📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sonam Kapoor: మళ్లీ తల్లి  కాబోతున్న సోనమ్ కపూర్

Author Icon By Saritha
Updated: February 9, 2026 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనిల్ కపూర్ (Anil Kapoor) కుమార్తె, బాలీవుడ్ నటి సోనమ్ కపూర్(Sonam Kapoor) రెండోసారి తల్లి కాబోతోంది. వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను సోనమ్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. నిన్న ఆమె సీమంతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు, కొందరు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. 

Read Also: Thalapathy Vijay: ఒకే ఫ్రేమ్ లో వైఎస్ జగన్.. కోలీవుడ్ హీరో

హాజరైన బాలీవుడ్ స్టార్లు

సీమంతం వేడుకలో లెమన్ గ్రీన్ కలర్ లెహంగా చోళీలో సోనమ్(Sonam Kapoor) మెరిసిపోయింది. ఈ వేడుకు కరీనా కపూర్, భూమి పెడ్నేకర్, షబానా అజ్మీ, ఖుషీ కపూర్, అర్జున్ కపూర్, అన్షులా కపూర్, మహీప్ కపూర్ వంటి వారు హాజరయ్యారు. 2015లో ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమా ప్రమోషన్స్ సమయంలో సోనమ్, ఆనంద్ అహూజాల మధ్య పరిచయం ఏర్పడింది. వారి స్నేహం ప్రేమగా మారి 2018లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. 2022లో వీరికి కుమారుడు వాయు జన్మించారు. ఇప్పుడు ఆమె రెండోసారి తల్లి కాబోతోంది. సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సోనమ్‌తో దిగిన ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ, డియర్ సోనమ్ నీ సీమంతం వేడుకకు నా ప్రేమ, ఆశీస్సులు అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anil Kapoor Baby Shower Bollywood actress Celebrity Pregnancy Latest News in Telugu Seemantham Ceremony Sonam Kapoor Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.