📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Samantha: స‌క్సెస్ పై.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Author Icon By Anusha
Updated: June 14, 2025 • 12:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ అగ్ర న‌టి సమంత స‌క్సెస్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. తన జీవితంలో గతం కంటే ఇప్పుడు ఎక్కువ సక్సెస్​ను సొంతం చేసుకున్నట్లు హీరోయిన్ సమంత (Samantha) తెలిపారు. తన దృష్టిలో సక్సెస్​ అంటే స్వేచ్ఛగా ఉండడమని చెప్పారు. సమంత ప్రధాన పాత్రలో సినిమాలు వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుండగా, తాను విరామం తీసుకోవడం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. విరామం తీసుకున్న తర్వాత విజయానికి నిర్వచనం మారిందని అర్థమైందన్నారు.విజయానికి నిర్వచనం ఏమిటని అడిగితే నేను వెంటనే స్వేచ్ఛ అని చెబుతాను. నిరంతరం అభివృద్ధి చెందడం, పరిణతి సాధించడం, దేనికీ బందీగా ఉండకపోవడమే నా దృష్టిలో నిజమైన స్వేచ్ఛ. అదే అసలైన విజయం అని సమంత వివరించారు.

నిర్మాణ రంగం

ప్రస్తుతం తాను చేస్తున్న పనులు తనకు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయని, వాటిని పూర్తి చేయడం కోసం ప్రతిరోజూ ఎంతో ఆనందంగా నిద్రలేస్తున్నానని ఆమె తెలిపారు. బహుశా నా చుట్టూ ఉన్నవారు గతంతో పోలిస్తే నేను ఇప్పుడు విజయం సాధించలేదని అనుకోవచ్చు. కానీ నా వ్యక్తిగత దృష్టిలో నేను గతం కంటే ప్రస్తుతం ఎక్కువ సక్సెస్‌గా ఉన్నాను అని స‌మంత తెలిపారు.సమంత సినిమాల పరంగా బిగ్​స్క్రీన్ (Big Screen) ​పై పూర్తిస్థాయిలో కనిపించి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇటీవల వచ్చిన శుభం మూవీలో మాతాజీ అనే అతిథి పాత్రలో కనిపించారు. ఆమె మొదటిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి శుభంతో మంచి ప్రశంసలు అందుకున్నారు.

Samantha

వెబ్ సిరీస్

దానితోపాటు మా ఇంటి బంగారం అనే సినిమాను కొన్ని నెలల క్రితం ప్రకటించారు. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వని సామ్, షూటింగ్​ జూన్​ నెలలోనే ప్రారంభం కానుందని రీసెంట్​గా వెల్లడించారు.రక్త్​ బ్రహ్మాండ్ వెబ్​ సిరీస్​ (Rakt Brahmand Web Series) లో కూడా సామ్ ప్రస్తుతం యాక్ట్ చేస్తున్నారు. అందులో మహారాణి రోల్​లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. 2025లోనే సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ఇకపై వరుసగా చిత్రాలతో మూవీ లవర్స్​ను అలరిస్తానని ఇటీవల ఓ కార్యక్రమంలో తెలిపారు.

Read Also: Allu Arjun : శక్తిమాన్‌గా అల్లు అర్జున్ పేరు తెరపైకి

#FreedomIsSuccess #SamanthaInterview #SamanthaRuthPrabhu #TrueSuccess Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.