📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Spirit Movie:ప్రభాస్‌ తో నటించనున్న త్రిప్తి డిమ్రి

Author Icon By Anusha
Updated: May 25, 2025 • 1:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’, ‘ ఫౌజీ’ చిత్రాలతో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలోనే సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)తో ‘స్పిరిట్’ యూనిట్‌లో జాయిన్ కానున్నాడు.టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై చాలాకాలం క్రితమే ఈ చిత్రాన్ని ప్రకటించారు. డార్లింగ్ ప్రాధాన్యత మారుతూ రావడంతో, ఈ సినిమా నంబర్ కూడా మారుతూ వచ్చింది. లేట్ అయ్యేకొద్దీ ఈ మూవీపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా హీరోయిన్ కు సంబంధించి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అదేంటంటే,’స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకునేని తీసుకున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ గా అనౌన్స్ చేయకముందే దీపికని తప్పించినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు తెర మీదకు వచ్చాయి. వాటన్నిటికీ చెక్ పెడుతూ లేటెస్టుగా హీరోయిన్ ను రివీల్ చేశారు. బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రి(Tripti Dimri)ఈ సినిమాలో నటించనుందని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

కృతజ్ఞతలు

సందీప్ రెడ్డి తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమాతో త్రిప్తి డిమ్రి ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. అప్పటి వరకూ ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు, ఈ ఒక్క చిత్రంతో వచ్చింది. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) పక్కన హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంది. ”నా సినిమాలో హీరోయిన్ అఫీషియల్ గా ఎంపికైంది” అని సందీప్ ఎక్స్ లో పోస్ట్ చేసారు. 9 భాషల్లో త్రిప్తి దిమ్రి పేరుతో ఉన్న పోస్టర్ ను షేర్ చేసారు. ప్రభాస్ సైతం తన ఇన్స్టాగ్రామ్ లో త్రిప్తి తెలుగు డెబ్యూ మూవీ గురించి స్టోరీ పెట్టారు.‘స్పిరిట్’ సినిమాలో తనని ఎంపిక చేయడంపై త్రిప్తి స్పందించింది.”సంతోషంలోమునిగిపోతున్నాను. ఈ ప్రయాణంలో నన్ను నమ్మినందుకు చాలా కృతజ్ఞతలు. థాంక్యూ సందీప్‌ రెడ్డి వంగా. మీ విజనరీ మేకింగ్‌లో భాగం అయినందుకు గౌరవంగా ఉంది” అని రాసుకొచ్చింది. ‘యానిమల్’ సీక్వెల్ గా రూపొందనున్న ‘యానిమల్ పార్క్’ మూవీలోనూ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా కంటిన్యూ అవుతుంది. అంటే సందీప్ వంగాతో కలిసి అమ్మడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. టాలీవుడ్ లో ఆమె కెరీర్ ఇంకా ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.

సంబంధించి

ఇప్పటికే ‘స్పిరిట్’ స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయ. ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు మేకర్స్(Makers) ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదొక కాప్ డ్రామా కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ప్రభాస్ ను తొలిసారిగా పోలీస్ డ్రెస్ లో చూడబోతున్నామని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్‌ వరల్డ్‌ మూవీగా తెలుగుతో పాటు, ఇంగ్లీష్‌, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్‌, జపనీస్‌, కొరియన్‌ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మించనున్నారు.

Read Also: Mukul Dev : ముకుల్ దేవ్ చివరి మాటల్లో చెప్పలేని వేదన:హన్సల్ మెహతా

#AnimalMovie #PanIndiaStar #Prabhas #SandeepReddyVanga #TriptiiDimri Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.