చాలా గ్యాప్ తరువాత శోభిత ధూళిపాళ (Shobhita Dhulipala) ప్రధానమైన పాత్రను పోషించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’. థియేటర్లలో కాకుండా ఈ సినిమాను OTTలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ సినిమా ‘అమెజాన్ ప్రైమ్’ (Amazon Prime) లో అందుబాటులోకి రానుంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను వదులుతున్నారు.
Read Also: Actress: ‘అనగనగ ఒక రాజు’ మిస్సయిన శ్రీలీల
ఈ సినిమాలో ‘సంధ్య’ అనే పాత్రలో శోభిత (Shobhita Dhulipala) కనిపించనుంది. రియల్ క్రైమ్ స్టోరీస్ ను గురించి చెప్పే ఒక కాన్సెప్ట్ తో ఆమె ‘చీకటిలో’ అనే ఒక పాడ్ కాస్ట్ ను మొదలుపెడుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో యువతుల హత్యలు వరుసగా జరుగుతూ ఉంటాయి. సైకో కిల్లర్ చీకటిలో తాను అనుకున్న పనిని చాలా పకడ్బందీగా పూర్తి చేస్తూ ఉంటాడు. జరుగుతున్న హత్యలలో తన మార్క్ ఉండేలా చూసుకుంటాడు. అదే పద్ధతిలో ఆ కిల్లర్ సంధ్య దగ్గర పనిచేసే యువతిని హత్య చేస్తాడు.
దాంతో ఆ నేరస్థుడిని తానే పట్టుకోవాలనే నిర్ణయానికి సంధ్య వస్తుంది. అందుకోసం ఆమె ఎలాంటి పథకం వేస్తుంది? సైకో కిల్లర్ ను పట్టుకునే విషయంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది? ఆమెకి తెలిసే నిజాలేమిటి? అనేది కథ. విశ్వదేవ్ రాచకొండ చైతన్య వరలక్ష్మి ఈషా చావ్లా ఆమని ఝాన్సీ తదితరులు కీలకమైన పాత్రలను పోషించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: