📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

OTT : ఓటీటీ లో కి కేసరి చాప్టర్ 2 మూవీ ఎప్పుడంటే!

Author Icon By Anusha
Updated: April 20, 2025 • 1:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కేస‌రి చాప్టర్ 2’. ఈ సినిమా జలియన్ వాలాబాగ్ ఘటన ఆధారంగా రూపొందింది. ‘అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ జలియన్‌ వాలాబాగ్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ చిత్రానికి కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించారు.మాధవన్, రెజీనా కసాండ్రా, అనన్య పాండే ముఖ్యపాత్రల్లో నటించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే ఇండియాలో రూ.7.5 కోట్ల నుంచి రూ.8.5 కోట్ల వరకూ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.ఇప్పుడు ఈ సినిమా ఓటీటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. డిజిటల్ ప్రీమియర్ హక్కులను ప్రముఖ ఓటీటీ ‘జియే హాట్ స్టార్’ సొంతం చేసుకుంది. దాదాపు రూ.105 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ మూవీ థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత జూన్ 20కు డిజిటల్ ప్రీమియర్ కానుందని తెలుస్తుంది. 

కథ

అమృత్‌సర్‌కు సమీపంలోని జలియన్‌వాలా బాగ్‌లో సమావేశమైన భారతీయులపై జనరల్ డయ్యర్ ఏప్రిల్ 13, 1919 సంవత్సరంలో విచాక్షణాత్మకంగా జరిపించిన కాల్పుల్లో 1500 మందికి పైగా మృత్యువాత పడ్డటం చరిత్రలో చీకటి రోజుగా మారిపోయింది.అత్యంత దారుణ సంఘటనపై బ్రిటీష్ ప్రభుత్వంపై అడ్వకేట్ సర్ శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్), యువ అడ్వకేట్ దిల్‌రీత్ సింగ్ (అనన్యపాండే) కేసు వేస్తారు. ఆ సంఘటనలో దోషిగా జనరల్ డయ్యర్ అని వాదిస్తారు. శంకరన్ నాయర్ వాదనలను తిప్పి కొట్టడానికి ప్రముఖ ఇండో బ్రిటన్ న్యాయవాది నెవిలే్లే మెక్‌కిన్లే (ఆర్ మాధవన్)ను రంగంలోకి దించుతారు.

కథనం

బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసే శంకరన్ నాయర్,డయ్యర్‌ దురాగతంపై ఎందుకు కేసు వేశారు? కేసు వేయడానికి శంకరన్ నాయర్‌ను యువ న్యాయవాది దిల్‌రీత్ సింగ్ ఎలా ప్రేరేపించింది? బ్రిటీష్ కోర్టులో ప్రతికూల పరిస్థితుల మధ్య శంకరన్, దిల్‌రీత్ సింగ్ తమ వాదనలు ఎలా వినిపించారు? శంకరన్ నాయర్‌కు మెక్‌కిన్లేకు ఉన్న వైరాన్ని బ్రిటీష్ ప్రభుత్వం ఎలా వాడుకోవాలని చూసింది? శంకరన్‌ను మెక్ కిన్లే ఎలా ముప్పు తిప్పలు పెట్టారు? జనరల్ డయ్యర్‌పై వేసిన కేసు చెల్లదని బ్రిటీష్ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత శంకరన్, దిల్‌రిత్ పరిస్థితి ఏమైంది? అన ప్రశ్నలకు సమాధానమే కేసరి చాప్టర్ 2 సినిమా కథ. బ్రిటీష్ ప్రభుత్వంను వ్యతిరేకిస్తూ భారతీయ న్యాయవాదులు డయ్యర్ సర్కార్‌పై తిరుగుబాటు చేసిన అంశాన్ని కోర్టు రూమ్ డ్రామాగా మలిచిన తీరు బాగుంది. దర్శకుడు త్యాగి రాసుకొన్న కథ, భావోద్వేగమైన అంశాలు, కథలో పాత్రలు అద్బుతంగా కనిపిస్తాయి. చరిత్ర సాక్ష్యంగా నిలిచిన కొన్ని పాత్రలు సజీవంగా ప్రేక్షకుడితో మాట్లాడుతున్నారా? అనే విధంగా డ్రామాను తెరకెక్కించారు. స్క్రీన్ ప్లే, కథలోని ట్విస్టులను అత్యంత ఆసక్తికరంగా చిత్రీకరించిన విధానం సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లిందని చెప్పొచ్చు.

సర్ శంకరన్ నాయర్‌గా అక్షయ్ కుమార్, మెక్ కిన్లేగా ఆర్ మాధవన్, దిల్‌రీత్ గిల్‌గా అనన్యపాండే ఈ సినిమాకు మూడు పిల్లర్లుగా నిలిస్తే దర్శకుడు నాలుగో స్తంభంగా కనిపిస్తాడు. ఈ ముగ్గురి పాత్రలను డిజైన్ చేసిన విధానానికి దర్శకుడికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ ముగ్గురు కూడా ఒకరికొకరు పోటీ పడి నటించారు. యాక్టర్లుగా కాకుండా నటీనటులుగా తెరపైన కనిపించేందుకు వారు చేసిన కృషి ఈ సినిమాకు మరో బ్యూటీగా నిలిచింది. ఈ చిత్రంలోని ప్రతీ పాత్ర ప్రేక్షకుడిని కదిలిస్తుంది. బాధపెడుతుంది. చప్పట్లు కొట్టిస్తుంది. హృదయాన్ని హత్తుకొనేలా చేస్తుంది.

Read Also: Baasha Movie: ఏప్రిల్ 25న బాషా సినిమా రీరిలీజ్

#BlockbusterDeal #DigitalPremiere #DisneyPlusHotstar #June20Premiere#kesari chapter 2 movie #MovieOnOTT #OTTUpdate Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.