हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Urvashi Rautela: నా పేరుతో ఉత్తరాఖండ్‌లో గుడి ఉంది : ఊర్వశీ రౌతేలా

Anusha
Urvashi Rautela: నా పేరుతో ఉత్తరాఖండ్‌లో గుడి ఉంది : ఊర్వశీ రౌతేలా

బాలీవుడ్ గ్లామర్ డాల్ ఊర్వశీ రౌతేలా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్వశీ రౌతేలా మాట్లాడుతూ, “ఉత్తరాఖండ్‌లో నా పేరు మీద ఓ గుడి ఉంది. బద్రీనాథ్‌కు ఎవరైనా వెళితే, పక్కనే ఉన్న నా గుడిని చూడండి. అక్కడి వెళ్లి సందర్శించండి. దిల్లీ యూనివర్సిటీలోనూ నా ఫొటోలకు పూలమాలలు వేసి పూజిస్తారు. నన్ను ‘దండమమాయి’ అని పిలుస్తారు కూడా. ఈ విషయం తెలిసిన తరువాత నేను చాలా ఆశ్చర్యపోయాను. కానీ ఇది నిజం. దీనిపై చాలా వార్తా కథనాలు కూడా ఉన్నాయి.కావాలంటే మీరంతా వార్తా కథనాలను చదవచ్చు.’టాలీవుడ్‌ అగ్ర హీరోలు మెగాస్టార్​ చిరంజీవి, నటరత్న బాలకృష్ణలతో కలిసి నటించాను. దక్షిణాదిలో కూడా నాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అందుకే దక్షిణ భారతదేశంలోనూ నా కోసం ఓ ఆలయాన్ని నిర్మించాలని ఆశిస్తున్నా‘ అని ఊర్విశీ అన్నారు. మరి మీ గుడికి వచ్చినవారు మీ ఆశీర్వాదం తీసుకుంటారా? అని యాంకర్‌ అడగ్గా, అది ఆలయమని, అన్ని ఆలయాల్లో ఏమేమి జరుగుతాయో అక్కడ కూడా అవే జరుగుతాయని ఊర్వశి తెలిపారు. ఈ వీడియో చూసిన నెటిజన్‌లు ‘ఆమె పూర్తిగా భ్రమలో మునిగిపోయింది’ అని సరదాగా కామెంట్స్‌ పెడుతున్నారు.

విమర్శలు

ఆ మధ్య సైఫ్ అలీఖాన్ ఇంట్లో దుండగుడి దాడి ఘటన సమయంలో మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేస్తుంటే తన వేలికున్న డైమండ్ రింగ్ చూపిస్తూ తెగ షో చేసింది. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో చివరికి సారీ చెప్పింది.సంక్రాంతికి వచ్చిన ‘డాకు మహరాజ్’‌తో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించడంతో పాటు ఓ సాంగ్‌లో బాలయ్యతో ‘హే దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్ దంచు దంచు బాల’ అంటూ సాంగ్‌లో రెచ్చిపోయింది. ఈ సాంగ్‌లో ఇద్దరి మధ్య కొన్ని స్టెప్పులు తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. ‘డాకు మహరాజ్’ హిట్ అయ్యింది. ఇటీవలే విడుదలై బాలీవుడ్‌లో దుమ్ములేపుతోన్న సన్నీ డియోల్ ‘జాట్’ సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో రచ్చ చేసింది ఈ భామ.

ప్రత్యేక గీతం

‘సింగ్‌ సాబ్‌ ది గ్రేట్‌’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన ఊర్వశి రౌతెలాకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో రూటు మార్చి ఐటెమ్ గర్ల్ అవతారమెత్తింది. అలా తెలుగులో చిరంజీవి పక్కన ‘ వాల్తేరు వీరయ్య’, పవన్ కళ్యాణ్ ‘బ్రో’, అఖిల్ ‘ ఏజెంట్’, రామ్ పోతినేని ‘స్కంద’ చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించింది. ఇక బాలయ్య, బాబీ కాంబినేషన్లో ఈ సంక్రాంతికి వచ్చిన ‘ఢాకు మహరాజ్’తో ఆమెకు కీలక పాత్ర నటించింది. పోలీస్ ఆఫీసర్‌గా యాక్షన్ సన్నివేశాల్లో నటించి మెప్పించడంతో పాటు బాలకృష్ణతో సాంగ్‌తో ఇరగదీసింది. అయితే అవకాశాల కోసమే ఊర్వశి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడానికి ప్రయత్నిస్తుందంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Read Also: OTT: ఓటీటీలోకి ‘వీర ధీర శూర‌న్’ మూవీ ఎప్పుడంటే.!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870