రామ్ చరణ్ హీరోగా శంకర్ తీసిన చిత్రం గేమ్ ఛేంజర్. ఈ మూవీని లాగుతూ సాగదీస్తూ వాయిదాలు వేస్తూ చివరకు సంక్రాంతి బరిలోకి దించారు. గేమ్ ఛేంజర్ సినిమా మీద పెరిగిన అంచనాల్ని, సినిమాలోని కథ, తెరకెక్కించిన తీరుకి ఏ మాత్రం సంబంధం లేకుండా పోయింది. దీంతో గేమ్ ఛేంజర్ థియేటర్లో డిజాస్టర్‌గా నిలిచింది. వందల కోట్ల నష్టం వచ్చినట్టుగా తెలుస్తోంది.ఈ మూవీపై తాజాగా వివాదం చెలరేగింది.తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, ‘గేమ్ ఛేంజర్ సినిమా ఐడియా తనదే అని, కానీ డైరెక్టర్ శంకర్ స్టోరీ, స్క్రీన్ ప్లే మొత్తం మార్చేశారు’ అని ఆరోపించారు.తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ మూవీని కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కార్తీక్ సుబ్బరాజ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో గేమ్ ఛేంజర్ మూవీపై, డైరెక్టర్ శంకర్‌పై విమర్శలు చేశారు.
రైటర్లు
నేను గేమ్ ఛేంజర్ మూవీ కోసం వన్-లైన్ స్టోరీ ఇచ్చాను. ఒక సాధారణ ఐఏఎస్ ఆఫీసర్, రాజకీయ నాయకుడిగా ఎలా మారాడు అనేది ఆ స్టోరీ లైన్. దీనిని స్టార్ డైరెక్టర్ శంకర్‌కు వినిపించాను. ఆయన ఈ సినిమాను పెద్ద తెరపై ఎంత గొప్పగా చూపిస్తారో అని చాలా ఎగ్జైట్ కూడా అయ్యాను. కానీ వాస్తవంలో ఇది మొత్తం తలకిందులైంది. ఈ సినిమా కోసం చాలా మంది ఇతర రైటర్లు పనిచేశారు. దీనితో స్క్రీన్ ప్లే చాలా వరకు మారిపోయింది. చివరికి సినిమా స్టోరీ కూడా కొంత వరకు ఛేంజ్ అయిపోయిందని కార్తీక్ సుబ్బరాజ్ తెలిపారు.
పెద్ద బడ్జెట్
రామ్ చరణ్, శంకర్ కాంబోలో ఎంతో ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అంతేకాదు ఈ సినిమాపై అన్నివైపుల నుంచి విమర్శలు, నెగిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. దీనిపై కూడా కార్తీక్ సుబ్బరాజ్ స్పందించారు. ” ఒక సినిమా ఎందుకు ఫెయిల్ అయ్యిందో, ఎందుకు హిట్ అయ్యిందో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా ఈ సినిమా ఎందుకు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదో ఎవరూ చెప్పలేరు” అని అన్నారు.దిల్ రాజు శ్రీ వెంటటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై చాలా పెద్ద బడ్జెట్ పెట్టి, రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ సినిమా తీశారు. ఈ సినిమాకు రూ.300 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టారని చెబుతారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. వరల్డ్ వైడ్‌గా ఇది కేవలం రూ.180 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. తమిళస్టార్ డెరెక్టర్ శంకర్ గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లు చూస్తున్నారు. వాటిలో గేమ్ ఛేంజర్ అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది.
Read Also: Keerthy Suresh: మరోసారి సూర్యా తో నటించనున్న కీర్తి సురేష్