हिन्दी | Epaper
అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’

Freedom Struggle: మువ్వన్నెల వికసిత భారత్

Hema
Freedom Struggle: మువ్వన్నెల వికసిత భారత్

Freedom Struggle: మువ్వన్నెల వికసిత భారత్మన సంపదను దోచుకున్న బ్రిటిషువారు ఎందరో మహనీయులు పుట్టిన పుణ్యభూమిభారతదేశం. మనదేశంపై అనేక దేశాలవారుదండయాత్రలు చేశారు. వందల సంవత్సరాలుభారతదేశాన్ని విదేశీయులు పాలించారు. కొందరుఅన్నదమ్ములవలే కలసిపోయిమనప్రజలకు మేలుజరిగేవిధంగా పాలించారు.

మరికొందరు ఇక్కడ సంపదను తమ దేశానికి తరలించారు.అలా ఇక్కడి సంపదను దోచుకున్నవారిలో బ్రిటిషువారు ఒకరు.

రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యం అని చెప్పుకునే వీరు ఈస్టిండియా కంపెనీని స్థాపించి వ్యాపారం పేరుతో మనదేశానికివచ్చి, ఈ పుణ్యభూమిపై పాతుకుపోయి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నారు. దాదాపు 200 సంవత్సరాల పాటు మనదేశాన్ని బ్రిటిషువారు పాలించారు. అయితే మనదేశానికి మేలు చేసిన బ్రిటిషు వ్యక్తులఅతితక్కువ సంఖ్యలో ఉన్నారు.

ధవలేశ్వరం ఆనకట్ట రూపకర్త సర్అర్థన్ కాటన్ వలన గోదావరిజిల్లాలు ధాన్యాగారంగా మారాయి. విలియం బెట్టిక్సతీసహగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేశాడు. రిప్పన్ స్థానిక స్వపరిపాలను ప్రవేశపెట్టాడు. మన సంపదను ఒకచోటు నుండి మరో చోటకు తరలించడానికి వారి స్వార్థం కోసం రోడ్డు, రైలు మార్గానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో వచ్చిన కొన్ని వ్యాధులకు బ్రిటిషు శాసనాన్ని అనుసరించి జనాభాను లెక్కించడానికి పదేళ్లకాలం పట్టింది. భారతదేశంలో అక్షరాస్యులు ఎంతమంది ఉన్నారని తెలుసుకునేందుకు జనాభా(population) లెక్కలను మొదలెట్టారు. బ్రిటిషు వారి నుండి మనవారు ఆంగ్లభాషను నేర్చుకున్నారు. అది తొలగించేందుకు శాయశక్తులా కృషి చేశారు. మేలు తక్కువ-కీడు ఎక్కువ వేళ్లపై లెక్కించదగిన వారు ఇటువంటి కొన్ని మంచి పనులు
చేశారు.

బ్రిటిషు పాలనలో మనకు మేలు తక్కువగా జరిగి కీడు ఎక్కువగా జరిగింది. మంచి వ్యక్తులను మినహాయిస్తే బ్రిటిషువారివల్ల మనదేశంఆర్థికంగా చాలానష్టపోయింది. ప్రజలమాన, ప్రాణాలకు
రక్షణ కరువైంది.వారి పాలనను వ్యతిరేకించి స్వాతంత్ర్యాన్ని కోరుకుంటూ మన ప్రజలు
లక్షలాదిమంది ప్రాణత్యాగం చేశారు. ఒకవైపు స్వాతంత్య్ర పోరాటం జరుగుతూ ఉండగానే బ్రిటిషువారు మన సంపదను తమ దేశానికి తరలించారు. విభజించు పాలించు అనే సూత్రం
ఆధారంగానే వారు పరిపాలన చేశారు. హిందూ(Hindu),ముస్లింల మధ్యకొట్టాలు పెట్టేవారు. అన్నదమ్ముల్లా జీవిస్తున్న రాజుల స్నేహాన్ని విభజించి శత్రుత్వం పెంచేవారు. ఇలా మనలో మనమే తన్నుకు చచ్చేలా చేసి మన సంపదను వారి దేశమైన ఇంగ్లండుకు తరలించేవారు. అన్యాయం, కర్కశం, అత్యాశ, నరమేధం వంటిపాశవికమైన సూత్రాలపైనే నాటి తెల్లదొరల పాలన సాగింది.
నేటికీ బ్రిటన్ రాజకుటుంబీకులు ధరిస్తున్న ఆభరణాలలో మనదేశానికి చెందినవి చాలా ఉన్నాయి. ప్రపంచంలో చాలాదేశాలను బ్రిటిషు వారు దోచుకున్నప్పటికీ మనదేశం
ముందువరసలో ఉంటుంది. ఆఫ్రికాలో ప్రజల్ని బానిసలుగా చేసుకుని అమ్మేవారు, చైనాలో మత్తుమందు వ్యాపారం చేశారు. 1750 ప్రాంతంలో భారతదేశం చాలా ధనికదేశం. వస్త్రాలు,
చక్కెర, సుగంధద్రవ్యాలు ఒకటేమిటి అనేక ఆహార వస్తువుల్ని,ముడి సరకుల్ని మనదేశం నుండి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేవి. బ్రిటిషువారు మనకు పన్ను చెల్లించేవారు. కాదు. మనచేతే పన్నులు కట్టించి భారతీయుల్ని బానిసలుగా చేసి ఉపయోగించుకునేవారు. డబ్బు ఆశ
చూపి మన ప్రజల్లో కొందరినిలోబరచుకుని వారి తొత్తులుగా చేసుకుని గూఢచారులుగా ఉపయోగించుకున్నారు. ఈ విధంగా లంచం తీసుకోవడం అనేది వారి నుండి మనవారు నేర్చుకున్నారని చెప్పవచ్చు. మన సంపదంతా ఇంగ్లండుకు తరలి వెళ్లేది. అలా
జరగకుండా ఉంటే అనేకమంది విదేశీయులు మనదేశంతో వర్తక, వాణిజ్యాలు చేసి మనం ఇంకా అభివృద్ధిపథంలో పరుగులు తీసేవారం. అటువంటి దేశ సంపదను దోచుకుని సర్వనాశనం
చేశారు.

రత్నగర్భ భారతదేశం:

బ్రిటిషువారు రాకమునుపు మనదేశం సిరిసంపదలతో తులతూగింది. భారతదేశాన్ని రత్నగర్భ అని పిలిచేవారు. వీధుల్లోకూరగాయలు అమ్మినట్లు వజ్రాలు,వైఢూర్యాలు అమ్మేవారు.బ్రిటిషువారు 1747 నుండి 1947 వరకు మనదేశాన్ని 200 సంవత్స రాలు పరిపాలించి, మన సంపదను దోచుకుని
వారి దేశానికి తరలించిన తరువాత మనదేశం దయనీయస్థితికి చేరుకుంది. ఇటువంటి నిజాలు నేటి యువతకు చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. మన యువతలో ఎక్కువమంది
సామాజిక మాధ్యమాలలో రీల్స్ చేస్తూ, రీల్స్ చూస్తూ రాత్రికి రాత్రి సెలబ్రెటీస్అ య్యామనే భ్రమల్లో బతుకుతూ కాలాన్ని,జీవితాన్ని వృథా చేసుకుంటున్నారనేవిషయం సర్వవిధితమే. మరి కొందరైతే అసత్యవార్తలను నిజమైన వార్తలుగా చరిత్రను వక్రీకరిస్తూ, ప్రజలను పక్కదారి పట్టిస్తూ, మా కులం గొప్ప, మా మతం గొప్ప, మా ధర్మాన్ని మించిందిలేదని ఊసుపోని కబుర్లతో
సామాజిక మాధ్యమాలలో సమయాన్ని వృధా చేసుకుంటూ తమ జీవితాన్ని తామే బుగ్గిపాలు చేసుకుంటున్నారు. జాతీయ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయినా వీరికి పట్టదు. ధరలు
ఆకాశాన్ని అంటినా చీమ కుట్టినట్లు కూడా ఉండదు. మత హింసలతో దేశం అట్టుడిగిపోయినా మనకు సంబంధం లేని విషయంగా భావిస్తూ సామాజిక మాధ్యమాలలో హీరోయిజం చూపిస్తూ తామే సెలబ్రిటీలు అనే భ్రమల్లో బ్రతుకుతూ జీవితాన్ని బూడిదలో పోసిన పన్నీరులా చేసుకుంటున్నారు. యువత సృజనాత్మ, ఆలోచనా శక్తి పెంచుకుని మంచి, చెడు, సత్యం,
అసత్యంల మధ్య తేడాను తెలుసుకుని మసలుకుంటే గోబెల్స్ప్ర చారం చేసేవారి ఆటలు అరికట్టి దేశాన్ని కాపాడుకోవచ్చు.

Freedom Struggle

త్యాగధనుల త్యాగాలతో పాటు వక్రీకరించిన చరిత్రకాకుండా
నిజమైన చరిత్రను యువత తెలుసుకున్నప్పుడు దేశానికి మేలు జరుగుతుంది. ఆ విషయాలను పక్కనపెడితే బ్రిటిషువారు భారతదేశాన్ని పరిపాలించిన కాలంలో జలగలు రక్తాన్ని పీల్చినవిధంగా మనదేశం నుండి ఎంత సంపద దోచుకుని వెళ్లారు అనే విషయం ముఖ్యంగా నేటియువతతోపాటు భారతీయులందరికీ తెలియవలసిన విషయం. బ్రిటిషువారు భారతదేశాన్ని ఆక్రమించిన కొత్తలోనే మన సంపదపై కన్నేశారు. భారతదేశంలో పలు ప్రాంతాలు అనేకమంది రాజులు, సంస్థానాల పాలనలో ఉండేవి. కొందరిని భయపెట్టి మన సంపదను కొల్లకొడితే, మరికొందరిని సామంతులుగా చేసుకుని కప్పం రూపంలో వసూలు చేసి మన సంపదను తమ దేశానికి తరలించారు. అప్పట్లో మొఘల్ చక్రవర్తి నూరుద్దీన్ మహమ్మద్జహంగీర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మొఘల్ దర్బార్లో
తులాభారం జరుగుతోంది. బంగారు తాపడం చేసిన తాసులో ఒకపళ్లెంలో మొఘల్ చక్రవర్తి కూర్చుని ఉంటే, మరో పళ్లెంలో వెండి, బంగారు నాణేలు, ఆభరణాలు, విలువైన వస్తువులు తూకం వేసి పేదలకు పంచిపెడుతున్నారు. ఇదంతా అక్కడే దర్బార్లో ఓ మూల నిల్చొని బ్రిటిషు రాయబారి ‘సర్ థామస్ రో’ గమనిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వాణిజ్య ఒప్పందం కోసం అతను

జహంగీర్ ముందు మోకరిల్లాడు. మూడేళ్లపాటు మొఘలులు చుట్టూ తిరుగుతూ కాళ్లావేళ్లా పడితే చివరకు జహంగీర్ సంరక్షకుడు అహద్ షాజహాన్ను ఒప్పించి సూరత్లో ఈస్టిండియా కంపెనీ

ఏర్పాటుకు అనుమతి పొందారు. ఈ సంఘటనే మనదేశాన్ని దాదాపు రెండువందల సంవత్సరాలపాటు చీకటిలోకి నెట్టేసింది. చివరకు 1803లో ఈస్టిండియా కంపెనీ ఇచ్చే భృతిపై మొఘల్ చక్రవర్తి షా ఆలం ఆధారపడాల్సి వచ్చింది. దీని కోసం ఆ కంపెనీ క్లర్కు ముందు

మోకరిల్లాల్సి దుస్థితి వచ్చింది. అంటే భారత్ నుంచి ఆంగ్లేయులు ఏవిధంగా ఎంత దోచుకుని ఉంటారనేది సునాయసంగా అర్థం చేసుకోవచ్చు.

భారత్ చిరునామా కనిపెట్టిన వాస్కోడిగామా

వ్యాపారం పేరుతో మనదేశంలోకి బ్రిటిషు వారి కంటే ముందు అడుగిడింది ప్రోర్చుగీసు వారు. 1498లో వాస్కోడిగామా యూరప్ నుంచి భారత్కు సముద్రమార్గాన్ని కనిపెట్టాడు. ఆ తర్వాత వాణిజ్యం పేరు చెప్పి దేశంలోకి పోర్చుగీసు వారు ప్రవేశించి భారత వ్యాపారరంగంలో దూసుకునిపోతూ మన వ్యాపారులపై పట్టు, పైచేయి సాధించారు. అనంతరం పోర్చుగీసు తర్వాత డబ్వాళ్లు కూడా భారత్లోకి అడుగుపెట్టారు. ఈసారి వీళ్లు ఫిరంగులు, నౌకాదళంలో రావడంతో ఆ రెండుదేశాల మధ్య యుద్ధాలు మొదలయ్యాయి. ఇదంతా ఓపిగ్గా గమనించిన ఇంగ్లండ్ సమయం కోసం చేసి చూసింది. సమయం చిక్కగానే 1608లో భారత్లో ఈస్టిండియా కంపెనీని మొదటి క్వీన్ ఎలిజబెత్ కాలంలో అడుగు పెట్టడం జరిగింది. భారత్తో వాణిజ్యం కోసం బ్రిటిషురాయబారి సర్దమన్రో చాలానే కష్టపడ్డాడు. ఎందుకంటే మొఘల్

చక్రవర్తి దృష్టిలో ఇంగ్లండ్ పెద్దగా ప్రాధాన్యం లేని ఒక చిన్న దీవి.దానిని ఒక సామ్రాజ్యంతో పోల్చడం మొఘలుల పరువు ప్రతిష్ఠలకేభంగం. అయితే సర్ థామస్ తో ధైర్యం కోల్పోలేదు. మూడేళ్లనిర్విరామంగా కష్టపడ్డాడు. దౌత్య ముడుపులు, బహుమతులు ఇచ్చి,చక్రవర్తి జహంగీర్ అనుచరుడు అహద్ షాజహాన్ మెప్పించి,సూరత్ నగరంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి పొందాడు.ఆ కారణంగా మనదేశంలో ఈస్టిండియా కంపెనీ ఏర్పాటైంది.

తీరప్రాంతాలలో వ్యాపార స్థావరాలు

ఆరోజుల్లో ఎగుమతులు, దిగుమతులు సముద్రతీర ప్రాంతాలలో నౌకలు, ఓడల ద్వారా జరిగేవి. మనదేశ సంపదను బ్రిటిషువారు తమ దేశానికి తరలించడానికితీరప్రాంతాలు అనువైనవని గమనించారు. మొఘలుల నుంచి ఆదేశాలు రాగానే ఆంగ్లేయులు భారత్లోని సముద్రతీరం వెంబడి ఉన్న నగరాల్లో ఒక్కొక్కటిగా తమ వ్యాపార స్థావరాలను స్థాపించడం మొదలుపెట్టారు. వీటిల్లో మసాలా దినుసులు, పట్టు, పత్తి, ఇతర వస్తువుల వ్యాపారం ప్రారంభించారు. ఈ వ్యాపారాలలో అద్భుతమైన లాభాలు పొందారు. వ్యాపార పోటీ నేపథ్యంలో ఇతర యూరప్ దేశాలకు ఇంగ్లండ్కు మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. దీంతో సరుకులను దోచుకోవడానికి తీర ప్రాంతాలలో ఉన్న వ్యాపార కేంద్రాలను కోటలుగా మార్చేశారు. భారీగా సిపాయిలను నియమించుకుని తమ బలాన్ని పెంచుకున్నారు.

మొఘలుల దుస్థితి

వందలాది సంవత్సరాలు మతసామరస్యంతో అనేకమంది మొఘలు చక్రవర్తులు రాజ్యమేలారు. అన్నిమతాల వారిని తమ సైన్యంలో చేర్చుకున్నారు. ఇక్కడి మహిళలనే వివాహం చేసుకున్న వారు కూడా ఉన్నారు. చివరకు ఈ మట్టిలోనే కలిసిపోయారు. అందుకు సాక్ష్యం హుమయూన్ సమాధి ఢిల్లీలోను, అక్బర్ సమాధి ఆగ్రా సమీపంలోని సికంద్రాలోను, ఔరంగజేబు సమాధి ఔరంగాబాద్ లోను మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఇంత వైభవంగా రాజ్యమేలిన మొఘల్ చక్రవర్తుల పరిస్థితి చివరకు
దారుణంగా మారిపోయింది. 1803లో ఢిల్లీ సింహాసనంపై ఉన్న మొఘల్ చక్రవర్తి షా ఆలం ఈస్టిండియా కంపెనీ ఇచ్చే భృతిపై ఆధారపడాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు బ్రిటిషు రాయబారి సర్ థామస్ లో మొఘల్ చక్రవర్తి ముందు వంగి ఒప్పందం చేసుకున్నాడు. ఆ తరువాత అదే మొఘల్ పాలకులు ఈస్టిండియా కంపెనీలోని ఒక క్లర్క్ ముందు మోకరిల్లి బెంగాల్ను అప్పగించాల్సిన దుస్థితికి చేరారు. బెంగాల్ ఆక్రమణ తర్వాత ఒక్కో సంస్థానాన్ని సొంతం చేసుకుంటూ ఈస్టిండియా కంపెనీ ముందుకు సాగుతూ తమ సామ్రాజ్యాన్ని స్థాపించింది

సిపాయిల తిరుగుబాటు

1857లో సిపాయిల తిరుగుబాటుతో ఈస్టిండియా కంపెనీ పతనం ప్రారంభమైంది. సిపాయిల తిరుగుబాటుతో యుద్ధంలో భారీగా పాత చోటుచేసుకుంది. దేశమంతటా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే అప్పుడు ఉన్న వార్త పత్రిక ద్వా భారత్లో జరుగుతున్న పరిస్థితుల గురించి ఇంగ్లండ్కు తెలిసిపోతూ ఉండేది. దీంతో భారత్లోని ప్రజల నుంచి వ్యతిరేకతను తగ్గించేందుకు ఇంగ్లండ్ పార్లమెంట్లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాటి కారణంగా భారతదేశాన్ని నేరుగా బ్రిటిషు ప్రభుత్వం కిందకు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈస్టిండియా కంపెనీ కొన్ని సంవత్సరాలు మాత్రమే అక్కడక్కడ పనిచేసింది. వందలాది సంవత్సరాల సుదీర్ఘ పాలన తర్వాత చివరకు 1 జూన్ ఈ కంపెనీ రద్దయింది. బ్రిటిషు క్రూరమైన |వలస పాలనలో 1880 నుండి 1920 మధ్య భారతదేశంలో 165 మిలియన్ల అదనపు మరణాలు సంభవించాయి. రాణి వేలు నాచియార్ భారతదేశంలో బ్రిటిషు వలసరాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన మొదటి రాణి.
ఆమెను తమిళులు వీరమంగై అని పిలుస్తారు.ఇలాఎంతోమందిపోరాటాలు,ప్రాణత్యాగాల తర్వాత 15 ఆగస్టు 1947 అర్ధరాత్రి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశానికి స్వాతంత్య్రం
ప్రకటించి వెళ్లిపోయింది. బ్రిటిషువారు మన దేశ సంపదను రాత్రికి రాత్రి
దోచుకుని వెళ్లలేదు. 200 సంవత్సరాల పాలనా కాలంగా దశల వారీగా
అవకాశం లభించిన చోట దొరికింది  దొరికినట్లు దోచుకుని ఓడల్లో తమ దేశానికి తరలించారు. 1947లో మనకు స్వాతంత్ర్యం ప్రకటించి బ్రిటిషు ముష్కరులు భారత్ నుంచి తమ దేశానికి వెళ్లిపోయేటప్పుడు మన దేశానికి చెందిన లెక్కలేనంత సంపదను నౌకలలో తరలించుకునివెళ్లారు.

బ్రిటిషు మ్యూజియంలో మన సంపద

 బ్రిటన్కు చెందిన ది గార్టెయన్ పత్రిక బ్రిటిషువారు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల నుండి ఎంత సంపదను దోచుకుని వచ్చారని ఆధారాలతో సహా గతంలో అద్భుతమైన వ్యాసాన్ని నివేదిక రూపంలో ప్రచురించింది. ఆ వ్యాసం ప్రపంచ వాప్తంగా సంచలనాన్ని కలిగించడమే కాక బ్రిటన్ రాజ కుటుంబీకులకు ముచ్చెమటలు పట్టించింది. ఆ తరువాత బి.బి.సి. తో పాటు ప్రపంచంలో అనేక దేశాల పత్రికలు ఇదే విషయమై సంచలన వ్యాసాలు రాయడంతో ప్రపంచ వాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. వ్యాపారం పేరుతో ప్రపంచంలోని అనేక దేశాలలో పాగా వేసిన బ్రిటిషువారు.
తరువాత వలస పాలకులుగా మారారు. అలా వారు ప్రపంచంలోని అన్ని దేశాలను దోచేసి ఆ సంపదను తమ దేశానికి తలించారు. అయితే హెచ్చు సంపదను భారతదేశం
నుండే దోచుకుని వెళ్లారు. దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యంగా బ్రిటిషు వలస పాలన సాగింది. ఇది చరిత్ర కాదనలేని సత్యం. రెండు శతాబ్దాల పాటు భారత్ను తెల్లదొరలు దోచుకున్నారు. ఇండియా నుంచి బ్రిటిషువారు ఆ కాలంలో తమ దేశానికి తలించిన సంపదను ప్రస్తుత విలువలో లెక్కకడితే దాదాపుగా 45 ట్రిలియన్ డాలర్లకు సమానమని నిపుణులు చెబుతున్నారు.కలప కోసం బ్రిటిషువారు మన అడవుల్ని నాశనం చేసారు. ఎర్ర చందనం, గంధపు చెక్కను కూడా తమ దేశాలకు తరలించారు. వాణిజ్యం కోసం అస్సోం, ఊటీ, కేరళ వంటి అనేక ప్రాంతాలలో తేయాకును పండించి తమ దేశానికి
ఎగుమతి చేసుకున్నారు. కేరళలో అయితే బ్రిటిషువారు నిర్మించిన టీ ఫ్యాక్టరీలు ఇప్పటికీ ఉన్నాయి. కేరళ నుండి ముడి రబ్బర్ను తమ దేశానికి తరలించారు. ఇలా ప్రతీ వాణిజ్యం పంటను దోచుకుని వెళ్లారు. పత్రికా స్వేచ్ఛను హరించారు. బ్రిటిషువారు వార్తపత్రికలకు, ప్రింటింగ్ ప్రెస్లకు లైసెన్సులను జారీ చేసేవారు. వారికి ఇష్టమైన వారికే అనుమతిస్తూ అన్ని తమ నియంత్రణలో ఉండేలా చేసేవారు. వార్తలను సెన్సార్ చేసేవారు. బ్రిటిషువారికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే దేశద్రోహం కేసులు నమోదు చేసేవారు. ఇలా బ్రిటిషువారు మన దేశంలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. కానీ మనం బ్రిటన్ రాణి కిరీటంలో ఉన్న కోహినూర్ వజ్రం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. నిజానికి భారతీయ సంస్కృతి, చరిత్రను తెలియజేసే ఎన్నో వెలకట్టలేని కళాఖండాలను మన దేశం నుంచి ఎత్తుకెళ్లారు తెల్లదొరలు. ఇప్పటికీ బ్రిటన్లోని పలు మ్యూజియాల్లో చెక్కుచెదరకుండా అవి ఉన్నాయి. కోహినూర్తో పాటు వీటిని కూడా తిరిగి ఇవ్వాలన్న డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. మన దేశం నుండి బ్రిటిషువారు దోపిడి చేసి తమ దేశానికి తలించిన వాటిలో లెక్కలేనన్ని బంగారు నగలు
ఉన్నాయి. ఇంగ్లండ్ రాణి ప్రతిరోజూ ఒక ధరించినా కొన్ని సంవత్సరాల పాటు ధరించగలిగిన విలువైన ఆభరణాలు వేల సంఖ్యలో ఉన్నాయని అంచనా. బ్రిటిషు వలస పాలకులు అత్యధిక సంపద దోచుకున్న దేశాల జాబితాలో భారత్ ముందు
వరసలో నిలుస్తుంది. ఆ సంపదఇప్పుడు మన చేతిలో ఉంటే మన దేశ పరిస్థితి మరోలా ఉండేది. పాలన పేరుతో దశాబ్దాల పాటు భారత్ను దోచుకున్నారు. బంగారం, వజ్ర వైఢూర్యాలు మొదలుకొని విలువైన సంపదను తమ దేశానికి తరలించుకుపోయారు. బ్రిటిషువారు మన దేశాన్ని
వదిలిపోయేనాటికి ఇక్కడ ఇంకేమీ మిగల్లేదనేని నగ్నసత్యం. ఇప్పుడు ఆ సంపదంతా బ్రిటిషు రాజ ప్రాసాదాలతో పాటు బ్రిషు మ్యూజియంలో మూలుగుతుంది. ఔరంగజేబు పాలనా కాలంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. అటువంటి రత్నగర్భను దోచుకుని మన ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు.

అప్పట్లో బ్రిటిష్వారు మన దేశం దోచుకెళ్లిన సంపదల్లో ముఖ్యమైనవి..

కోహినూరు వజ్రం ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొల్లూరు గ్రామంలో దొరికిందని కొందరు తెలియక ప్రచారం చేస్తుంటారు. ఇది అసత్యం. కోహినూర్ వజ్రం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పల్నాడు జిల్లా సత్తెనపల్లి సమీపంలో బెల్లంకొండ సమీపంలోని కోళ్లూరు గ్రామంలో కృష్ణానది ఒడ్డున దొరికింది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉన్న కోళ్లూరులో వజ్రాల గనులున్నాయి. ఈ ప్రదేశంలో వజ్రాలు పుట్టడమే కాకుండా కొట్టుకుని వచ్చాయి. ఆ కాలంలో కాకతీయులు, కుతుబ్షాహీల కాలంలో ఈ వజ్రాలు ఆయా రాజ్యాలకు అదనపు  ఆదాయాన్ని సమకూర్చాయి. 13వ శతాబ్దానికే కోళ్లూరు వజ్రాల గనులు చాలా ప్రాచుర్యం పొందాయి. 17వ శతాబ్దం వరకు ఈ గనులలో వజ్రాలు తవ్వారు కోహినూరు వజ్రం క్రీ.పూ.3 వేల సంవత్సరాల కాలం నాటిదని పరిశీలకులు నిర్ణయించారు. కొందరైతే కోహినూరు వజ్రమే శమంతకమణి అని అసత్య ప్రచారాలు చేస్తుంటారు. శమంతకమణి అయితే దాన్ని సానబట్టి మెరుగులు దిద్దవలసిన అవసరం లేదు. ఈ వజ్రం బ్రిటిషువారి చేతికి వెళ్లిన తరువాత సానబట్టి మెరుగులు దిద్ది, రాణి కిరీటంలో అమర్చారు. కోహినూరు వజ్రం ఎవరి నుండి ఎవరికి సంక్రమించిందనే విషయం ప్రస్తావిస్తే అది పెద్ద చరిత్రఅనే చెప్పాలి.

Freedom Struggle

అందువల్ల రేఖా మాత్రంగా తెలుసుకుందాం. మొఘల్ పాలకుడు బాబర్
రాసిన బాబర్నామా ప్రకారం ఇది ఢిల్లీ సుల్తానులలో  చివరివాడైన ఇబ్రహీలోడీని
1526లో మొదటి పానిపట్ యుద్ధంలో ఓడించిన తరువాత కోహినూరు
మొఘల్ చక్రవర్తి బాబర్ చేతికి వచ్చింది. కోహినూరు వజ్ర ఖరీదు ఎంత అనేది బాబర్ చక్రవర్తి మాటల్లో చెప్పాలంటే ‘ప్రపంచానికంతా రెండున్నర రోజులు భోజనం
పేర్కొన్నాడు. బాబర్ నుండి అతని వారసులైన హుమయున్ పెట్టిన అని చక్రవర్తి, షాజహాన్ చక్రవర్తి, ఔరంగజేబ్ చక్రవర్తి, అతని మనుమడు సుల్తాన్ మహమ్మద్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత క్రీ.శ.1739లో పర్షియన్ జనరల్ అయిన నాదిర్ షా
చేతిలో మహమ్మద్ ఓడిపోవడంతో కోహినూర్ నాదిర్ షావశమైంది. నాదిర్ షా మరణం కోహినూరు అహ్మద్ షా దుర్రానీ అధీనంలోకి వచ్చింది. అహ్మద్ షా వంశస్థుడైన షా షుజా దురానీ కాబూల్లో గొడవలు జరగడంతో సోదరుల నుండి తప్పించుకుని 1813లో పంజాబ్కు చేరతాడు. ఇతని సామ్రాజ్య స్థాపకుడైన రంజిత్ సింగ్ చేతికి కోహినూర్ వజ్రం ద్వారా పంజాబ్లో సిక్కుఅందుతుంది. రంజిత్ సింగ్ మరణించిన తరువాత అతని ముగ్గురు కుమారుల్లో ఒకడైన దులీప్ సింగ్ 1843లో సింహాసనాన్నిఅధిష్టించి పాలన చేశాడు. ఆ సమయంలో కోహినూర్ అతనికి దక్కింది. అనంతరం 1849లో జరిగిన రెండవ ఆంగ్లో-సిక్కు
యుద్ధంలో బ్రిటిషువారు విజయం సాధించారు. లాహోర్ ఒప్పందం ప్రకారం పంజాబ్ సిక్కు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో జరిగిన ఒప్పందంలో కోహినూరు అనే వజ్రాన్ని లాహోర్ మహారాజు ఇంగ్లండ్ రాణికి అప్పగించాలని
నిర్ణయించారు. క్రీ.శ. 1852లో కోహినూరు వజ్రాన్ని విక్టోరియా మహారాణికి బహూకరించినట్లు తెలుస్తుంది. చివరకు అది బ్రిటన్ రాజవంశీయుల కిరీటంలోకి చేరింది.

నెమలి సింహాసనం

బ్రిటిషువారు మన దేశం నుండి దోచుకుని వెళ్లిన అతి విలువైన వస్తువులలో నెమలి సింహాసనం ఒకటి. అద్భుతమైన సింహాసనం ఈ రోజుల్లో ప్రపంచానికి హిందీలో మయూర్ సింఘాసన్, ఉర్దూలో తఖ్-ఏ-తావూస్ అని పిలిచేవారు. తఖ్ అంటే సంహాసనం. తావూస్ అనగా నెమలి అని
అర్థం.అయితే మొఘల్ కాలంనాటి చరిత్రకారుడు ఇనాయత్ ఖాన్ తన షాజహన్నామా’లో రాసిన దాని ప్రకారం నెమలి సింహాసనం కోటి మొఘల్ రూపాయిల విలువ ఉంటుంది. 14 లక్షలు వజ్రాలు, 86 లక్షలు ఇతర రత్నాలను దీని తయారీ కోసం ఉపయోగించమని సుల్తాన్ ఆదేశించినట్లు పేర్కొన్నాడు. మొత్తం మీద రెండు తాజ్మహళ్లు నిర్మించినంత ధనాన్ని నెమలి సంహాసనాన్ని నిర్మించడానికి ఖర్చు చేశారని తెలుస్తుంది. ఢిల్లీ ఎర్రకోటలోని దివాన్-ఎ-ఖాస్ దీన్ని ఉంచారు. సింహాసనం 1150 కిలోల బంగారం, 230 కిలోల విలువైన రత్నాలు, పచ్చలు ఇందులో
పొదిగారు. 1739లో పర్షియా రాజు నాదిర్షా మన దేశంపై దండెత్తి నెమలి సింహాసనాన్ని ఇరాన్కు తీసుకుని వెళ్లాడు. నాదిర్షా ద్వారా ఇది మహమ్మద్ రెజా షాహ్ పహ్లానీ వద్దకు చేరింది. 1747లో
నాదిర్ఘా చనిపోయిన తరువాత నెమలి సింహాసనం తిరిగి భారత్కు చేరింది. 1857 సిపాయిల తిరుగుబాటు వరకు నెమలి సింహాసనం మన దేశంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కొందరి వాదన ప్రకారం కోహినూరు పొదిగిన అసలైన నెమలి సింహాసనాన్ని బ్రిటిషువారు
ఏనాడో తమ దేశానికి తరలించారని తెలుస్తోంది.ప్రస్తుతం 120కి పైగా అరుదైన శిలలపై చెక్కిన చలువరాతి శిల్పాలు, శాసనాలు బ్రిటన్ మ్యూజియంలో ఉన్నాయి. 33ఏ గది నిండా ఆంధ్రప్రదేశ్లోని అమరావతి నుండి దొంగిలించిన అపురూప శిల్పాలతో నింపేశారు. ఇక్కడ వందలాది సంవత్సరాల నాటి
అరుదైన బౌద్ధ శిల్పాలు చూడవచ్చు. అమరావతిలో 1800లో జరిగిన తవ్వకాలలో అనేక బౌద్ధ శిల్పాలు బయట పడ్డాయి. వాటిని అప్పటి బ్రిటిషు అధికారులు లండన్ మ్యూజియంకు తరలించారు. అమరావతి మార్బల్స్న ప్రస్తుతం లండన్లోని
బ్రిటిష్ మ్యూజియంలో తిలకించవచ్చు. సుమారు 70 ప్రఖ్యాతి గాంచిన అమరావతి మార్బల్స్ ని మనం మ్యూజియంలో చూడవచ్చు. రమారమి 140 సంవత్సరాల క్రితం ఈ మార్బల్స్ మద్రాస్ నుండి బ్రిటన్కి చేరవేశారు. గత 30 ఏళ్లుగా వీటిని మ్యూజియంలో పర్యాటకులు చూస్తున్నారు. ఇంకా తంజావూరుపెయింటింగ్స్, అరుదైన శిల్పాలు ఇక్కడ చూడవచ్చు. బ్రిటిషువారు దోచుకుని వెళ్లిన వాటిలో 17వ శతాబ్దంలో మైసూరును పాలించిన చక్రవర్తి టిప్పుసుల్తాన్ 1799లో యుద్ధభూమిలో మరణించగా ఆయన శవం నుంచి ఉంగరం,దోచుకుని వెళ్లి బ్రిటన్లోని వేర్వేరు మ్యూజియంలలో పెట్టారు. ఖడ్గం, అత్తరు, చెక్కతో చేసిన పులిబొమ్మ.. ఇత్యా వస్తువులను టిప్పుసుల్తాన్ ఉంగరాన్ని మాత్రం 1,45,000 పౌండ్లకు వేలం పెట్టింది. దాన్ని మన దేశానికి చెందిన విజయ మాల్యా  దక్కించుకున్నారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్కి చెందిన విలువైన వైన్ కప్ని కల్నల్
చార్లెస్ సేటోన్ గుత్రియే 19వ శత్బాదంలో దొంగిలించి బ్రిటనికి చేరవేసాడు. 1962వ
సంవత్సరంలో లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో వైన్ కప్ని
ఉంచారు. అది ఇప్పటికీ అక్కడనే ఉంది. ఈ పాత్ర మెడ వంచి మెలిక తిరిగిన పక్షి.
ఆకారంలో కనిపిస్తుంది. ఈ పాత్రలో షాజహాన్ చక్రవర్తి మద్యం సేవించేవారు. దీన్ని
క్రీ.శ.1657లో తయారుచేసినట్లు చరిత్ర చెబుతోంది. 9వ శతాబ్దానికి చెందిన అంబికా విగ్రహం మధ్యప్రదేశ్లోని ధర్ ప్రాంతంలో జరిగిన తవ్వకాలలో బయల్పడింది. అది 1886 తరువాత బ్రిటిష్ మ్యూజియంలో కనిపిస్తుంది. బీహార్లోని బగల్పూర్ జిల్లా సుల్తాన్గంజ్ ప్రాంతంలో 1962లో రైల్వే నిర్మాణ సమయంలో బయటపడ్డ బుద్ధ విగ్రహాన్ని ప్రస్తుతం బర్మింగ్రమ్  మ్యూజియంలో చూడవచ్చు. 2.3 మీటర్ల ఎత్తుండే ఈ విగ్రహాన్ని 500 కిలోల రాగితో తయారు చేశారు. ఇది రమారమి 1500 ఏళ్ల నాటిదని తెలుస్తుంది. మధ్యప్రదేశ్లోని ఖజురహో దేవాలయంలో ఉండే హరిహర విగ్రహం అప్పట్లో ఎన్నో చేతులు మారి చివరికి లండన్లోని బ్రిటిష్ మ్యూజియంకి చేరింది. వాటిని తిరిగి భారత్కుతీసుకురావడం కోసం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, యునెస్కో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటితో పాటు కోహినూర్ని ఇండియాకు తీసుకురావాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే ఇంగ్లండు ప్రభుత్వం ఏ డిమాండ్లను లెక్కచేయడం లేదు.
అంతా ఇంగ్లండుక్కు చెందిన సంపదే అని వితండ వాదం చేస్తున్నారు. తిరిగి మన దేశానికి పంపడానికి వారు సుముఖంగా లేనట్లు తేల్చి చెప్పింది

Read also: hindi.vaartha.com

Read also: Healthy Fruits: ఒక్క పండు చాలు.. ఆరోగ్యానికి మేలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870