీచు పదార్థం (ఫైబర్)

మన ఆహారంలో ఉన్న సహజ పీచు పదార్థం (డైటరీ ఫైబర్) ఆహారం నుంచి రక్తంలోకి గ్లూకోజ్ విడుదల జరిగే ప్రక్రియను నియంత్రిస్తుంది. ఒకేసారి అధిక మొత్తంలో గ్లూకోజ్విడుదల జరిగే ప్రక్రియను నియంత్రిస్తుంది. బియ్యం, గోధుమలతో పోల్చి చూస్తే చిరు ధాన్యాలలో పీచు ఎక్కువ ఉంటుంది. కనుక మిలేట్స్ తీసుకోవడం ద్వారా లభించే గ్లూకోజ్ నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. వరి అన్నం తినడం వలన కేవలం ఒక గంటలోనే గ్లూకోజ్ రక్తంలో కలసి పోతుంది. చిరుధాన్యం
తీసుకోవడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. అంతే కాకుండా చిరు ధాన్యాన్ని ఆహారంగా తీసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివలన ఆహారం తీసుకునే పరిమాణం
తగ్గుతుంది. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

Millets for Health

త్వరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు తగ్గుతుంది. వరి అన్నం ద్వారా లభించే పిండి పదార్థం త్వరగా జీర్ణంకావడం వలన శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోయి వంట్లో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. చిరు ధాన్యాలలో ఇటువంటి ప్రమాదం ఉండదు. అందుచేత ఇవి ఆహారంగా తీసుకుంటే ట్రెగ్లిజరైడ్స్, కొవ్వు, ఊబకాయం, హై బీపీ, మధుమేహం అనే సమస్యలు అదుపులో ఉంటాయి. శరీరంలో ఆమ్లం స్థాయి
తగ్గడానికి ఇవి సహకరిస్తాయి. ప్రత్యేకించి గర్భిణీలకు తల్లులకు ఇవి ఎంతగానో మేలు చేస్తాయి.
అంతేకాకుండా చిరు ధాన్యాలు సాగులో ఇవి నెమ్మదిగా పెరుగుతాయి కాబట్టి వీటిలో మైక్రో
న్యూట్రియట్స్ పుష్కలంగా లభిస్తాయి. వీటి పరిమాణం బియ్యంతో పోలిస్తే చాలా సూక్ష్మంగా ఉండటం వలన వీటికి ఎక్కువ పాలిష్చే యడం కూడా సాధ్యపడదు. వరి, గోధుమలు
వలే కాకుండా వీటిలో ఫైబర్ అనేది ధాన్యం లోపల పొరల్లో కూడా ఇమిడి ఉంటుంది. దీని
కారణంగా వీటిలో పీచు సమృద్ధిగా లభిస్తుంది.

ఉదాహరణకు బాగా పాలిష్ చేసిన వరి ధాన్యంలో 0.2 శాతం పీచు ఉంటే అదే కొర్రలు సామలు ఊదలు వంటి వాటిలో 8 నుండి 10 శాతం వరకూ పీచు లభిస్తుంది. బియ్యంలో కన్నా చిరుధాన్యాల్లో మాంసకృత్తులు దాదాపు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఫలితంగా ఎక్కువ సమయం ఆకలేయకుండా, ఇతర చిరు తిండ్లవైపు మనసు మళ్లకుండా జాగ్రత్తపడచ్చు. బరువును అదుపులో ఉంచుకోవడానికి ఇదీ ఓ మార్గమే!
చిరుధాన్యాల్లో విటమిన్లూ ఎక్కువే! బాగా శుద్ధి చేయడం, పాలిష్ చేయడం వల్ల గోధుమలు, బియ్యపు గింజల* పైపొరల్లో ఉండే బికాంప్లెక్స్ విటమిన్లు తొలగిపోతాయి. అదే చిరుధాన్యాలను పొట్టు తీయకుండానే వాడుకునే వీలుండడం వల్ల థయమిన్, రైబోప్లేవిన్, నియాసిన్.. వంటి ‘బి’ విటమిన్లు మన శరీరానికి అందుతాయి. రాగుల్లో క్యాల్షియం, ఇనుము చాలా ఎక్కువ. పాలల్లో కన్నా
రాగుల్లోనే కాల్షియం మోతాదు అధికం. అలాగే సజ్జలు, కొర్రల్లో ఇనుము ఎక్కువగా ఉంటుంది.
చిరుధాన్యాల్లో పీచు మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల పెద్దపేగు కేన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చు. చిరుధాన్యాలన్నీ వేర్వేరు రంగుల్లో ఉంటాయి. ఇలా రంగుల్లో ఉండే
చిరుధాన్యాల నుంచి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి.

ప్రకృతి ప్రసాదించిన నవరత్నాలు

భారత రైతాంగం తొమ్మిది రకాల చిరుధాన్యాలను పండిస్తున్నది. అంటే వీటిని నవరత్నాలుగా చెప్పుకోవచ్చు. వాటి ప్రత్యేకతలు:

1. కొర్రలు (ఫాక్స్ టెయిల్): వీటిలో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. స్థూలకాయం, కీళ్ల నొప్పులు, పార్కిన్సన్స్, మూర్ఛ, గుండె సంబంధిత
వ్యాధులను నివారిస్తాయి.

2. సామలు (లిటిల్ మిల్లెట్): ఇందులో విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. పీసీఓడీ, గర్భధారణ సమస్యలకు విరుగుడుగా ప్రసిద్ధి.

3. ఆరికలు (కొడొ మిల్లెట్): ఇది మధుమేహ వ్యాధి నివారణకు దోహదం చేస్తుంది. శరీరంలో
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తహీనతను అరికడుతుంది.

జొన్నలు (గ్రేట్ మిల్లెట్/సొర్గమ్): ఇది చెడు కొలస్ట్రాల్ను నివారిస్తుంది. జుట్టు రాలడం తగ్గిస్తుంది. జొన్నరొట్టె, జొన్న
అంబలి విరివిగా తీసుకుంటారు

4. ఊదలు/ కొడిసామ (బేరియార్డ్ మిల్లెట్): ఇది గ్లూటీన్
రహితం కావడంతో కొలెస్ట్రాల్ను నిరోదిస్తుంది. లివర్, మూత్రపిండాల సమస్యలు రాకుండా చేయగలదు. దీనితో ఇడ్లీ, ఉప్మా, దోసె తరహాలో వంటకాలు చేయవచ్చు.

5. రాగిచోడి
(ఫింగర్ మిల్లెట్): ఇది ప్రధానంగా బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. రాగి రొట్టె, రాగి జావలను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సర్వసాధారణంగా తీసుకుంటున్నారు.

6.సజ్జలు (పెర్ల్ మిల్లెట్): శరీరంలోని విషాలను తొలగించి రోగ నిరోధక శక్తిని పెంచడం దీని ప్రత్యేకత. టైప్ 2 మధుమేహానికి, గాలోను కూడా ఇది విరుగుడు. సజ్జరొట్టె, సజ్జ అంబలిని తెలుగు ప్రాంతాలలో విరివిగా తయారు చేస్తారు.

7. అండు కొర్రలు (బ్రౌన్ టాప్మిల్లెట్): ఇందులో విటమిన్లు, ఫైబర్ ఉంటాయి. థైరాయిడ్, కీళ్లనొప్పులు, స్థూలకాయం, రక్తపోటు రాకుండా నివారిస్తాయి. వరిగ (ప్రోసో మిల్లెట్/కామన్ మిల్లెట్): ఇందులో ఫాలిక్యా సిడ్, విటమిన్లు ఉంటాయి. కార్టినాయిడ్స్, పాలిఫెనోల్స్
వంటి యాంటీ టాక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి.

అందుకే కొలస్ట్రాల్ను అదుపు చేయడంలోను, రోగ నిరోధక శక్తికి తోడ్పడడంలో దీనికి ప్రాధాన్యం ఉంది.ప్రస్తుతం మనం వినియోగిస్తున్న వరి, గోధుమ ఆహార పదార్థాలలో తక్కువ పీచు పదార్థం వలన ఇవి తిన్న 15-35 గ్లూకోజ్ మారిపోయి, ఒక్కసారిగా రక్తంలోకి వచ్చి చేరుతోంది.

ఇలా రోజుకి మూడు, నాలుగు సార్లు జరిగితే వీటికి తోడుగా స్వీట్లు తింటే? బర్గర్, పిజ్జాలు మైదాతో చేసిన బేకరీ ఫుడ్ కూడా దీనికి తోడైతే? అధిక మొత్తాలలో గ్లూకోజు ఒకేసారిగా రక్తంలోకి చేరుకుని కొవ్వు పెంచుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఆరోగ్య కారణాలతో ప్రపంచవ్యాప్తంగా 28 శాతం మంది చిరుధాన్యాలకు మారారు. 15 శాతం మంది బరువు తగ్గేందుకు వీటినే ఆహారంగా వాడుతున్నారు. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో చిరుధాన్యాలను 9 కోట్లకు పైగా ప్రజలు ముఖ్య ఆహారంగా తింటున్నారు. 30కి పైగా దేశాల్లో 50 కోట్ల మందికి జొన్నలు ముఖ్య ఆహారం. 131 దేశాల్లో జొన్నలు, తదితర చిరుధాన్యాలు ప్రధాన ఆహార పంటలుగా ఇవి
సాగవు తున్నాయి ఆకలి, పోషకాహారలోపం, వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య ప్రభావం, ఆహారభద్రతసవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు చిరుధాన్యాలసాగు, వినియోగం పెద్ద ఎత్తున
విస్తరించాలని ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎ) సూచించింది. ఇంతటి ప్రాధాన్యత గల చిరుధాన్యాల వాడకం తగ్గిపోవడానికి లేదా మరుగునపడటానికి పెరుగు తున్న జనాభాకు ఆహార భద్రత కలిగించడానికి అనుసరించిన వ్యూహమేనని చెప్పాలి. హరిత విప్లవ ఆగమనం తరువాత నేడు వ్యవసాయం ఆధునికంగా మారింది.

రైతులు ఆదాయం ప్రాతిపదికగా వాణిజ్య పంటల వైపు పరుగులు పెట్టడం మొదలు పెట్టారు. తద్వారా బలవర్థకమైన ఆహార
పంటలు కనుమరుగవడం మొదలయ్యింది. చిరు ధాన్యాల సాగుతో పోల్చి చూస్తే వరి, గోధుమ పంటల దిగుబడి అత్యధికంగా ఉండటం. ఈ పంటలకు ప్రభుత్వాలు కనీస మద్దతు ధర ప్రకటించడం ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ద్వారా వీటిని సేకరించడం వంటి కారణాల చేత రైతులు పూర్తిగా వరి గోధుమ, వాణిజ్య పంటలవైపు మరలిపోయారు. కాలక్రమంలో ప్రభుత్వాల విధానాలు, చిరుధాన్యాల సాగులోని సమస్యలు రైతులను పాత పంటలకు దూరం చేశాయి. ఈ
పంటలకు ప్రోత్సాహం కరువై అనాథ పంటలుగా మారిపోయాయి.

ఆరోగ్యానికి బహువిధాలుగా సహకరించే చిరుధాన్యాలు అందుబాటులో లేక వాటిని ప్రజలు మరచిపోయే స్థితికి చేరుకోవడం జరిగింది. కాల గమనంలో మనం తినే ఆహారంలో చాలా మార్పులు సంభవించాయి. మన ఆహారంలో పాలిష్ రిఫైన్డ్ ధాన్యం చేరాయి. బియ్యాన్ని పొట్టు తీసివేసి ఎక్కువ పాలిష్ చేయడం గోధుమలను ఎక్కువ రెఫైండ్ చేసి పిండిగా చేయడం ద్వారా మనం తీసుకున్న ఆహారంలో
పోషకాలు తగ్గి కార్బోహైడ్రేట్స్ పెరిగి పోతున్నాయి. వండే విధానం వలన కూడా వీటిలో ఉండే పోషకాలు క్షీణిస్తున్నాయి. ఫలితంగా ఉబకాయం హై బీపీ, మధుమేహం వంటి వ్యాధులు
చుట్టు ముడుతున్నాయి. దానికితోడు జంక్ ఫుడ్ జత చేరింది.ఆహార భద్రతను సాధించడంలో మంచి ఫలితాలను సాధించిన హరిత విప్లవం భారతదేశ పోషక భద్రతనుపరిష్కరించడంలో మాత్రం సహాయ పడలేదనే చెప్పవచ్చుది పైగా ఈ హరిత విప్లవం దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ జలాలను వెలికితీసే దేశంగా మార్చింది అడవుల నరికేవేత భూతాపం పెరిగిపోవడం వర్షాభావ పరిస్థితులలో రిజర్వాయర్లలో భూగర్భంలో నీటి మట్టాలు ప్రమాదకర స్థితికి
చేరుకున్నాయి. భూతాపం, వాతావరణ మార్పులు, నీటి కొరత ప్రపంచానికి సవాళ్లుగా మారాయి. ఏయేటి కాయేడు ఎండలు పెరగడంతోపాటు తాగు, సాగు నీటి లభ్యత తగ్గిపోతోంది.

Millets for Health

ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీలు పెరిగితే వరి, గోధుమ పంటల దిగుబడి పడిపోవడమే కాకుండా వాటి ఉనికే ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అధిక నీరు అవసరమయ్యే వరి, పర్యావరణంలో మీథేన్ వాయువు పెంచే పంట. కేజీ ధాన్యం పండించడానికి
అయిదు వేల లీటర్ల నీరు కావాలి. ఈ స్థితిలో సాగు నీరు విషయం పక్కన పెడితే తాగు నీరుకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడి మానవ మనుగడే ప్రశ్నర్ధకంగా మారనుంది.. ఆధునిక ఆహారపు అలవాట్లు విదేశీ ఆహారపు మోజులో, ఫాస్ట్ ఫుడ్ సంస్కృతిలో పడిన నేటి సమాజం అజీర్ణం, బీపీ, షుగర్ లాంటి రోగాల బారిన పడుతున్నారు. కాలుష్య, రసాయనపూరిత ఆహార పంటల వల్ల
వ్యాధుల సమస్య పెచ్చరిల్లడంతో ఇన్నేళ్లకు వీటి పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ ఆహారాలు వైపు చేస్తున్న ప్రయత్నాలలో మిలేట్స్ సాగు ఏకైక పరిష్కారంగా నిలిచింది.

మళ్లీ పాత తరం మిలేట్స్ సాగు మొదలయ్యింది. హరిత, శ్వేత, నీలి విప్లవం తర్వాత ఇప్పుడు దేశంలో సరికొత్త విప్లవం
రాబోతోంది. ఆహారం, పాలు, చేపల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిన భారత్ ఇప్పుడు పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కోవడానికి.. చిరుధాన్యాల విప్లవం మీద దృష్టి సారించింది. ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రత దిశగా అంతర్జాతీయ సమాజం అడుగులు వేయడం మొదలయ్యింది. ఇంత కాలం చిరు ధాన్యాలను ముతక ధాన్యాలని, దశాబ్దాలుగా మిలేట్స్ నిర్లక్ష్యం చేశాం. భూతాపం, జీవన శైలి జబ్బుల విజృంభణతో ‘పోషక ధాన్యాల’ ఆవశ్యకతను గుర్తించాం. ఈ మేరకు కేంద్రం చర్యలు చేపట్టి చిరు ధాన్యాల పంటల సాగును ప్రోత్సహించే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. 2018ని భారత ప్రభుత్వం జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించి.. చిరుధాన్యాలను పోషకాల ధాన్యాలు(న్యూట్రీ పెరియల్స్)గా అధికారిక గుర్తింపునిచ్చింది.

భారత్ ప్రతిపాదనతో 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి జనరల్అ సెంబ్లీ ప్రకటించడం జరిగింది. భారతదేశ సగటు మిల్లెట్ది గుబడి హెక్టారుకు 1239 కిలోలు, ప్రపంచ సగటు దిగుబడి హెక్టారుకు 1229 కిలోలతో పోలిస్తే. భారతదేశం ప్రపంచంలోనే మిలేట్స్ అతిపెద్ద ఉత్పత్తిదారు, రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా పేర్కొనవచ్చు. పోషకాలు ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి అత్యంత మేలుచేసే తృణధాన్యాల సాగును విస్తృతం చేయాలని శ్రీ అన్న పథకాన్ని ప్రకటించింది.

శ్రీ అన్న పథకం

విభిన్న వాతావరణ పరిస్థితులలో, వర్షాధారంతో పండే చిరుధాన్యాలు సాగు అంతటినీ శ్రీ అన్న పేరుతో భారత ప్రభుత్వం ప్రపంచ ప్రజల ముందుకు తీసుకు వచ్చింది. చిరుధాన్యాల పంటల సాగును గురించి సమగ్ర అవగాహన ఏర్పాటు చేయడానికి ఈ పథకం ఎంతగానో సహకరిస్తుంది.
స్థూలంగా సజ్జ, రాగి, జొన్న, కొర్రలు, సామలు, ఆరికె, వరిగ, ఊదలుగా పేరు పడిన చిరుధాన్యాల సాగు, ఉత్పత్తి, వినియోగాలను కలిపి శ్రీఅన్న కార్యక్రమంగా పిలుస్తున్నారు. భారతదేశ ప్రధాన ఆహారంలో పోషకాలు, ఆరోగ్యం, పర్యావరణ ప్రయోజనాలు పుష్కలంగా ఉండటం వల్ల అన్ని ధాన్యాల తల్లి అంటే మిల్లెట్’ అనే పేరు పెట్టారు.

అగ్ర భాగంలో రాజస్థాన్

చిరుధాన్యాల దిగుబడుల్లో దేశం మొత్తం మీద రాజస్థాన్రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. రాజస్తాన్లో యేటా సగటున 4290.95 మెట్రిక్ టన్నుల తృణధాన్యాల దిగుబడి వస్తోంది. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర 2,296 మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా… ఉత్తరప్రదేశ్లో 2223.86 మెట్రిక్ టన్నుల దిగుబడితో మూడో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక,
ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలన్నీ ముందు వరుసలో ఉన్నాయి.

చిరుధాన్యాలకు చిరునామా.. దక్షిణ భారత్

దేశం మొత్తం మీద చిరుధాన్యాలకు దక్షిణ భారత రాష్ట్రాలు చిరునామాగా మారుతున్నాయని ఎంఎస్స్వామినాథన్ పరిశోధన సంస్థ(ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) అధ్యయనం వెల్లడించింది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలలో వాటి సాగు భారీగ పెరుగుతోందని, వీటి వినియోగం విస్తరిస్తోందని పేర్కొంది. నాణ్యమైన విత్తనాలు, యాంత్రీకరణతో కూడిన నవీన సాగు విధానాలు, అధిక దిగుబడులకు అనుకూలతలు, అధునాతన శుద్ధి, మెరుగైన మార్కెటింగ్ మార్గాలు వీటి సాగు విస్తరణకు దోహదపడుతున్నాయని వివరించింది.

ఈ పంటలను ప్రోత్సహిస్తే ఆదాయం 5 రెట్లు పెరుగుతుందని వెల్లడైనట్లు తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో వివిధ వర్గాల్లో మిల్లెట్లపై అవగాహనను కల్పిస్తూ, 500కు పైగా స్టార్ట్ అప్లు పుట్టుకొచ్చాయి. వీటిని వ్యవసాయ రంగంతో అనుసంధానించిసుస్థిరాభివృద్ధి లక్ష్యాలను త్వరితగతిన చేరాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యేకించి హైదరాబాద్లో భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐసీఏఆర్)ను సెంటర్ ఆఫ్
ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్, డిపార్ట్మెంట్ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా పరిశోధనకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నాయి. ఈ పరిశోధనా కేంద్రాన్ని ‘న్యూట్రి హబ్ ‘ గా మార్చాలనే లక్ష్యాన్ని
కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ప్రజల్లో ఈ చిరు ధాన్యాలపై కోవిడ్ సమయం నుంచి
మంచి అవగాహన కలిగిందని చెప్పవచ్చు. అప్పటి నుండి చాలా మంది చిరు ధాన్యాల విలువ తెలుసుకుని వినియోగించడం మొదలు పెట్టారు.

Millets for Health

దీని ఫలితంగా ప్రాభవం కోల్పోయిన చిరుధాన్యాలు నేడు చిరునవ్వులు రువ్వుతున్నాయి. దంపుడు బియ్యం ఎంత ధర ఉన్నా కొనడం మొదలు పెట్టారు. రాగి అంబలి తాగడానికి క్యూ కడుతున్నారు. జొన్నరొట్టె, కొర్రబియ్యం తింటే షుగర్, బీపీ కంట్రోల్ అవుతుందనే చైతన్యం ఎక్కువ వచ్చింది. శ్రీమంతుల ఇళ్లలోనూ పాత
పంటలు, చిరుధాన్యాల వినియోగం పెరిగింది. దీనికితోడు చిరుధాన్యాలు ఆహారంగా తీసుకునే వారికి ఆరోగ్యపరంగా పలు ఉపయోగాలున్నాయని డాక్టర్ఖా దర్ వలీ వంటివారు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మిలేట్స్ పై ఖాదర్ వలీ గారు చేస్తున్న విశిష్ట కృషిని గుర్తించి ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం కూడా అందచేయడం జరిగింది.
అయితే దశాబ్దాలుగా మనం అలవాటుపడిపోయి ఉన్న వరి, గోధుమలను వదిలి పెట్టి ఒక్క సారిగా మిలేట్స్క మల్లడం కూడా అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కడుపు ఉబ్బరం, అజీర్తి ఉన్నవాళ్లు వీటిని ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు పాటించి తీరాలి. ఏ పదార్థం కూడా ఇది మంచిది ఇది చెడ్డది అనే ఏక పక్ష నిర్ణయానికి రావడం సరైన పద్ధతి కాదు. ఈ పదార్థం సర్వరోగ నివారిణి. ఇది అమృతంతో సమానం దీనితో అన్ని రోగాలు తగ్గి పోతాయి
అనే ప్రచారం కూడా సహేతుకం కాదు.

ఏ పదార్థం మంచి చెడు అయినా కూడా ఆ పదార్థం ఉపయోగించే వ్యక్తి శరీర తత్వాలను బట్టి ఉంటుంది. శరీరం బట్టే వాటి మంచి చెడులు
మారుతూ ఉంటాయి. మిలేట్స్ ఆహారంగా తీసుకుంటే అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఇప్పటికే అజీర్తి, గ్యాస్స మస్యలు మలబద్ధకం ఉన్నవాళ్లు వీటిని ఎక్కువగా తీసుకుంటే కొత్త సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. పెరిగే పిల్లలు గర్భిణీ స్త్రీలు 70 సంవత్సరాలు దాటినవాళ్ళు పోషకాలు సరిగా లేని వారికి క్రమేపీ వీటిని అందించాలి తప్ప
ఒక్క సారిగా ఈ మిలేట్స్ పెట్టకూడదు అని వైద్యులు సూచిస్తున్నారు. అలా జాగ్రత్తలు తీసుకోకపోతే మేలు కన్నా కీడ ఎక్కువ జరుగుతుంది.ముఖ్యంగా హైపోథైరాయిడ్ ఉన్నవారు మిల్లెట్స్ అధికంగా తీసుకుంటే థైరాయిడ్ మరింత పెరిగేందుకు దోహదం చేస్తుంది.
మిల్లెట్ తీసుకున్నప్పుడు, వారి థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పు కలుగుతుంది. చిరు ధాన్యాలలో ఎక్కువగా వున్న గోయిట్రోజెన్లు మనం తిన్న ఆహారం నుండి అయోడిన్శోషణకు అవరోధం కలిగిస్తుంది. కనుక థైరాయిడ్ సమస్య కలవారు వీటికి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు చెబుతున్నారు. వ్యక్తుల ఆహార అవసరాలు అన్నీ కూడా ఒకే విధంగా ఉండకుండా వైవిధ్యంగా ఉంటాయి.

ఉదా॥ శారీరక శ్రమ చేసే శ్రామికుడు, ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఓ స్పోర్ట్మన్, ఓ
విద్యార్థి, ఓ వృద్ధుడు వీరి ఆహార అవసరాలు, పరిమాణాలు విభిన్నంగా ఉంటాయి. వీరిలో
మిలేట్స్ ద్వారా ఒకరికి మంచి జరిగింది అంటే అందరికీ మంచి జరగాలని లేదు. పాలిష్ చేసిన
ధాన్యం వలన వీరిలో ఎక్కువ మందికి హాని జరగవచ్చు . కానీ మిలేట్స్ ద్వారా అందరికీ మేలు
జరుగుతుందని మాత్రం చెప్పలేం. పెన్సిలిన్ సర్వ రోగ నివారిణి అన్నట్లుగా ఇది పూర్తిగా.మంచిది
అనే నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. మానవులకు ఉన్న చెడ్డ అలవాట్లలో ఆకలిగా ఉన్నా లేకపోయినా తినడం అనేది ప్రధానంగా చెప్పవచ్చు.

Millets for Health

సృష్టి నిర్మాణంలో ఏర్పాటు చేసిన ప్రక్రియ ప్రకారం జంతువులు మాత్రమే ఆ నియమాన్ని పాటిస్తున్నాయి. అవి ఆకలి వేసినప్పుడే తింటాయి. ఆకలి తీరిన పిదప వాటి ఎదుట ఎంత ఆహారం ఉన్నప్పటికి అవి ముట్టుకోవు. రాత్రి సమయంలో
ఆహారం తీసుకోవు. వేళాపాళా లేకుండా ఆకలి ఉన్నా లేకపోయినా పరిమితి లేకుండా ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాం. తీసుకునే ఆహారంలో క్రమశిక్షణ పాటించగలిగితే తెల్ల ధాన్యం తీసుకున్నప్పటికీ కూడా అనారోగ్య సమస్యలు ఎదురవ్వవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మిలేట్స్ ప్రచారం ఊపందుకున్న తరువాత వీటి వాడకం కొంత వరకూ పెరిగిందనే చెప్పవచ్చు. అయితే బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలు ఉన్న ప్రతీ ఒక్కరూ మిలేట్స్వా డితే పరిష్కారం లభిస్తుందని కూడా చెప్పలేమని అంటున్నారు వైద్యులు.

ఎందుకంటే ఒక వ్యక్తికి హై బీపీ కానీ షుగర్ కానీ అతడి ఆహారపు అలవాట్లు వల్ల వచ్చిందా లేదా అతని వత్తిడులు/వ్యసనాలు వచ్చిందా అనేది ముందుగా నిర్ధారణ చేయాలి. అలా కాకుండా వత్తిడి ద్వారా వచ్చిన రోగాలకు మిలేట్స్ ద్వారా పరిష్కారం చేయాలని ప్రయత్నం చేస్తే ఫలితం ఉండదు. ఈ మధ్య కాలంలో మిలేట్స్ కేన్సర్రో గాన్ని కూడా నివారిస్తుంది అనే ప్రచారం కూడా బాగా విస్తృతంగా కనిపిస్తుంది. కానీ శాస్త్రీయమైన ఆధారాలు లేకుండా ఇటువంటి ప్రచారాలు ఏ విధంగానూ హేతుబద్దం కావని వైద్యులు ఖండిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చిరుధాన్యాలు తీసుకునేటప్పుడు ఎక్కువగా నీటిని తీసుకోవాలి. వీటిని తినేటప్పుడు బాగా ఉడికించాలి. అన్ని ఆనారోగ్య సమస్యలు కలవారికి ఒకే రకమైన మిల్లెట్లుతీసుకోకూడదు. కొన్ని రకాల మిల్లెట్స్ కొన్ని సీజన్లలో మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో శరీరానికి చలువ
చేసే జొన్నలు, రాగులు, ఊదలు, సామలు వంటి తగిన మోతాదులో తీసుకోవాలి. వీటితో తయారుచేసిన జావలు చలికాలంలో గోధుమలు, బియ్యం అరికలు, ఊదలు, సజ్జలు,
తాగడం వల్ల శరీరం డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. బా మొదలైనవి తీసుకోవాలి. ఇవి శరీరానికి తగిన వేడిని అది లంలో వచ్చే జీర్ణ సమస్యలను తొలగిస్తాయి. కేవలం ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని వాడటం మొదలు పెట్టినా కొద్ది రోజుల్లోనే వాటిని పక్కన పెట్టి పాలిష్ధా న్యాల వైపుకు మళ్ళినవారు కూడా లేకపోలేదు.

Millets for Health

ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని వారి గోధుమ
ధాన్యాలను ఒకేసారి పక్క పెట్టడం కాకుండా నెమ్మదిగా దానిని మన జీవన శైలిలో భాగం చేసుకోవాలి. లేకపోతే కొన్ని రోజుల్లోనే మిలెట్స్న చ్చక వాటిని పక్కన పెట్టేసే ప్రమాదం కూడా
ఉంది. అనేక మంది ఘనంగా వీటిని వాడటం మొదలు పుట్టినా కూడా కాలగమనంలో మళ్లీ వరి,
గోధుమ వైపు మళ్ళినవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీటిని ఆకర్షింప చేసే ఉద్దేశంతోనే
మిల్లెట్స్ తో బజ్రా ప్లేక్స్, జొన్న ప్లేక్స్, జొన్న పిండితో పాన్కేక్ మిక్స్, రాగి, జొన్న దోస మిక్స్, రాగితో తయారు చేసిన డెజర్ట్ మిక్స్ వంటి ఉత్పత్తులను నూతన ఆవిష్కరణలు చేయడం మొదలు పెట్టారు. చిరుధాన్యాల వినియోగానికి ప్రాచుర్యం కల్పించే బృహత్తర ఆశయాన్ని ఆచరణలో చూపగలిగితే అటు రైతులకు, ఇటు వినియోగదారులకూ సంతోషాన్ని పంచగలదు.

ప్రోత్సాహక కార్యక్రమాలు

భారతదేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఒకప్పుడు పేదవాడి ఆహారంగా పేర్కొన్న ఈ చిరు ధాన్యాలు నేడు భాగ్యవంతులు ఆహారంగా మారింది. వీటి సప్లై తక్కువగా ఉండటం వలన ధరలు పెరిగిపోయి సామాన్యులకు అందుబాటులో లేవు. దీని వల్ల వలన భాగ్యవంతులు ఉపయోగించిన వరి గోధుమ ఆహారం పేద వారి కంచంలోకి చేరాయి.

చిరు ధాన్యాలు అందరికీ అందుబాటులోకి రావాలం వాటి సప్లై పెంచాలి. సాధారణంగా వరి గోధుమలతో పోలిస్తే వీటి దిగుబడి బాగా తక్కువ. ఫలితంగా సప్లై తక్కువగా ఉండిమాండ్ పెరగడం వలన ధరలు పెరిగి పోతున్నాయి. మిలేట్స్సా గు కన్నా వరి, గోధుమ సాగు లాభదాకాయకంగా ఉండటం చేత రైతులు మిలేట్స్ సాగుకు మొగ్గు చూపడం లేదు. కాబట్టి ముందుగా మిలేట్స్ సాగులో పరిశోధనలు విస్తృతం చేసి అధిక దిగుబడి వచ్చేటట్లు చేయాలి. దానితో పాటు కనీస మద్దతు ధరలు ప్రకటించడం ప్రధానంగా ప్రభుత్వమే వీటిని సేకరించగలిగితే రైతులు వీటి సాగుకు ముందుకు వస్తారు. అదే సమయంలో వినియోగదారులకు తక్కువ ధరలకే మిలేట్స్ అందుబాటులోనికి వస్తాయి.

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/adulteration-of-food-and-its-impact/cover-stories/525642/



గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870