हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Shashtipoorthi Movie: షష్టిపూర్తి సినిమా రివ్యూ

Anusha
Shashtipoorthi Movie: షష్టిపూర్తి సినిమా రివ్యూ

అర్చన,డా. రాజేంద్రప్రసాద్, రూపేష్, ఆకాంక్ష సింగ్ వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పవన్ ప్రభ(Pawan Prabha) దర్శకత్వం వహించగా, రూపేష్ స్వయంగా నిర్మాతగా వ్యవహరించారు.ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పాజిటివ్ టాక్‌(Positive talk)తో దూసుకుపోతుంది.ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

కథ ఏంటంటే

ఈ సినిమా ప్రధానంగా, శ్రీరామ్ (రూపేష్) అనే యువ న్యాయవాది చూట్టు తిరుగుతుంది. చిన్న‌త‌నం నుంచే నీతి, న్యాయం అంటూ పెరిగిన‌ శ్రీరామ్ న్యాయవాదిగా(lawyer) వాటిని కాపాడ‌డానికి అంకితభావంతో పోరాడుతాడు. వృత్తిపరంగా అతను న్యాయాన్ని ర‌క్షించ‌డానికి ప్రయత్నిస్తుండగా మ‌రోవైపు అతని వ్యక్తిగత జీవితంలో జానకి (ఆకాంక్ష సింగ్) అనే అమ్మాయి ప్ర‌వేశిస్తుంది. అయితే ఈ విష‌యం ఇంట్లో చెబుదామంటే శ్రీరామ్ తల్లిదండ్రులు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad), అర్చనలు చాలా రోజుల నుంచి మ‌ట్లాడుకోకుండా ఉంటారు. అయితే వీరిని క‌లుపుదామ‌ని జాన‌కి, శ్రీరామ్ క‌లిసి షష్టిపూర్తి ప్లాన్ చేద్దామ‌నుకుంటారు. ఈ క్ర‌మంలోనే జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఏమిటి, అస‌లు రాజేంద్ర ప్రసాద్, అర్చనలు ఎందుకు మాట్లాడుకోరు, అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

Shashtipoorthi Movie: షష్టిపూర్తి సినిమా రివ్యూ
Shashtipoorthi Movie: షష్టిపూర్తి సినిమా రివ్యూ

కథనం

ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ శ్రీరామ్ త‌న తల్లిదండ్రుల మధ్య ఉన్న దూరాన్ని తొలగించి, వారిని తిరిగి ఏకం చేయ‌డమే. ఈ ప్రయాణంలో ఎదురైన భావోద్వేగ సంఘటనలను దర్శకుడు పవన్ ప్రభ ఎంతో ఎమోష‌న‌ల్‌గా ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా తెరకెక్కించాడు.ఈ చిత్రం కుటుంబ విలువలు, తల్లిదండ్రుల పట్ల గౌరవం, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని గొప్పగా చూపిస్తుంది. దర్శకుడు పవన్ ప్రభ ఉమ్మడి కుటుంబ నేపథ్యం నుండి స్ఫూర్తి పొంది, తల్లిదండ్రులను విడిచిపెట్టే ప్ర‌స్తుత‌ సమాజంలో ఒక సమస్యను సున్నితంగా హైలైట్ చేశారు.

జీవించి

అపార్థం చేసుకోబడిన భర్త పాత్రలో రాజేంద్ర ప్రసాద్ తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అతని భావోద్వేగ నటన చిత్రానికి బలమైన ఆధారంగా చెప్ప‌వ‌చ్చు. ఇక మూడు దశాబ్దాల తర్వాత తెలుగు సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చిన అర్చన(Archana), భావోద్వేగమైన, సంక్లిష్టమైన పాత్రలో అద్భుతంగా నటించారు. రూపేష్ తన న‌ట‌న‌తో సినిమాకు ప్రాణం పోశాడని చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా త‌ల్లిదండ్రులు గొడ‌వ ప‌డినప్పుడు ఒక కొడుకు,ఎలా ఉంటారో జీవించి చూపించాడు. ఆకాంక్ష సింగ్(Akanksha Singh) కూడా తన సహజమైన నటనతో పాత్రకు జీవం పోసింది.

అద్భుతంగా

తోట తరణి కళా దర్శకత్వం ఈ చిత్రానికి హైలైట్ అని చెప్ప‌వ‌చ్చే.ముఖ్యంగా గోదావరి ప్రాంతంలో చిత్రీకరించిన దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. రామ్ సినిమాటోగ్రఫీ, కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ చిత్రానికి మంచి నాణ్యతను అందించాయి. ఇళయరాజా సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది. పవన్ ప్రభ దర్శకత్వం సరళంగా ఉంటూనే భావోద్వేగాలను గొప్పగా చూపించింది. కుటుంబ విలువలు, తల్లిదండ్రుల పట్ల బాధ్యత, సంప్రదాయాలను గౌరవించే కథనం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

Read Also: Film Producer: థియేటర్ల పరిష్కారానికి 27 మందితో కమిటీ: సి.కల్యాణ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870