వంశీ పిటిషన్ పై ముగిసిన వాదనలు.

వంశీ పిటిషన్ పై ముగిసిన వాదనలు.

గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి, అనంతరం ఫిర్యాదుదారుడి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయమై న్యాయపరమైన పరిణామాలు మలుపు తిరుగుతున్నాయి. ఈ కేసులో వంశీ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి, జైలు భద్రత అంశాలపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను గుంటూరులోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఈ రోజు విచారించింది.ఈ పిటిషన్లపై న్యాయవాదుల వాదనలు కొనసాగాయి. వాదనలు పూర్తయిన తర్వాత, కోర్టు తుది తీర్పును రేపటికి వాయిదా వేసింది. వంశీకి జైల్లో మంచం ఏర్పాటు చేయడం, ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే అనుమతి కల్పించాలనే విషయాలపై కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది.ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. వంశీని సాధారణ ఖైదీలతో కాకుండా ప్రత్యేక సెల్‌లో ఉంచడంపై న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిపై జైలు అధికారులు వివరణ ఇచ్చారు. గుంటూరు జైలు సూపరింటెండెంట్ పాల్ కోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం, వంశీ భద్రత కారణంగానే ప్రత్యేక సెల్‌లో ఉంచామని తెలిపారు. జైలులో బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఉన్నారని. వంశీకి భద్రతా పరమైన సమస్యలొస్తాయనే ఉద్దేశంతోనే ఆయనను ప్రత్యేక సెల్‌లో ఉంచామని తెలిపారు.

Advertisements
 వంశీ పిటిషన్ పై ముగిసిన వాదనలు.

వల్లభనేని వంశీ తన ఆరోగ్య పరిస్థితిని ఆందోళనకరంగా పేర్కొంటూ బెడ్ ఏర్పాటు చేయాలని, ఇంటి నుంచి తినడానికి అనుమతించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. వంశీ తరఫున న్యాయవాదులు ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగాలేదని, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయని. రిమాండ్ సమయంలో కూడా సరైన వైద్యం అందించాలనే కోణంలో ఈ పిటిషన్లు దాఖలైనట్లు తెలిపారు.

బెయిల్ పిటిషన్‌

వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ మంజూరు చేయడానికి కారణాలు సుస్పష్టంగా లేవని, ప్రస్తుతానికి బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజే ఎక్కడున్నానో ట్రాక్ చేసి నన్ను అరెస్టు చేశారు. దర్యాఫ్తు చేశాకే అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ కస్టడీ ఎందుకు?’ అంటూ గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ పోలీసులను అడిగారు.

వంశీ అరెస్టు పట్ల వైసీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ వేధింపుల కోణంలో ఈ కేసు నడిపిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, టీడీపీ మాత్రం న్యాయ పరంగా అన్ని రకాలుగా ముందుకెళ్తామని స్పష్టం చేసింది.

Related Posts
ఏపీ లో మున్సిపల్ అధికారుల కీలక ఆదేశాలు
ఏపీ లో మున్సిపల్ అధికారుల కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనిమున్సిపాలిటీల్లో పన్నుల బకాయిల వసూలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని రెండో Read more

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా..!
Hearing of Vallabhaneni Vamsi bail petition adjourned..!

బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం అమరావతి: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్లపై ఎస్సీ, ఎస్టీ స్పెషల్ Read more

Pawan Kalyan : ఈనెల 28న ప.గో జిల్లాలో పవన్ పర్యటన
Pawan Kalyan మరో 15 ఏళ్లు చంద్రబాబే సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 28న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా Read more

నేడు ఏపీలో పింఛన్ల పంపిణీ
Distribution of pensions in

రేపు (ఆదివారం) సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్లు ప్రతి Read more

×