📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Actor: రజనీకాంత్ పై వెంకటేష్ కీలక వ్యాఖ్యలు

Author Icon By Anusha
Updated: April 30, 2025 • 2:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుసగా షూటింగ్‌లు చేస్తూ బిజీగా ఉన్నాడు. లోకేష్ కనకరాజ్ కూలీ, నెల్సన్ జైలర్ 2 అంటూ రజినీకాంత్ ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే రజినీ షూటింగ్ ఫినిష్ చేసుకుంటే మాత్రం ఏడాదిలో ఒక్కసారైనా హిమాలయాలకు వెళ్తాడు. అక్కడే కొన్ని రోజులు సాధారణ సాధువులా మారిపోయి బతికేస్తుంటాడు. రజినీకాంత్‌కి దైవ చింతన ఎక్కువగా. భక్తి భావం, ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్‌లో రజినీకాంత్‌కు, టాలీవుడ్‌లో వెంకీమామకు ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలుంటాయన్న సంగతి తెలిసిందే.వెంకీమామ అయితే రమణ మహర్షిని ఎక్కువగా ఫాలో అవుతుంటాడు. ఇక వెంకీమామ తాజాగా రజినీకాంత్ గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్ తనకు ఇచ్చిన సలహాలు ఎక్కువగా ఉపయోగపడ్డాయని, ఇప్పటికీ వాటినే ఆచరిస్తుంటాను అని తాజాగా వెంకీ మామ ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రజినీకాంత్ ఎక్కువగా ఆధ్యాత్మిక భావనతో ఉంటారని, అదే తమ ఇద్దరి మధ్య కనెక్షన్ అని అన్నాడు.

మ్యాగజైన్

వెంకటేష్ మాట్లాడుతూ “రజనీకాంత్‌కు, నాకు ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువ. ఆయన నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మా నాన్నగారితో కలిసి ఆయన పనిచేశారు. నేను చిత్ర పరిశ్రమకు కొత్తగా వచ్చిన సమయంలో ఆయన ఒక ముఖ్యమైన మాట చెప్పారు. సినిమా విడుదల సమయంలో బ్యానర్లు కట్టారా? పోస్టర్లలో మన ముఖం బాగా కనిపిస్తుందా? మ్యాగజైన్ ముఖచిత్రంపై మన ఫోటో వేశారా? వంటి విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించవద్దని ఆయన సూచించారు. మనం మన పని చేసుకుంటూ నిశ్శబ్దంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. అప్పటినుంచి నేను ఆయన చెప్పిన ఆ సలహానే పాటిస్తున్నాను. ప్రచార ఆర్భాటాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. దేని గురించీ ఎక్కువగా ఆలోచించను” అని అన్నారు.

సురక్షితంగా

ఇదే ఇంటర్వ్యూలో వెంకటేష్ తనకు అరుణాచలం అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. రమణ మహర్షిని తాను ఎంతగానో ఆరాధిస్తానని చెప్పారు. చిన్నప్పటి నుంచే తనకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువుగా ఉండేవని ఆయన వెల్లడించారు. దేవుడంటే తనకు చాలా భయమని, భగవంతుడికి సంబంధించిన అనేక పుస్తకాలు చదివినట్లు ఆయన పేర్కొన్నారు. ఒక సందర్భంలో, ‘ఘర్షణ’ సినిమా షూటింగ్ సమయంలో తాను ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు మునిగిపోయిందని, దేవుడి దయ వల్లే ఎలాంటి ప్రమాదం జరగకుండా తాను సురక్షితంగా బయటపడ్డానని వెంకటేష్ ఆనాటి భయానక అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.

Read Also: Preity Zinta : అభిమాని ప్రశ్నపై నటి ప్రీతి జింటా స్పందన

#Rajinikanth #SankranthiBlockbuster #TollywoodMeetsKollywood #venkatesh #VenkateshRajinikanth Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.