CM Revanth Reddy to leave for Delhi this afternoon

CM Revanth Reddy: నేడు మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీకి పయనం కానున్నారని సమాచారం. పార్టీ కీలకనేత కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు సాయంత్రం భేటీకానున్నారు. ఈరోజు, రేపు ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పార్టీ పెద్దలతో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. వీరు ఢిల్లీకి వెళ్తారన్న సమాచారం రాగానే మరోసారి తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది.

Advertisements
image

కేబినెట్ విస్తరణతో పాటు రెండో విడత నామినేటెడ్ పోస్టులపై

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం, ఎస్సీల రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అంశాలపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు. మరోవైపు నియోజకవర్గాల పునర్ విభజనపై ఇటీవల చెన్నైలో జరిగిన సమావేశానికి సంబంధించి రేవంత్ రెడ్డితో చర్చిస్తారని సమాచారం. దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ద్వారా కలిగే నష్టం, రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే దానిపై చర్చించారు. చెన్నై సదస్సులో తీర్మానాలతో పాటు దక్షిణాదిన డీలిమిటేషన్ పై జరుగుతున్న గందరగోళాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర కేబినెట్ విస్తరణతో పాటు రెండో విడత నామినేటెడ్ పోస్టులపై ఢిల్లీ పెద్దలతో రేవంత్ రెడ్డి, భట్టి మంతనాలు జరుపుతారని కాంగ్రెస్ వర్గాల సమాచారం.

Related Posts
IPL 2025 : SRH ఘోర ఓటమి
MI Win

ఐపీఎల్‌ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పరాజయల పరంపర కొనసాగుతోంది. తాజాగా ముంబై ఇండియన్స్‌తో ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో SRH 7 వికెట్ల తేడాతో ఘోర Read more

ఢిల్లీలో బీజేపీ గెలుపు..తెలంగాణ లో కేటీఆర్ సంబరాలు – మంత్రి పొన్నం
ponnam ktr

ఢిల్లీ లో బీజేపీ విజయం సాధించడం తో కేటీఆర్ సంబరాలు చేసుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సారి ఢిల్లీ ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగాయి. Read more

తెలంగాణ లో వరి పంట కొనుగోలు కేంద్రాలు సిద్ధం
Paddy procurement centers a

వరి పంట కొనుగోలు కేంద్రాలను ఒకట్రెండు రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 7139 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వరి సాగు ముందుగా పూర్తైన Read more

గోరంట్ల మాధవ్‌కు పోలీసుల నోటీసులు
Police notices to Gorantla Madhav

అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం అమరావతి: హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ మహిళా కమిషన్ చైర్మన్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×