📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Thug Life Movie: ‘థగ్ లైఫ్ ’ మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: June 5, 2025 • 2:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మణిరత్నం, కమల్‌ హాసన్‌ కాంబినేషన్ అంటేనే ఒక అంచనా ఉంటుంది. గతంలో వీరిద్దరూ కలసి తీసిన ‘నాయకుడు’ (1987) ఎంత క్లాసిక్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు 38 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మాస్టర్ల కలయికలో వచ్చిన చిత్రం‘థగ్‌లైఫ్‌’(Thug Life Movie). ఈ సినిమా విడుదలకు ముందు నుంచే ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.మరిఇలాంటి కథతో మణిరత్నం ఎలాంటి మ్యాజిక్ చేసారా, మళ్లీ తన సత్తాను చాటుకున్నారా, లేదా అన్నది చూద్దాం. నేడు థియేటర్లోకి వచ్చిన సినిమా ఎలా ఉందొ రివ్యూ లో తెలుసుకుందాం.

కథఏంటంటే

కథ ప్రారంభంలో రంగరాయ శక్తివేల్‌(కమల్‌హాసన్‌) ఢిల్లీలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌. ఓ కాల్పుల్లో అమర్‌(శింబు) తండ్రి మరణానికి పరోక్షంగా కారకుడవుతాడు రంగరాయ శక్తివేల్‌. అంతేకాదు, పసివాడైన అమర్‌ని అడ్డు పెట్టుకొనే ఆ కాల్పుల నుంచి బయట పడతాడు. తాము అమర్‌కి చేసిన అపకారం, అమర్‌ వల్ల తనకు జరిగిన ఉపకారం, జాలి, పాపభీతి ఇవన్నీ పనిచేయడంతో అమర్‌ని తీసుకెళ్లి కన్నబిడ్డలా తానే పెంచుతాడు. తప్పిపోయిన తన చెల్లిని వెతికి తీసుకొస్తానని మాట కూడా అమర్‌కి ఇస్తాడు. అలాగే కొనేళ్లు గడిచిపోతాయి. అమర్‌ పెద్దవాడవుతాడు. తాను కూడా రంగరాయ శక్తివేల్‌(Rangaraya Shakthivel) గ్యాంగ్‌లో ఒకడిగా అవతరిస్తాడు. తన వారసుడు అమరేనంటూ రంగరాయ శక్తివేల్‌ ప్రకటించడంతో గ్యాంగ్‌లో మనస్పర్ధలు మొదలవుతాయి. చివరకు రంగరాయ శక్తివేల్‌ ఆధిపత్యాన్ని కూడా అంగీకరించలేని స్థాయికి గ్రూప్‌ సభ్యులు చేరతారు. అమర్‌ మనసును పాడుచేసి, తన తండ్రి మరణానికి రంగరాయ శక్తివేలే కారకుడని అతనికి తెలియజెప్పి, అందరూ ఓ గ్రూప్‌గా మారి రంగరాయ శక్తివేల్‌ని హత్య చేయడానికి పూనుకుంటారు. అతన్ని కాల్చి లోయలో పడేస్తారు. ఆ తర్వాత ఏమైంది? రంగరాయ శక్తివేల్‌ మళ్లీ బతికాడా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

Thug Life Movie

కథనం

గ్యాంగ్‌స్టర్‌ కథల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు తెలుగు, తమిళ సినిమాల్లో చాలానే ఉన్నాయి.కథ పాతదైనా దానికి మణిరత్నం మార్క్‌ మేకింగ్‌ తోడైతే ఆడియన్స్‌కి వచ్చే కిక్కే వేరు కదా. అదే ఆశించి ‘థగ్‌ లైఫ్‌’ కోసం అంతా ఎదురు చూశారు. ఈ సినిమా విషయంలో సింపుల్‌గా ఒక్క విషయం మాత్రమే చెప్పగలం. పాత కథను ఫస్ట్‌ హాఫ్‌ వరకు ఆసక్తికరంగానే నడిపించారు మణిరత్నం. సెకండాఫ్‌కి వచ్చేసరికి కాస్తంత తడబాటు పడ్డారేమో అనిపిస్తుంది. మణిరత్నం(Mani Ratnam) స్థాయి మేకింగ్‌ కనిపించదు. ఏదేమైనా మణిరత్నం లాంటి గొప్ప దర్శకుడు తెరకెక్కించిన చిత్రంలో లోటుపాటుల గురించి విశ్లేషించడం సాహసమే అవుతుంది. అందుకే వాటి జోలికి పోదలచుకోలేదు. మంచి గురించి మాట్లాడుకుంటే, స్వతహాగా మణిరత్నం సినిమాల్లో కనిపించే విభ్నిమైన మేకింగ్‌, మేజిక్‌, అలాగే నటీనటుల వైవిధ్యమైన నటన(మణిరత్నం సినిమ్లాలో మాత్రమే కనిపించే) ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. మణిరత్నం సినిమాలను ప్రేమించే వారు ‘థగ్‌ లైఫ్‌’ని కూడా ఎంజాయ్‌ చేస్తారు.

Read Also: Kamal Haasan: కమల్ వ్యాఖ్యతో రాజ్యసభ నామినేషన్ వాయిదా

#ARRahman #kamalhaasan #ManiRatnam #Silambarasan #ThugLifeMovie review Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.