Squid Game 3: ‘స్క్విడ్‌గేమ్ 3’ ట్రైలర్ ఎలా ఉందంటే?

Read Time:  1 min
Squid Game 3: ‘స్క్విడ్‌గేమ్ 3’ ట్రైలర్ ఎలాఉందంటే?
Squid Game 3: ‘స్క్విడ్‌గేమ్ 3’ ట్రైలర్ ఎలాఉందంటే?
FONT SIZE
GET APP

నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డులు బద్దలు కొట్టిన దక్షిణ కొరియా,‘స్క్విడ్ గేమ్‌'(Squid Game) చివ‌రి సీజ‌న్ మ‌రో 13 రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌(Netflix) లో రాబోతున్న విష‌యం తెలిసిందే. ఎంతో మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్‌ చివరి సీజన్ జూన్ 27, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు త‌మిళం, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా ఫైన‌ల్‌ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్.ఇప్పుడు అభిమానులలో మరింత ఉస్తాహం కలిగిస్తోంది ఈ సిరీస్.ఈ ట్రైలర్ చూస్తుంటే, కథానాయకుడు సియోంగ్ గీ-హున్ (లీ జంగ్-జే) ఈ ప్రాణాంతక ఆటకు ఎలా ముగింపు పలుకుతాడు,

చివరి సీజన్

అలాగే ఈ గేమ్ వెనుక ఉన్న ఫ్రంట్ మ్యాన్‌ను కనిపెట్టాడా లేదా అనే అంశాలు ఈ సీజన్‌లో ప్రధానంగా చూపించనున్నారని స్పష్టమవుతోంది. మొదటి రెండు సీజన్‌(2 Seasons) లలో భారీ విజయాన్ని సాధించిన ఈ కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, తెలుగుతో పాటు అనేక భారతీయ భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఈ చివరి సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్‌కు హ్వాంగ్ డాంగ్ హ్యుక్ దర్శకత్వం వహించారు.

Read Also: Alappuzha Gymkhana Movie: అలప్పుళ జింఖానా (సోనీ లైవ్) రివ్యూ

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.