బాలీవుడ్‌లో సీనియర్ నటుడు గోవిందా (Govinda) తన హాస్య పాత్రలతో, అద్భుతమైన డ్యాన్సింగ్ స్టైల్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. కానీ ఇటీవల ఆయన వ్యక్తిగత జీవితంలో తలెత్తిన విభేదాలు సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారాయి. గోవిందా భార్య సునీత అహూజా (Sunita Ahuja) చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
Read also: Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు’లో తమన్నా స్పెషల్ సాంగ్
ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత (Sunita Ahuja) తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో జన్మ ఉంటే గోవిందా నా భర్తగా వద్దు. ఆయన అంత మంచి వాడు కాదు. ఎవరికైనా చిన్న వయసులో తప్పులు చేస్తారు. కానీ ఒక వయస్సు వచ్చిన తర్వాత కూడా అవే తప్పులు చేస్తే అర్థం ఉండదు..
మీకు అందమైన భార్య, పిల్లలు ఉన్నప్పుడు ఎందుకు అలాంటి తప్పులు చేస్తారు?” అని ప్రశ్నించారు. గోవిందా తన జీవితంలో భార్యతో కంటే తన హీరోయిన్లతో ఎక్కువ సమయం గడిపాడు. నేను చిన్న వయసులో ఏమీ అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఈ 38 ఏళ్ల వైవాహిక జీవితం నన్ను చాలా నేర్పించింది.
సోషల్ మీడియాలో చర్చలు
ఒక స్టార్ భార్య కావడానికి రాయిలా బలమైన మనసు కావాలి. కానీ నేను అప్పట్లో అంత బలంగా లేను” అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.కొద్ది రోజుల క్రితం కూడా సునీత, తన భర్త చుట్టూ తిరిగే స్వామీజీలు, పండిట్‌లు, భజంత్రీలు గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“వాళ్లు లక్షల్లో కొట్టేస్తున్నారు. గోవిందా వాటిని నమ్ముతాడు. కానీ వాళ్ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు” అని సునీత విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: