కోలీవుడ్ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీం చిత్రాలు ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఆ తరువాత సూర్య నటించిన ఏ చిత్రం కూడా థియేటర్లో కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేదు. చివరగా కంగువా అంటూ వచ్చి బొక్క బోర్లా పడ్డాడు. ఈ సారి కార్తిక్ సుబ్బరాజ్‌తో కలిసి ‘రెట్రో’ అంటూ వచ్చాడు. మే 1న ఈ చిత్రం థియేటర్లోకి వచ్చింది. అసలే కార్తిక్ సుబ్బరాజ్ అంటే కమర్షియల్‌గా అంత సెట్ అవ్వదు అనే భావనతో అంతా ఉంటారు.దీంతో సహజంగానే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడం, ప్రమోషన్లు కూడా గట్టిగా నిర్వహించడంతో రెట్రో సినిమాపై మొదటి నుంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.ఈ సినిమా తెలుగు ఆడియెన్స్(Telugu audience) ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సూర్య, పూజల యాక్టింగ్ బాగున్నా కథ, కథనాలు ఆడియెన్స్ ను నిరాశ పర్చాయి. అయితే తమిళ్ తో మాత్రం రెట్రో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మొత్తానికి థియేటర్లలో సోసో గా ఆడింది రెట్రో మూవీ. ఇప్పుడీ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి వస్తోంది. రెట్రో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‍ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకుంది. మొదట ఈ సినిమాను జూన్ తొలి వారంలో స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.
కథేంటంటే
రౌడీ అయిన తిలక్ (జోజు జార్జ్)కు పెంపుడు కొడుకు అయిన పారివేల్ కన్నన్ (సూర్య). చిన్నప్పటి నుంచీ నవ్వు అంటే ఏంటో కూడా తెలియకుండా పెరుగుతాడు పారివేల్. పారివేల్‌ను నవ్వించేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి అంతా అలిసిపోతారు. పెరిగి పెద్దైన తరువాత కూడా పారివేల్ నవ్వడు. అలాంటి పారివేల్ జీవితంలోకి రుక్మిణి (పూజా హెగ్డే) వస్తుంది. అన్నింటినీ వదిలేసి, హింసకు దూరంగా వెళ్లి రుక్మిణిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ గోల్డ్ ఫిష్ అనే డీల్ విషయంలో తిలక్‌కి, పారివేల్‌కు మనస్పర్థలు వస్తాయి. పెళ్లిలోనే తిలక్ చేతిని పారివేల్ నరికేస్తాడు. పారివేల్‌ను అరెస్ట్ చేస్తారు. దీంతో పెళ్లి ఆగిపోతోంది. ఆ తరువాత రుక్మిణి కూడా ఎవ్వరికీ కనిపించకుండా పోతుంది. జైల్లో ఉన్న పారివేల్‌తో గోల్డ్ ఫిష్ గురించిన నిజాన్ని తెలుసుకోవాలని ఐదేళ్లుగా తిలక్, ధర్మ (ప్రకాష్ రాజ్) ప్రయత్నిస్తుంటారు. కానీ పారివేల్ మాత్రం నోరు విప్పడు. పారివేల్ చేత నిజం చెప్పించాలంటే రుక్మిణి కావాల్సిందే అని తిలక్, ధర్మ ప్రయత్నిస్తుంటారు. మరోవైపు రుక్మిణి జాడ కోసం పారివేల్ కూడా ప్రయత్నిస్తుంటాడు. అండమాన్‌లోని ఓ దీవిలో రుక్మిణి ఉందని పారివేల్ తెలుసుకుంటాడు. ఫైటర్‌గా వెళ్తానని ఓ డీల్ కుదుర్చుకుని జైలు నుంచి తప్పించుకుటాడు పారివేల్. బయటకు వచ్చిన పారివేల్ తన డీల్‌ను వదిలేసి రుక్మిణి కోసం ఆ దీవికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తరువాత జరిగే పరిణామాలు ఏంటి? అసలు పారివేల్ ఒంటి మీద ఉండే మచ్చ ఏంటి? నవ్వంటే ఏంటో తెలియని ప్రజలున్న ఆ దీవికి పారివేల్ వెళ్లడంతో వచ్చిన మార్పులు ఏంటి? అసలు పారివేల్‌కి ఆ దీవికి ఉన్న లింక్ ఏంటి? అసలు ఈ గోల్డ్ ఫిష్ డీలింగ్ ఏంటి? ఆ దీవిలో రాజుల రూపంలో ఉన్న రాక్షసులైన రాజా వేల్ దొర (నాజర్), మైఖేల్ పాత్ర ఏంటి? అన్నది కథ.
Read Also : Actress: మంచి లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ వస్తే తప్పకుండా నటిస్తా: సమంత