సంపూర్ణేష్‌బాబు ‘సోదరా’ తో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం!
సినిమా ప్రేమికులకు శుభవార్త! సంపూర్ణేష్‌బాబు మరోసారి తన ప్రత్యేకమైన నటనతో, నవ్వులు పూయించేందుకు సిద్ధమయ్యాడు. మన్‌మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో రూపొందిన “సోదరా” సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ ద్వారా మంచి హైప్ క్రియేట్‌చేసుకున్న ఈ చిత్రం కుటుంబం మొత్తానికి అందుబాటులో ఉండే ఎమోషనల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది.
సమావేశంలో మాట్లాడిన సంపూర్ణేష్‌బాబు, ‘‘సోదరా సినిమా అన్నదమ్ముల అనుబంధాన్ని ప్రధానంగా చూపించబోతుంది. ఒక కుటుంబంలో సహజంగా జరిగే మన`స్పర్థలు, అభిమానం, ప్రేమ అన్నీ ఇందులో చాలా సహజంగా కనిపిస్తాయి. సినిమా మొత్తం నవ్విస్తూ, చివరికి మనసును తాకేలా భావోద్వేగాలను కూడా మిళితం చేశాం. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరికీ నిజజీవితంలో జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి. ఎమోషన్ ఎంత ఉందో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది’’ అంటూ చెప్పారు.
సోదర బంధాన్ని చక్కగా చిత్రీకరించిన చిత్రం
‘‘ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ప్యాకేజీ. చిన్నా, పెద్దా అందరూ కలిసి నవ్వుకుంటూ చూసేలా ఉంటుంది. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఉండే చల్లని అనుబంధాన్ని ఆకట్టుకునేలా చూపించాం. నేను ‘ఎ’ సినిమాలో ఉపేంద్ర లాంటి పాత్ర చేయాలని ఎప్పుడూ కోరుకున్నాను. ఈ సినిమాలో నా పాత్ర కూడా అలాంటి ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని చూపిస్తుంది. ప్రేక్షకులు థియేటర్లో నవ్వుతూ, కన్నీళ్లు పెట్టుకునేలా ఈ సినిమా మిమ్మల్నిదృక్పధం చూపిస్తుంది.
సోదర ప్రేమను గొప్పగా వ్యక్తీకరించిన సంజోష్
ఈ సినిమాలో సంపూర్ణేష్‌బాబుతో కలిసి నటించిన మరో ముఖ్య నటుడు సంజోష్ మాట్లాడుతూ, ‘‘సంపూ అన్నతో కలిసి బ్రదర్‌లా నటించడం నాకు ఒక గొప్ప అనుభవం. అన్నదమ్ముల మధ్య కొన్నిసార్లు ఏర్పడే చిన్న చిన్న మనస్పర్థలు ఎంత గొప్ప ప్రేమకు ప్రతీకలవుతాయో మా సినిమా ద్వారా అందరికీ చూపించబోతున్నాం. నేటి తరం యువతకు సైతం బంధాల విలువను గుర్తు చేస్తుంది. ఈ ప్రతి సన్నివేశం మీ హృదయాలను తాకుతుంది. ఎమోషన్, కామెడీ రెండూ సమపాళ్లలో మిక్స్ చేసి చూపించాం’’ అంటూ వివరించారు.
25న థియేటర్లలో ‘సోదరా’ సందడి
మొత్తం మీద, ‘సోదరా’ ఒక సరికొత్త ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. సంపూర్ణేష్‌బాబు తన మార్క్ కామెడీతో నవ్విస్తూనే, మనసుని తాకే భావోద్వేగాలను అందించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. కుటుంబం మొత్తం కలిసి థియేటర్‌కి వెళ్లి, నవ్వుతూ, మురిసిపోయే అనుభూతిని ‘సోదరా’ తప్పకుండా అందించబోతుంది.
ఇంకెందుకు ఆలస్యం.. ఈ నెల 25న సోదరులతో కలిసి ‘సోదరా’ చూద్దాం!
READ ALSO: Samantha: తన తొలి సినిమాలో యాక్టర్స్ పై సమంత కామెంట్స్