Today the new government will be formed in Maharashtra. Who will be the future CM

నేడు మహారాష్ట్రలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం..కాబోయే సీఎం ఎవరు?

ముంబయి : మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీఎం పీఠం ఎవరు అధిరోహిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సస్పెన్స్‌కు 24 గంటల్లో తెరపడే అవకాశం ఉంది. సోమవారం మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఈ ఎన్నికల్లో 288 సీట్లకు మహాయుతి కూటమి 235 సీట్లు నెగ్గి విజయాన్ని కైవసం చేసుకుంది. అందులో బీజేపీ 132 సీట్లతో ప్రధాన పార్టీగా ఆవిర్భవించింది. అయితే అధికారం చేపట్టడానికి 145 మ్యాజిక్‌ ఫిగర్‌ కాగా, బీజేపీ దానికి ఎంతో దూరంలో లేదు. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సీఎంగా షిండేనే కొనసాగించాలని బీజేపీలోని కొందరు నేతలు సూచిస్తున్నారు.

Advertisements

కాగా, సీఎం పదవిపై కూటమిలోని మూడు పార్టీల నిర్ణయం మేరకు సీఎం అభ్యర్థి ఎవరన్నది నిర్ణయిస్తారని ఫడ్నవీస్‌ సైతం స్పష్టం చేశారు. ‘మహారాష్ట్ర ప్రజలు మహాయుతి కూటమిని నమ్మి అధికారం కట్టబెట్టారు. వారి తీర్పు మాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నది. కలిసి పోటీ చేసి విజయం సాధించిన మేము ఇప్పుడు సీఎం పదవి కోసం ఎలాంటి వివాదాలకు తావివ్వం. దీనిపై కూడా అందరూ కలిసికట్టుగానే నిర్ణయం తీసుకుంటాం. ఏ నిర్ణయం తీసుకున్నా మిగిలిన అందరం దానిని శిరోధార్యంగా భావిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. తాము 100కు పైగా సీట్లను సాధించామని చెప్పి కూటమిలోని పార్టీలను వదులుకునే ప్రసక్తే లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బవాంకులే స్పష్టం చేశారు.

ఇక, మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని శివసేనకు చెందిన మంత్రి దీపక్‌ కేసర్కర్‌ తెలిపారు. తొలి విడుతలో ముఖ్యమంత్రితో పాటు 21 మంది మంత్రులతో ప్రభుత్వం కొలువుదీరనున్నదని విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యమంత్రితో పాటు వీరు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి మినహా మరో 43 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చు. ఇందులో బీజేపీ నుంచి 21, శివసేన (షిండే) పార్టీ నుంచి 12, ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) పార్టీ నుంచి 10 మందికి మంత్రులుగా అవకాశం లభించవచ్చని తెలుస్తున్నది.

Related Posts
CM Chandrababu : అమరావతిలో ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన చంద్రబాబు
Chandrababu performs Bhoomi Puja for construction of house in Amaravati

CM Chandrababu : రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఇంటి నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెల‌గ‌పూడి Read more

PM Modi: దేశసేవ కోసం స్మృతి మందిర్‌ ప్రేరణను పొగడుతూ మోదీ కీలక వ్యాఖ్యలు
PM Modi: దేశసేవ కోసం స్మృతి మందిర్‌

ప్రధాని మోదీ సందర్శించిన RSS స్మృతి మందిర్ - దేశసేవ పట్ల ఉత్సాహపూర్వక సందేశం ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ నాగ్‌పూర్‌లోని RSS (రాష్ట్రీయ స్వయం సేవక్ Read more

సుప్రీంకోర్టులో రాహుల్‌ గాంధీకి ఊరట
సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట

కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల కారణంగా నమోదైన పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు క్రిమినల్ చర్యలను నిలిపివేసింది. జార్ఖండ్ హైకోర్టు Read more

భూగర్భజలాలపై కేటీఆర్ ఆందోళన
భూగర్భజలాలపై కేటీఆర్ ఆందోళన

తెలంగాణలో భూగర్భజల మట్టాలు పడిపోతుండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నాలుగు నెలల్లోనే భూగర్భజల మట్టం Read more

Advertisements
×