తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో గుర్తింపు పొందిన విజయ్ దళపతి తాజాగా సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసే పనిలో ఉన్నారు. దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అటు సినిమాలతోపాటు ఇటు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా విజయ్ బయట తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో తమ అభిమాన హీరో కోసం అడుగడుగునా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా విజయ్ తన నెక్ట్స్ మూవీ జననాయకన్ షూటింగ్ లో పాల్గొనేందుకు కొడైకెనాల్ వెళ్లేందుకు మధురై వెళ్లారు. అక్కడ అభిమానులు ఆయనకు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. అంతకుముందు విజయ్ మధురై చేరుకునే ముందు చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ “నేను జననాయకన్ షూటింగ్ కోసం కొడైకెనాల్ వెళ్తున్నాను” అని అన్నారు. నేను త్వరలో మిమ్మల్ని మధురైలో కలుస్తాను. నేను మిమ్మల్ని మధురై విమానాశ్రయంలో కలుస్తాను, తర్వాత సెట్ కు వెళ్తాను. నా కారును ఎవరూ వెంబడించకండి. బైక్‌ల ను వేగంగా నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కార్యకలాపాలకు ప్రజలు పాల్పడవద్దు ” అంటూ రిక్వెస్ట్ చేశారు విజయ్.
ఫ్యాన్స్
మధురై విమానాశ్రయంలో నటుడు విజయ్ వ్యాన్‌ను అభిమానులు చుట్టుముట్టారు. తన వెంట రావద్దని విజయ్ వేడుకున్నప్పటికీ అభిమానులు పట్టించుకోకుండా ఆయన వాహనాన్ని అనుసరించారు. అంతేకాకుండా విజయ్ వాహనంపైకి ఎక్కడానికి పలువురు ఫ్యాన్స్ ట్రై చేయగా వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు మరింత కష్టతరంగా మారింది.విజయ్ గతంలో బూత్ కమిటీ సెమినార్‌లో పాల్గొనడానికి కోయంబత్తూరు వచ్చారు. ఆ సమయంలో నటుడు కోయంబత్తూరు విమానాశ్రయం నుండి సెమినార్ వేదిక వరకు రోడ్ షోకు వెళ్లాడు. ఆ సమయంలో తమిళనాడు విక్టరీ పార్టీ వాలంటీర్లు, అభిమానులు ఆయన కారును వెంబడించారు. వారిలో చాలామంది హెల్మెట్ ధరించలేదు, నిలబడి బైక్‌లను నడుపుతున్నారు. కొంతమంది అతని వాహనంపైకి ఎక్కి గొడవ కూడా చేశారు. ఇది పెద్ద వివాదానికి దారితీసింది. నటుడు విజయ్ దీనిని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
Read Also: Actor: నేను ఎప్పుడు నటన నుండి వైదొలుగుతానో తెలియదు : అజిత్