📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

NTR: మే 18వ తేదీన యమదొంగ సినిమా రీరిలీజ్

Author Icon By Anusha
Updated: April 17, 2025 • 12:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల టాలీవుడ్‌లో  కొత్త ట్రెండ్ మొద‌లైన విష‌యం తెలిసిందే.హీరోల బర్త్‌డేలు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా,పెద్ద పండుగలా సెలెబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్. అభిమానులు సోషల్ మీడియాలో సెలబ్రేషన్లు చేస్తూ, తమ అభిమాన హీరోకి విషెస్ చెప్పడమే కాకుండా, అప్పట్లో విడుదలై సంచలనం సృష్టించిన హిట్ సినిమాలను మళ్లీ రీరిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తున్నారు.ఈ రీ-రిలీజ్ కల్చర్‌ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది.ఎన్టీఆర్ బ‌ర్త్ డే రానుండ‌గా, ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్-రాజ‌మౌళి కాంబోలో వ‌చ్చిన య‌మ‌దొంగ చిత్రాన్ని రీరిలీజ్ చేయ‌నున్నార‌ట‌. 2007లో విడుదలైన సోషియో ఫాంటసీ చిత్రంలో మోహన్ బాబు, ఆలీ, మమతా మోహన్ దాస్, ప్రియమణి, నవనీత్ కౌర్, మాస్టర్ శ్రీ‌ సింహా నటించారు. మోహన్ బాబు యముడిగా, ఎన్.టి.ఆర్. మానవుడిగా అద‌ర‌గొట్టేశారు. ఇందులోని సాంగ్స్ కూడా సూపర్ హిట్‌.

బ‌ర్త్ డే

ఎన్టీఆర్ బ‌ర్త్ డే మే 20న కాగా,ఈ సంద‌ర్భంగా ‘యమదొంగ’ సినిమాను మే 18వ తేదీన రీరిలీజ్ చేస్తున్నారు, ఆ రోజుతో పాటు 19, 20వ తేదీలలో కూడా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తుంది. యమదొంగ’గా ఎన్టీఆర్ హంగామా థియేటర్లలో ఆ మూడు రోజులే ఉంటుంది అని అనుకుంటే పొర‌పాటు ప‌డ్డ‌ట్టే. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణని బ‌ట్టి ఈ మూవీని కంటిన్యూ చేసే ఛాన్సులు కూడా లేకపోలేదు ఈ విషయాన్ని మైత్రీమూవీస్ నిర్మాణ సంస్థ తెలియజేసింది. మైత్రీ అధినేత చెర్రి, ఊర్మిళ నిర్మాతలుకాగా, రమా రాజమౌళి సమర్పణలో ఈ చిత్రం రూపొందింది.

సినిమా ప్రింట్

యుముడి పాత్ర‌లో మోహ‌న్ బాబు చేస్తేనే సినిమా చేయ‌గ‌ల‌నంటూ రాజ‌మౌళి ప‌ట్టుబ‌ట్టాడు.యముడుకి, ఎన్.టి.ఆర్.కు మధ్య యమలోకంలో సాగే డైలాగ్ లు ప్ర‌తి ఒక్క ప్రేక్ష‌కుడిని ఎంత‌గానో అల‌రిస్తుంటాయి.భవిష్యత్తులో కూడా ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా ‘యమదొంగ’ సినిమా ప్రింట్ 8కేలో రీస్టోర్ చేశారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు 4కేలో స్పెషల్ షోస్ వేయడానికి రెడీ అయ్యారు. ఏపీ, తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ఈ సినిమా మళ్లీ విడుదల కానుంది. కొత్త వ‌ర్షెన్‌లో విడుద‌ల కానున్న య‌మ‌దొంగ చిత్రం ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Read Also: Jayasudha : ఫిల్మ్ అవార్డుల జ్యూరీ చైర్‌పర్సన్‌గా జయసుధ

#BirthdaySpecial #FansCelebration #HeroBirthdayVibes #ReReleaseCelebration #SuperHitReRelease #TollywoodTrend Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.