Tollywood: రష్మిక-విజయ్ పెళ్లిపై పుకార్లకు చెక్.. ఫిబ్రవరి 26న ముహూర్తం?

Read Time:  1 min
Tollywood
Tollywood
FONT SIZE
GET APP

Tollywood: టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్నల వివాహ వార్తలు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ ఫిబ్రవరి 2న పెళ్లి చేసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తలను రష్మిక సున్నితంగా తోసిపుచ్చినప్పటికీ, ప్రచారం మాత్రం ఆగడం లేదు.

Read Also:Actor: రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు.. ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

Tollywood: Check on rumors about Rashmika-Vijay's wedding.. February 26th as the auspicious date?
Tollywood: Check on rumors about Rashmika-Vijay’s wedding..

ఫిబ్రవరి 26న వివాహం?

తాజా సమాచారం ప్రకారం, వీరి పెళ్లి వేడుక ఫిబ్రవరి 26న జరిగే అవకాశం ఉందని సమాచారం. గతంలో వీరిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని, దానికి సాక్ష్యంగా వారి వేలికి ఉన్న డైమండ్ రింగుల ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ కొన్ని వీడియోలు బయటకు రావడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది.

మౌనంగానే ఉన్న జంట

పెళ్లి వార్తలు ఎంత జోరుగా సాగుతున్నా, విజయ్ లేదా రష్మిక ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. ఉదయపూర్ వెడ్డింగ్ డెస్టినేషన్ వీడియోలు చూస్తుంటే ఈ జంట త్వరలోనే ఒక ఇంటి వారు కాబోతున్నారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఈ జంట స్వయంగా క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.