📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Shruti Hasan: (CSK) సీఎస్‌కే ఓటమి ఏడ్చేసిన శ్రుతి హాసన్ వీడియో వైరల్

Author Icon By Anusha
Updated: April 26, 2025 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఆ జట్టు ఏడో ఓటమిని మూటగట్టుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం చెపాక్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్‌తో సీఎస్‌కే 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. ఈ టోర్నీలో సీఎస్‌కే ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా ఈ ఐదింటికి ఐదు గెలిచినా టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. అద్భుతం జరిగితే తప్పా సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరలేదు.ఈ మ్యాచ్‌కు హాజరైన హీరోయిన శృతి హాసన్ సీఎస్‌కే ఓటమిని తట్టకోలేకపోయింది. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక బోరున విలిపించింది. చెన్నై ఓటమి ఖాయమని తెలిసిన క్షణమే తీవ్ర భావోద్వేగానికి గురైంది. కన్నీటిని తన చేతి వేళ్లతో తుడుచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడయో నెట్టింట వైరల్‌గా మారింది. సీఎస్‌కేకు శృతి హాసన్ డైహార్డ్ ఫ్యాన్ అని, ఓటమిని తట్టుకోలేకపోయిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

చిత్రీకరణ

శ్రుతిహాసన్​- నేచురల్​ స్టార్​ నానీతో చెన్నైలో సందడి చేసింది. ఇద్దరూ కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫొటోలూ కూడా నెట్టింట్లో వైరల్​ అయ్యాయి. వీరిద్దరూ హాయ్​నాన్న సినిమాలో స్క్రీన్ షేర్​ చేసుకున్నారు. ప్రస్తుతం హిట్​-3 ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో ఉన్నారు హీరో నాని.ఇదిలాఉండగా, ప్రస్తుతం శ్రుతి హాసన్ వరుస సనిమాలు చేస్తోంది. ప్రముఖ కోలీవుడ్ దర్శుకుడు లోకేశ్​ కనకరాజ్​ దర్శకత్వంలో సూపర్​ స్టార్ రజనీ కాంత్​ నటిస్తున్న చిత్రంలో శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా 14 ఆగస్టు 2025న విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సుందరి రెబర్​ స్టార్ ప్రభాస్​తో సలార్​-2లోనూ నటిస్తోంది. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదే కాకుండా విజయ్​ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ‘ట్రైన్’​, విజయ్​ లీడ్​ రోల్​లో నటిస్తున్న ‘జన నాయగన్’​ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తోంది శ్రుతి హాసన్.

https://twitter.com/i/status/1915797439182934197

ఆయుశ్

మొదట హైదరాబాద్‌ జట్టు బౌలర్లు విజృంభించడం వల్ల సీఎస్కే జ‌ట్టు 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌట్‌ అయింది. హ‌ర్ష‌ల్ ప‌టేల్(4/28) సీఎస్కే జట్టును గట్టిగా దెబ్బతీశాడు. చెన్నై జట్టులో డేవాల్డ్‌ బ్రేవిస్‌ (42) టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు. ఆయుశ్ మాత్రే (30), ర‌వీంద్ర జ‌డేజా(21), శివమ్ దూబే(12), ధోనీ(6), నూర్ అహ్మ‌ద్‌(2) మోస్త‌రు ప‌రుగులు చేశారు. ఇక లక్ష్య ఛేదనలో హైదరాబాద్ కాస్త త‌డబడిన చివ‌రికి విజ‌యం సాధించింది. 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్‌ కిషన్‌ (34 బంతుల్లో 44: 5 ఫోర్లు, ఒక సిక్స్‌), కమిందు మెండిస్‌ (22 బంతుల్లో 32*: 3 ఫోర్లు), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (13 బంతుల్లో 19*: 2 ఫోర్లు) మంచి ప్రదర్శన చేశారు. ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉన్న‌ట్టే. 

Read Also: Mamitha Baiju: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మమిత బైజు!

#ChennaiPlayers #ChepaukStadium #CSKFans #EmotionalMoment #ShrutiHaasan Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.