📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rukmini Vasanth: ప్రభాస్ తో నటించనున్న రుక్మిణి వసంత్‌?

Author Icon By Anusha
Updated: May 23, 2025 • 2:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’, ‘ ఫౌజీ’ చిత్రాలతో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలోనే సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ యూనిట్‌లో జాయిన్ కానున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సందీప్ వంగా నటీనటుల సెలక్షన్లో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. పాన్ ఇండియా చిత్రం కావడంతో ఇందులో దీపికా పదుకొణేని తీసుకోవాలని అనుకున్నాడట సందీప్ వంగా(Sandeep Reddy Vanga). ‘కల్కి’ మూవీలో వీరిద్దరు కలిసి నటించడం, దీపికాకు నేషనల్ వైడ్ క్రేజ్ ఉండటంతో అమె అయితేనే బాగుంటుందని అనుకున్నాడట. అయితే దీపిక ఏకంగా రూ.40 కోట్ల రెమ్యునరేషన్ అడగటంతో నిర్మాతలకు కళ్లు బైర్లు కమ్మాయట. వారు రూ.20 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడినా ఆమె ఒప్పుకోలేదట. దీంతో వంగా ఆమెని ప్రాజెక్టు నుంచి తప్పించినట్లు వార్తలొచ్చాయి. అయితే రెమ్యునరేషన్ విషయంలో తేడాలు రావడంతో ఈ ప్రాజెక్టు నుంచి బాలీవుడ్ నటులు తప్పుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ కూడా పారితోషికం విషయంలో విబేధాలు రావడంతో తప్పకున్నారని ప్రచారం జరిగింది.

హీరోయిన్‌

ఈ క్రమంలోనే హీరోయిన్‌గా దీపికా పదుకొణె ప్లేస్‌లో రుక్మిణి వసంత్‌ని తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిగాయని అధికారిక ప్రకటన త్వరలో రానుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. రుక్మిణి వసంత్(Rukmini Vasant) 2019లో ‘బిర్బల్ ట్రిలాజీ’ అనే కన్నడ సినిమాతో నటిగా పరిచయమయ్యారు. 2023లో విడుదలైన ‘సప్త సాగరదాచే ఎల్లో’ (సైడ్ ఏ & సైడ్ బీ) చిత్రాల్లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు, ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు కూడా లభించింది. తెలుగులో కూడా నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమాతో రుక్మిణి ప్రేక్షకులకు పరిచయమైనప్పటికీ, ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు.  రుక్మిణి వసంత్ ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రంలో (టైటిల్ ‘డ్రాగన్’ అని ప్రచారంలో ఉంది) నటిస్తోంది. అంతేకాకుండా మరిన్ని తెలుగు చిత్రాల్లో ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ సరసన ‘స్పిరిట్’లో ఆమెకు అవకాశం రానున్నట్లు వార్తలొస్తున్నాయి ఇదే గనుక జరిగితే ఆమె త్వరలోనే టాలీవుడ్లో టాప్ హీరోయిన్‌గా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది.

Read Also: Tamanna: త‌మ‌న్నాపై క‌న్న‌డిగులు ఆగ్ర‌హం ఎందుకంటే?

#DeepikaPadukone #Prabhas #RukminiVasanth #SpiritMovie #TollywoodBuzz Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.