📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Sandeep Reddy Vanga: ‘స్పిరిట్’ కథ లీక్ మండి పడ్డ సందీప్

Author Icon By Ramya
Updated: May 27, 2025 • 1:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ‘స్పిరిట్’లో గందరగోళం: దీపిక ఔట్.. త్రిప్తి ఇన్.. సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం బహిర్గతం!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు క్రియేట్ చేసింది. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమ‌ల్’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న సందీప్ రెడ్డి, ఈసారి ప్రభాస్‌తో సంయుక్తంగా వస్తున్నాడు కాబ‌ట్టి ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. కానీ ఈ సినిమా ప్రారంభానికి ముందే కొన్ని వివాదాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా హీరోయిన్ ఎంపిక విషయంలోనే నెట్టింట గుప్పుమంది గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొదట ‘స్పిరిట్’ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను తీసుకోవాలని భావించినట్లు సమాచారం. అయితే, ఆమె కొన్ని కఠినమైన షరతులు, డేట్ల సమస్యలతో పాటు పాత్రపై చెక్ పెట్టే విధంగా తన ఆపద్భాందవులతో కూడిన సూచనలిచ్చిందట. దీనితో దర్శకుడు సందీప్ ఆమెను ప్రాజెక్ట్ నుంచి తొలగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీపిక స్థానంలో తాజాగా ‘యానిమల్’ చిత్రంలో నటించి ఆకట్టుకున్న త్రిప్తి డిమ్రీకి అవకాశం దక్కింది. దీనికి ప్రతి చర్యగా ఆమె పీఆర్ టీం స్పిరిట్ స్టోరీని లీక్ చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో దీపిక పదుకొణె, ఆమె పీఆర్ టీమ్‌పై సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sandeep Reddy Vanga

‘డర్టీ పీఆర్ గేమ్స్’ అంటూ ఫైర్ అయిన సందీప్ రెడ్డి వంగా

ఈ వ్యవహారంపై స్పందించిన సందీప్ రెడ్డి వంగా తన సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ద్వారా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. “మీరు ఇలా ఏం చేసినా నన్ను ఏం చేయ‌లేరు.. ఈ సారి మొత్తం స్టోరీని లీక్ చేసుకోండి” అంటూ ట్వీట్ చేశారు. ఇదేనా మీ ఫెమినిజం అంటూ సందీప్ రెడ్డి వంగా కౌంటర్లు కూడా వేశారు. ఈ మేర‌కు ద‌ర్శ‌కుడు ‘ఎక్స్’లో పెట్టిన పోస్టు ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.  “నేను ఓ నటికి క‌థ‌ చెప్పినప్పుడు.. ఆమెపై వంద శాతం నమ్మకంతో చెబుతాను. మా మధ్య నాన్ డిస్కోజ్లర్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ మీరు ఇలాంటి వ్యవహారాలు చేసి మీది మీరే బయటపెట్టుకుంటున్నారు. ఓ యంగ్ నటిని కిందకు లాగడం, ఆమెను విమర్శించడం, నా స్టోరీని లీక్ చేయడం.. ఇదేనా మీ ఫెమినిజం. 

“ఒక సినిమా కోసం ఎన్నో ఏళ్లు కష్టపడతాం.. కథ లీక్ చేసినా నన్నేం చేయలేరు”

సినిమా ఒక్కటి తెరకెక్కించాలంటే దర్శకుడిగా ఎన్నో ఏళ్లు కష్టపడాల్సి వస్తుందన్న సందీప్ రెడ్డి, “సినిమా నా ప్రాణం.. మీకది అర్థం కాదు. మీరు కథను బయటపెట్టినా, నా కథలోని విలువ తగ్గదు” అంటూ తేలికగా తాను వీళ్ల ప్రవర్తనను భరించబోనని స్పష్టం చేశారు. ‘డర్టీ పీఆర్ గేమ్స్’ (Dirty PR games) అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తూ, ఈ వ్యవహారాన్ని బహిరంగంగా ప్రపంచానికి తెలియజేశారు. అంతేకాకుండా తనదైన శైలిలో హిందీలో ఓ డైలాగ్‌ను పోస్ట్ చేసి తన ఎమోషనల్ యాంగిల్‌ను చూపించారు.

Read also: Vijay Deverakonda : డైరెక్టర్‌కు గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

#BollywoodControversy #DeepikaPadukone #DirtyPRGames #FeminismDebate #Prabhas #SandeepReddyVanga #SpiritMovie #TeluguCinemaNews #TriptiiDimri #ViralTweet Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.