📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Indian Army: భారత సైన్యానికి విరాళం ప్రకటించిన విజయ్‌దేవరకొండ

Author Icon By Anusha
Updated: May 10, 2025 • 12:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సామాజిక బాధ్యతతో ముందుండే యువ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.కరోనాతో పాటు వివిధ విపత్తుల సమయంలో ఆయన ఆపన్నులకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. కేవలం నటుడిగా కాకుండా, సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ప్రజల మన్ననలు పొందుతున్న ఆయన, తాజాగా “ఆపరేషన్ సిందూర్” నేపథ్యంలో భారత సైన్యానికి తనవంతు మద్దతుగా నిలిచారు.తన క్లాత్‌ బ్రాండ్‌ రౌడీవేర్‌ సేల్స్‌లో(Brand Rowdywear Sales) వచ్చే లాభాల్లో కొంత వాటాను ఇండియన్‌ ఆర్మీకి విరాళంగా ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘మేడ్‌ ఇన్‌ ఇండియా మాత్రమే కాదు మేడ్‌ ఫర్‌ ఇండియా’ అంటూ పోస్ట్‌ పెట్టారు విజయ్‌ దేవరకొండ.

సినిమాల విషయానికొస్తే

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం వరుస పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. శుక్రవారం ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన సినిమాలకు సంబంధించిన తాజా అప్‌డేట్స్‌ను వెల్లడించారు. ‘కింగ్‌డమ్‌’ సినిమా తాలూకు పోస్టర్‌ను చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసి విజయ్‌ దేవరకొండకు జన్మదిన శుభాకాంక్షలందజేశారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్‌ డ్రామా చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. బ్రిటీష్‌కాలం నాటి కథ ఇది. రష్మిక మందన్న కథానాయిక. శుక్రవారం స్పెషల్‌పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్‌ విజయ్‌కి(vijay devarakonda) బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ఈ పోస్ట్‌లో ధ్యాన ముద్రలో కనిపిస్తున్నారు విజయ్‌ దేవరకొండ. అగ్ర నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్‌’ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. రూరల్‌ యాక్షన్‌ డ్రామా ఇది. పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానుంది. శుక్రవారం ఈ సినిమా నుంచి కూడా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

Indian Army

అల్లు అరవింద్ విరాళం

హైదరాబాద్‌లో ‘#సింగిల్’ సినిమా సక్సెస్ మీట్‌లో అల్లు అరవింద్ ఈ ప్రకటన చేశారు.అల్లు అరవింద్ మాట్లాడుతూ, “దేశం కోసం మన సైనికులు పోరాడుతుంటే, మేం ఇక్కడ వేడుకలు చేసుకోవడం సరికాదనిపించింది. వాస్తవానికి, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తక ముందే మా సినిమా విడుదల తేదీని ఖరారు చేశాం. తర్వాత సినిమా విడుదలను వాయిదా వేయాలా, వద్దా అనే అంశంపై కూడా చర్చించాం. అయితే, ఒక సినిమా నిర్మాణం వెనుక వందలాది మంది సాంకేతిక నిపుణులు, కార్మికుల శ్రమ ఉంటుంది. అలాగే, థియేటర్ల మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తుంటాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని, ఎవరూ తప్పుగా అర్థం చేసుకోరనే నమ్మకంతోనే సినిమాను విడుదల చేశాం” అని వివరించారు. తమ నిర్మాణ సంస్థ ద్వారా ఇటీవల విడుదలైన ‘#సింగిల్’ (Single Movie)చిత్రం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని సైనికుల సంక్షేమానికి విరాళంగా అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. 

Read Also:  Kamal Haasan : వేడుకలు చేసుకోవడానికి ఇది సమయం కాదన్న కమల్ హాసన్

#indianarmy #RowdyWear #SupportOurTroops #VijayDeverakonda Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Operation Sindoor Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.