తమిళ సినీ ఇండస్ట్రీలో దళపతి విజయ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అభిమాన వర్గం ఎంతమంది ఉన్నారో, ఎంతటి మాస్ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నారో అందరికీ తెలిసిందే. సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత తమిళనాడులో ఇటువంటి అభిమాన గణాన్ని పొందిన హీరోగా విజయ్‌ను అభివర్ణించవచ్చు. అయితే, విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో, ఆయన చివరిసినిమా ‘జన నాయగన్’పై భారీ అంచనాలు ఏర్పడాయి.హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. విజయ్ (Thalapathy Vijay) ఈ సినిమాను తన చివరి సినిమాగా ప్రకటించిన తర్వాత దర్శకుడు ఈ ప్రాజెక్టును మరింత జాగ్రత్తగా, భావోద్వేగంగా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకు కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్.కె కలిసి నిర్మిస్తున్నారు.
విజయ్ అభిమానుల్లో
నేడు విజయ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి రోరింగ్ లుక్ పోస్టర్, వీడియో విడుదల చేశారు. ఈ వీడియో తమిళనాట విజయ్ అభిమానుల్లో పండుగ వాతావరణం తీసుకొచ్చింది, అని చెప్పాలి. విజయ్ పోలీస్ లుక్‌లో పవర్‌ఫుల్‌గా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ఇక మూవీకి అనిరుథ్ (Anirudh) సంగీతం అందిస్తున్నారు.జన నాయగణ్ మొదటి నుంచి ఈ చిత్రం తెలుగులో బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రానికి రీమేక్ అని ప్రచారం జరుగుతుండగా, అలాంటిదేమీ లేదని మేకర్స్ చెబుతూ వచ్చారు. పూర్తిగా కొత్త కథతోనే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మూవీని విడుదల చేయనున్నారు. 09-01-2026న చిత్రం విడుదల కానుంది అంటూ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు.
తమ నటనతో
ఇక విజయ్ ఎట్టకేలకి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు. నేటితో ఆయన 51వ వయస్సులోకి అడుగుపెట్టారు. దీంతో ఈ బర్త్ డే ఆయనకు చాలా స్పెషల్‌గా ఉంటుంది. పైగా రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఈ పుట్టిన రోజు చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని తెలుస్తోంది.ఈ చిత్రంలో విజయ్‌కు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) , మమితా బైజు కథానాయికలుగా నటిస్తున్నారు. ఇద్దరూ తమ నటనతో పాటు గ్లామర్‌తో ఈ చిత్రాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చనున్నారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, విజయ్‌కు సూపర్ హిట్ ఆల్బమ్‌లు అందించిన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే BGMకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: Manchu Vishnu: కన్నప్ప ఈవెంట్‌లో ప్రభాస్‌పై విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు