हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Samantha: శ్రీవారి సన్నిధి లో సమంత

Anusha
Samantha: శ్రీవారి సన్నిధి లో సమంత

ప్రముఖ నటి సమంతా నిర్మాణంలో రాబోతున్న తాజా చిత్రం ‘శుభం’. ‘చచ్చినా చూడాల్సిందే’ అనేది క్యాప్షన్. ఈ సినిమాకు ‘సినిమా బండి’ఫేమ్ ప్రవీణ్‌ కాండ్రేగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా హర్షిత్‌రెడ్డి, శ్రీయా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్ తదిత‌రులు ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మే 09 ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సంద‌ర్భంగా వ‌రుస ప్ర‌మోష‌న్స్ చేస్తుంది చిత్ర‌బృందం. ట్రాలాలా బ్యానర్‌పై నిర్మాతగా సామ్ ఫ‌స్ట్ మూవీ కావ‌డంతో భారీ అంచ‌నాలున్నాయి. అయితే ఈ సినిమా విజ‌యం సాధించాల‌ని తాజాగా సామ్‌తో పాటు చిత్ర‌యూనిట్ అంతా క‌లిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ప్రభావం

కాగా ఇటీవల సమంత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. తన కెరీర్‌లో మాత్రమే కాక, వ్యక్తిగత జీవితంలోనూ, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల విషయంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నట్టు తాజాగా వెల్లడించింది. నటిగా మాత్రమే కాదు, పబ్లిక్ ఫిగర్‌గా తన ప్రతి నిర్ణయం లక్షలాది మంది అభిమానుల జీవితాలపై ప్రభావం చూపుతుందని గుర్తించిన ఆమె, ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ముందడుగు వేస్తున్నట్టు పేర్కొన్నారు.ఆయా బ్రాండ్​లతో తన విలువలు అమరక గురించి తాను ఎలా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుందో వెల్లడించింది. ఇతరుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపే సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నట్లు చెప్పింది. అందులో భాగంగా గతేడాది 15 బ్రాండ్​లకు నో చెప్పానని వెల్లడించింది.అయితే దీని వల్ల రూ.కోట్లలో నష్టపోయినట్లు పేర్కొంది.

మయోసిటిస్‌

బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల విషయంలో స్పష్టమైన నిబద్ధత సమాజానికి హానికరమైనవి కాకుండా, తన విలువలకు అనుగుణంగా ఉన్న బ్రాండ్‌లనే ఎంపిక చేసుకుంటున్నట్లు చెప్పారు.గతేడాది 15 బ్రాండ్‌లను తిరస్కరించానని, అందువల్ల కోట్ల రూపాయల ఆర్ధిక నష్టం జరిగినా తన విలువలే ముఖ్యమని స్పష్టం చేశారు.‘‘నేను చేసే ఎండార్స్‌మెంట్ వల్ల ప్రజలు దాన్ని నమ్మి కొనుగోలు చేస్తారని నాకు తెలుసు. అందుకే ప్రతీ అడుగు జాగ్రత్తగా వేస్తున్నాను’’ అని చెప్పారు.2022లో మయోసిటిస్‌ వ్యాధి బయటపడిన తరువాత ఆ సమయంలో తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాక, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కూడా ఆమె ఆరోగ్యం, జీవనశైలికి అనుగుణంగా ఉండాలని చూసుకుంటున్నారు. ఫిట్‌నెస్‌, మైండ్‌ఫుల్ నెస్‌, హోల్ ఫుడ్ డైట్‌ను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాక, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లోను ఇదే దారిని కొనసాగించనున్నారు.

Read Also: Shiva Rajkumar: కమల్ హాసన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శివరాజ్‌ కుమార్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870