हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Simran: డబ్బా ఆంటీ రోల్స్‌ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన సిమ్రాన్

Anusha
Simran: డబ్బా ఆంటీ రోల్స్‌ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన సిమ్రాన్

సిమ్రాన్ ఇటీవల ఓ అవార్డుల కార్యక్రమంలో తన ఫీమేల్ కోస్టార్ ను ఉద్దేశిస్తూ చేసిన ‘డబ్బా ఆంటీ రోల్స్‌’ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డబ్బా రోల్స్‌ చేయడం కంటే ఆంటీ రోల్స్, అమ్మ పాత్రలు చేయడం ఎంతో బెటర్ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏ నటిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసిందని అందరూ తెగ ఆలోచించారు. అయితే సిమ్రాన్ తన వ్యాఖ్యలపై తాజాగా మరోసారి స్పష్టత ఇచ్చింది.తన కోస్టార్ చేసిన కామెంట్స్‌ తనను ఎంతగానో బాధించాయని, ఆ బాధతోనే అవార్డుల కార్యక్రమంలో తనకు అనిపించింది చెప్పానని సిమ్రాన్ తెలిపింది. కెరీర్‌ ప్రారంభం నుంచే అప్పుడప్పుడు ఆంటీ రోల్స్‌లో నటిస్తూ వచ్చానని, ఆ రోల్స్‌ చేయడం తనకూ ఇష్టమేనని, ఆ పాత్రల్లో నటించడంలో తప్పేముందని ప్రశ్నించింది. నిజం చెప్పాలంటే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ ఎప్పటికీ ఒకరికొకరు స్నేహితులు కాలేరని, తనకు ఎదురైన అనుభవంతో మరోసారి అది ప్రూవ్ అయిందని, ఫ్రెండ్స్ అనుకున్నవాళ్ళు కొన్నిసార్లు మనల్ని తమ కామెంట్స్‌తో ఎంతో బాధపెడతారని చెప్పింది. ఈవెంట్ లో తాను ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఆ నటి మరోసారి ఫోన్‌ చేసిందని, మాట్లాడటానికి తానేమీ ఇబ్బంది పడలేదని తెలిపింది. కానీ ఆమెతో అంతకుముందు ఉన్న రిలేషన్‌ మాత్రం ఇప్పుడు లేదని సిమ్రన్‌ చెప్పుకొచ్చింది.

 Simran: డబ్బా ఆంటీ రోల్స్‌ కామెంట్స్ పై క్లారిటీ  ఇచ్చిన సిమ్రాన్

ఆంటీ రోల్స్‌

చైన్నైలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్ కు సిమ్రాన్ హాజరైంది. ఈ సందర్భంగా స్టేజ్‌పై మాట్లాడుతూ తన కోస్టార్ కి మెసేజ్ చేస్తే, ఆమె నుంచి వచ్చిన సమాధానం తనని ఎంతో బాధ పెట్టిందని చెప్పింది. ”రీసెంట్ గా నా ఫీమేల్ కోస్టార్ నటించిన సినిమా చూసి ఆమెకు మెసేజ్ చేశాను. సినిమాలో ఆ రోల్ లో నిన్ను చూసి సర్ప్రైజ్ అయ్యానని మెచ్చుకుంటూ మెసేజ్ చేశాను. దానికి ఆమె ఆంటీ రోల్స్‌ చేయడం కంటే ఇది ఎంతో బెటర్ అని రిప్లై ఇచ్చింది. ఆమె మెసేజ్‌ చూసి నేను షాక్‌ అయ్యా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వేదికగా ఆమెకు నేను చెప్పేది ఏంటంటే, పనికిమాలిన డబ్బా రోల్స్‌లో నటించడం కంటే ఆంటీ లేదా 25 ఏళ్ళ కూతురికి అమ్మ పాత్రలు పోషించడం ఎంతో బెటర్. మనం చేసే పని మీద నమ్మకం ఉండాలి. దేన్నీ చులకన చేసి మాట్లాడకూడదు” అని సిమ్రాన్ కామెంట్స్ చేసింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో తాజాగా మరోసారి తన వ్యాఖ్యలపై స్పందించింది.

Read Also: Gymkhana Movie: జింఖానా మూవీ రివ్యూ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870