Baasha Movie: ఏప్రిల్ 25న బాషా సినిమా రీరిలీజ్

Baasha Movie: ఏప్రిల్ 25న బాషా సినిమా రీరిలీజ్

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన రీ రిలీజ్ హంగామా కనిపిస్తుంది.టాలీవుడ్ లో మొదలైన ఈ ట్రెండ్ కోలీవుడ్, బాలీవుడ్ కు కూడా పాకింది. కాకపోతే మిగతా ఇండస్ట్రీలలో కంటే తెలుగులో జోరుగా సాగుతోంది. గతంలో హిట్టయిన స్టార్‌ హీరోల సినిమాలను మరోసారి వెండితెరపైకి తీసుకొస్తున్నారు. వీటికి ప్రేక్షకాదరణ లభిస్తుండటంతో ఇబ్బడిముబ్బడిగా రీరిలీజులను వదులుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే పలు ఎవర్‌ గ్రీన్, ఫీల్‌ గుడ్‌, క్లాసిక్, బ్లాక్ బస్టర్ చిత్రాలను విడుదల చేశారు. ఈ క్రమంలో కొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా మరోసారి థియేటర్లలో సందడి చేస్తున్నాయి.పరభాషా చిత్రాలను ఆదరించడానికి తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. కంటెంట్ నచ్చితే చాలు, భాషతో సంబంధం లేకుండా ఎగబడి చూస్తారు. రీరిలీజుల్లోనూ ఇదే కనిపిస్తోంది. ఇటీవల కాలంలో 3, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’, ‘యుగానికొక్కడు’ వంటి తమిళ డబ్బింగ్ సినిమాలను మరోసారి విడుదల చేస్తే అనూహ్య స్పందన లభించింది. దీంతో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘బాషా’ చిత్రాన్ని ఇప్పుడు రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు.

Advertisements

ఫిలిం మేకర్స్

రజనీకాంత్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలలో ‘బాషా’ ఒకటి. ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే’ అంటూ వచ్చిన ఈ సినిమా అప్పట్లో తమిళ చిత్ర సీమలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. సాధారణ జీవితం గడిపే హీరోకి ఎవరికీ తెలియని పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉండటం అనే లైన్ కి ఈ సినిమానే నాంది పలికింది. 1995లో రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికీ స్క్రీన్ ప్లేలో బాషా టెంప్లేట్ ని ఫాలో అవుతున్న ఫిలిం మేకర్స్ ని మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి క్లాసిక్ మూవీని మరోసారి బిగ్ స్క్రీన్ మీదకు తీసుకొస్తున్నారు.‘బాషా’ సినిమాని తెలుగులో ఏప్రిల్ 25న గ్రాండ్ గా రీరిలీజ్ చేయబోతున్నారు. అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా కూడా అదే సమయంలో విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఒకరోజు ముందుగా రజనీకాంత్ బాషా మూవీ రానుంది. ఇలా ఇద్దరు సూపర్ స్టార్ల హిట్ సినిమాలు ఒకేసారి రీరిలీజ్ అవుతుండటం ఆసక్తికరంగా మారింది. మరి ఈ రెండిటిలో ఏ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

విలన్

‘బాషా’ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో రజనీకాంత్ పక్కన నగ్మా హీరోయిన్ గా నటించింది. రఘువరన్ విలన్ గా నటించగా శరన్ రాజ్, విజయ్ కుమార్, శశి కుమార్, ఆనంద్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. దేవా ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు.

Read Also: Khauf Review : ‘ ఖౌఫ్’ సిరీస్ రివ్యూ!

Related Posts
L2 Empuraan: ‘ఎల్‌2 ఎంపురాన్’ నిర్మాతపై ఈడీ దాడులు
L2 Empuraan: ‘ఎల్‌2 ఎంపురాన్’ నిర్మాతపై ఈడీ దాడులు

'ఎల్2: ఎంపురాన్' – భారీ కలెక్షన్లు, కానీ విరామంలేని వివాదాలు! సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో మరోసారి మోహన్ లాల్ నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ హాట్ టాపిక్‌గా Read more

ఇండియా కేంద్రంపై కమల్ హాసన్ విమర్శలు
ఇండియా కేంద్రంపై కమల్ హాసన్ విమర్శలు

ఇండియా కేంద్రంపై కమల్ హాసన్ విమర్శలు ప్రముఖ సినీ నటుడు మరియు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ఇటీవల భారతదేశంలో జరుగుతున్న రాజకీయ Read more

Shah Rukh Khan: జీవితంలో డ‌బ్బు,స్టార్‌డ‌మ్‌ కంటే ఒత్తిడి లేకుండా ఉండ‌డమే ముఖ్యం: షారుక్ ఖాన్
Shah Rukh Khan: జీవితంలో డ‌బ్బు,స్టార్‌డ‌మ్‌ కంటే ఒత్తిడి లేకుండా ఉండ‌డమే ముఖ్యం: షారుక్ ఖాన్

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తాజాగా తన జీవితం, కెరీర్, స్టార్‌డ‌మ్‌, డబ్బు వంటి అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.త‌న జీవితంలో జ‌రిగి విషాద సంఘ‌ట‌న వ‌ల‌న Read more

Urvashi Sharada : ఎన్టీఆర్ ఆహ్వానాన్ని మొదట సున్నితంగా తిరస్కరించానని శారద వెల్లడి
Urvashi Sharada ఎన్టీఆర్ ఆహ్వానాన్ని మొదట సున్నితంగా తిరస్కరించానని శారద వెల్లడి

వెండితెరపై తన అద్భుతమైన నటనతో అందరి హృదయాలను గెలుచుకున్న ఊర్వశి శారద, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజకీయ జీవితం గురించి మనస్ఫూర్తిగా మాట్లాడారు.ప్రజలకు సేవ చేయాలన్న తపనతో Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×