📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Tamil Movie: ఉర్రుతలూరిస్తున తమిళ ప్రేమ కథ సినిమా

Author Icon By Ramya
Updated: May 24, 2025 • 4:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్రైమ్, రొమాన్స్ కలబోసిన ‘ఫైర్’: ఓటీటీలో మిస్ కాకూడని తమిళ థ్రిల్లర్

వారం వచ్చిందంటేనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ మీద కొత్త సినిమాల సందడి మొదలవుతుంది. ఎవరికి ఏమి నచ్చుతుందో, ఏ జోనర్‌లో ఇంట్రెస్ట్ ఉందో అనేది భిన్నం గుడ్ కంటెంట్ కోసం ప్రేక్షకులు ఎప్పుడూ వెతకడం మానరు. ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైన తమిళ సినిమా ‘ఫైర్’ (FIRE),అలాంటి గుడ్ కంటెంట్ కోసం వెతుకుతున్న వారికి మంచి ఎంపికగా నిలుస్తోంది. 2025 ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ (Romantic crime thriller) గా రూపొందిన ఈ చిత్రం, కథనం, నటన, ఇంటెన్స్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

దర్శక నిర్మాత సతీశ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ శరవణన్ (Saravanan) పాత్రలో కనిపిస్తాడు. ప్రధాన పాత్రల్లో బాలాజీ మురుగదాస్, చాందిని తమిళరసన్, రచిత మహాలక్ష్మి, సాక్షి అగర్వాల్, గాయత్రి షాన్ తదితరులు కనిపించగా, సినిమా మొత్తంలో తీవ్రతను కలిగించే క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌కు సరిపోయే బలమైన నటన అందించారు. కథనానికి ఊపుతీసే విధంగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోపాటు, మధ్య మధ్యలో వచ్చే రొమాంటిక్ ట్రాక్స్ కూడా ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్‌ను ఇస్తాయి.

‘కాశీ’ మిస్సింగ్ కేసు చుట్టూ తిరిగే కథ

ఈ సినిమాకి అసలు బలమైన బేస్ ఏమిటంటే, అది మామూలు ప్రేమకథ కాదనిపించే క్రైమ్ థ్రిల్లర్ మూలకం. కాశీ (బాలాజీ మురుగదాస్) ఫిజియో థెరపిస్ట్ (Physiotherapist) గా పనిచేస్తూ ఉంటాడు. హఠాత్తుగా అతను కనిపించకపోవడంతో, తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేస్తారు. పోలీస్ ఆఫీసర్ శరవణన్ తన టీమ్ తో రంగంలోకి దిగుతాడు. అతను తన ఇన్వెస్టిగేషన్ (Investigation) ను కాశీ క్లినిక్ నుంచి మొదలుపెడతాడు. ఆ విచారణలో కాశీ గురించి ఆయనకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? కాశీ కనిపించకుండా పోవడానికి కారకులు ఎవరు? అనేది మిగతా కథ.

ఈ సినిమా కథను కొత్తదిగా చెప్పలేం కానీ, దర్శకుడు చెప్పిన విధానం మాత్రం బాగుంది. మొదటి ఫ్రేమ్‌ నుంచే కథ ఇంటెన్స్ గానే సాగుతుంది. సస్పెన్స్, సైకలాజికల్ టర్న్స్, లవ్ ట్రాక్‌లు అన్నీ కలగలిసి నేరుగా కథలోకి లాక్కెళ్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్‌ సీన్‌లు బలంగా ఉండడంతో, సినిమా పక్కా థ్రిల్లర్ అనిపిస్తుంది.

ఎందుకు చూడాలి ఈ సినిమాను?

కథ కొత్తది కాకపోయినా ట్రీట్మెంట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ వైపు నుంచి కథ రివిల్ అవుతూ వెడుతూ ఉంటుంది గనుక, ఆడియన్స్ ఆసక్తి తగ్గకుండా కథ వెంట పరుగులు పెడుతూ ఉంటారు. ఇక రొమాంటిక్ టచ్ కూడా ఉండటం ఈ కథకి మరింత కలిసొచ్చిన అంశం. రొమాన్స్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ కావడం వల్లనే ఈ సినిమా జోరు ఇంకా తగ్గలేదేమోనని అనిపిస్తుంది.  

Read also: Shanvi Srivastava: తెలుగులో అవకాశం రావడంలేదుంటూ శాన్వీ శ్రీవాస్తవ ఆవేదన

#AmazonPrimeTelugu #BalajiMurugadoss #CrimeWithLove #FireMovie #FireOnOTT #KashiMystery #OTTWeekendWatch #RomanticCrimeThriller #SatishKumar #TamilCinema2025 #TamilThriller #TeluguAudienceChoice #TeluguReviews Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.