📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

OTT: ఓటీటీలోకి ఓదెల 2 సినిమా ఎప్పుడంటే!

Author Icon By Anusha
Updated: April 17, 2025 • 5:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమన్నా నాయిక ప్రధానమైన పాత్రలను పోషిస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే హార్రర్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలలోను గట్టిగానే కనిపిస్తోంది. అలా ఈ మధ్య వచ్చిన ‘అరణ్మనై 4’ సినిమాలోనూ దెయ్యంగా  ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేసింది. అలాంటి ఆమె ఇప్పుడు దెయ్యాల ఆటకట్టించే మాంత్రికురాలుగా కనిపించనుంది. తమన్నా మాంత్రికురాలిగా కనిపించే సినిమా ‘ఓదెలా 2’.అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందిన ‘ఓదెలా రైల్వేస్టేషన్’ 2022లో థియేటర్స్ లోకి వచ్చింది. హెబ్బా పటేల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఆ సినిమా, ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాంటి ఆ సినిమాకి ఇది సీక్వెల్. ఆ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా పలకరిస్తే, ఈ సినిమా హార్రర్ థ్రిల్లర్ గా అలరించనుంది. సంపత్ నంది కథ – స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఇది.గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇక ఓటీటీ రిలీజ్ కు కూడా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఓదెల 2 డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోవడం విశేషం. అయితే ఏ చిత్రమైనా థియేట్రికల్ రిలీజ్ తర్వాత 4 వారాలకు ఓటీటీలోకి వస్తుందని తెలిసిందే. ఇక ఇటీవల టాక్ కాస్తా బెడిసికొడితే ముందుగానే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి.

కథ

ఓదెలలో తిరుపతి (వశిష్ట ఎన్ సింహా)ను అతడి భార్య రాధ (హెబ్బా పటేల్) చంపేసిన తర్వాత ఊరు అంతా పండగ చేసుకుంటుంది.  రాధ జైలుకు వెళ్లింది. తిరుపతి శవానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. బాడీని ఇంట్లోవారికి అందజేశారు. తిరుపతి శవాన్ని ఊళ్లోకి తీసుకొచ్చారు. ఊళ్లోజనం ఉసురు పోసుకున్నాడన్న కసితో ఊళ్లోవారెవరూ తిరుపతి శవాన్ని చూడ్డానికి కూడా రాలేదు. సరికదా అతని ఆత్మని కూడా శిక్షించాలని నిర్ణయించుకుంటారు. ఊరి పూజారి సలహా మేరకు అతని శవాన్ని నిలువనా నిలబెట్టి, అతని శరీరాన్ని కోడి నెత్తురుతో తడిపి, ఊళ్లో జనం గోళ్లు మూటగట్టి ఆ మూటతో సహా అతన్ని పాతిపెడతారు. అలా నిలువునా పాతిపెడితే అతని ఆత్మకు శాంతి క్షోభకు గురి అవుతుందని వారి నమ్మకం. ఊరి జనం చేసిన పనివల్ల తిరుపతి ఆత్మ నిజంగానే క్షోభ చెందుతుంది. ఆ బాధ కాస్తా పగగా మారుతుంది. తను దెయ్యంగా మారతాడు. ఊర్లో కొత్తగా పెళ్లయిన జంటల్నీ టార్గెట్‌ చేసి, భయంకరంగా చంపతుంటాడు. వేరేవాళ్ల శరీరాల్లోకి ప్రవేశించి వారి ద్వారా తన పనిని పూర్తి చేస్తుంటాడు. ఈ చర్యలవల్ల అమాయకులు బలైపోతుంటారు. అలాంటి సమయంలో తరుణోపాయం కోసం ఊరిజనం జైల్లో ఉన్న రాధను కలుస్తారు. ‘వాడ్ని చంపింది నువ్వే. ఇప్పుడు కాపాడాల్సింది నువ్వే’ అని ప్రాధేయపడటంతో రాధ తన అక్క భైరవి(తమన్నా) గురించి ఊరు జనాలకు చెబుతుంది. ఈ దెయ్యం ఆటకట్టించే శక్తి భైరవికి మాత్రమే ఉందని రాధ ఊరి జనాలకు చెప్పడంతో ఊరిజనం భైరవిని వెతికే ప్రయత్నాలు మొదలుపెడతారు. తన జీవితాన్ని శివుడికే అంకితం చేసిన నాగసాధు భైరవి. మరి భైరవిని ఊరుజనం ఎలా చేరారు? ఊరికి పట్టిన పీడను భైరవి ఎలా వదిలించింది? ఈ క్రమంలో క్షుద్రశక్తితో భైరవి చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ.

విశ్లేషణ

ఈ సినిమా కథ విషయానికొస్తే ఇందులో కొత్తదనం ఏమాత్రం లేదు. రచయిత, దర్శకత్వపర్యవేక్షకుడైన సంపత్‌నంది చెప్పినట్టు ‘ఆత్మ వర్సెస్‌ పరమాత్మ’ అంతే ఈ సినిమా. ఈ పాయింట్‌తో తెలుగుతెరపై లెక్కకు మించిన కథలొచ్చాయి. విజయాలను కూడా అందుకున్నాయి. ఇలాంటి సినిమాల్లో క్లెమాక్స్‌ ఏంటో ఆడియన్స్‌కి తెలుసు. ఆ తెలిసిన విషయాన్ని కొత్తగా చూపిస్తే సినిమా గట్టెక్కినట్టే. ఈ విషయంలో దర్శకుడు అశోక్‌తేజా కొంతమేర సక్సెస్‌ అయ్యాడు. ఫస్ట్‌ షాట్‌ నుంచే కథపై ఆసక్తిని కలిగించాడు. ప్రధమార్ధం అంతా ‘అరుంధతి’ సినిమాను గుర్తు చేస్తుంది. అందులో పశుపతిని అరుంధతి సమాధి చేసినట్టుగానే ఇందులో తిరుపతిని ఊరిజనం సమాధి చేస్తారు. అందులో పశుపతి ఉగ్రభూతంగా మారినట్టుగానే ఇందులోనూ తిరుపతి దెయ్యంగా మారతాడు. అందులో షయాజీ షిండే పాత్రను గుర్తు చేసేలా ఇందులో మురళీశర్మ పాత్ర కనిపించింది. భైరవి పాత్ర ఎంటరైనప్పట్నుంచీ కథ మరోమలుపు తీసుకుంది. అక్కడ్నుంచీ తిరుపతి ఆత్మ, భైరవి మధ్య జరిగే సంఘటనలు ఆడియన్స్‌కి గూజ్‌బంప్స్‌ తెప్పిస్తాయి. ఓ దశలో తిరుపతి ఆత్మను భైరవి ప్రతిఘటించలేని పరిస్థితి రావడం, తిరుపతి ఆత్మ ఇవన్నీ ఉత్కంఠకు గురిచేస్తాయి. 

Read Also: OTT: ఓటీటీలోకి వ‌చ్చేసిన‌ ‘శివంగి’ మూవీ

#AmazonPrimeVideo #Odela2 #OdelaMallanna #ottrelease #SampathNandi #Tamannaah Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.