ప్రియదర్శి పులికొండ నటనకు ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. తన ప్రత్యేకమైన నటనతో ,సహజమైన అభినయంతో అందరి హృదయాల్లో చోటు దక్కించుకున్న ప్రియదర్శి, తాజాగా తన ప్రతిభను కోలీవుడ్‌కు కూడా చాటి చెప్పాడు. తాజాగా “కోర్టు” అనే సినిమాలో ప్రియదర్శి నటన చూసిన కోలీవుడ్ స్టార్ దంపతులు సూర్య-జ్యోతిక ఫిదా అయిపోయారు.కోర్టు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ప్రియదర్శి పులికొండ. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుండగానే మరో సినిమాతో మన ముందుకొచ్చాడీ యంగ్ అంగ్ ట్యాలెంటెడ్ హీరో. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియ దర్శి నటించిన తాజా చిత్రం సారంగ పాణి జాతకం. జాతకాలు, జ్యోతిష్యాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 25) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ప్రియదర్శి ఖాతాలో మరో హిట్ పడినట్టేనంటున్నారు సినీ ఫ్యాన్స్. కాగా సారంగపాణి జాతకం ముందు కోర్టు సినిమాలో నటించాడీ యంగ్ హీరో. అందులో లాయర్ సూర్య తేజ పాత్రలో అద్భుతంగా నటించాడు. మెగాస్టార్ చిరంజీవి లాంటి సినీ ప్రముఖులతో పాటు విమర్శకులు కోర్టు సినిమాను ప్రశంసించారు. ప్రియదర్శి నటన అద్భుతంగా ఉందంటూ మెచ్చుకున్నారు.
సామాజిక మాధ్యమాల్లో
కోర్టు సినిమాలో ప్రియదర్శి నటనను మెచ్చుకుంటూ అతనికి ఓ ఫ్లవర్ బొకేతో పాటు చిన్న లెటర్‌ను పంపించారీ లవ్లీ కపుల్. ఈ విషయాన్ని ప్రియదర్శి సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు.‘మీరు పంపిన సందేశం, పువ్వులు అందుకోవడం నా హృదయాన్ని తాకింది. ఈ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. ఇద్దరు న్యాయవాదులు చంద్రు, వెంబా వెనక నుంచి గర్వంగా నన్ను తట్టినట్లుగా అనిపించింది. నన్ను బాగా ప్రేరేపించిన ఆ ఇద్దరికీ చాలా ధన్యవాదాలు’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు ప్రియదర్శి. ప్రస్తుతం ఈ నటుడి పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.సారంగపాణి జాతకం సినిమా విషయానికి వస్తే మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ ఫన్ ఎంటర్ టైనర్ లో రూప కొడువాయూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే వీకే నరేశ్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, హర్ష చెముడు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
Read Also: Kiran Abbavaram: దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన ‘క’ మూవీ