📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Latest News: RGV: రిషబ్ శెట్టి పై ఆర్జీవీ ప్రశంసలు

Author Icon By Aanusha
Updated: October 4, 2025 • 6:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా, దర్శకత్వంలో రూపొందించిన కాంతార చాప్టర్ 1 (Kantara Chapter 1) మూవీ 2025లో ప్రేక్షకులను మెప్పించిన సెన్సేషనల్ విజయం సాధించింది. విజయదశమి రోజున థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం ద్వారా, ప్రేక్షకుల నుంచి ప్రాచుర్యం పొందింది.

Hot Topic:విజయ్-రష్మిక ఎంగేజ్‌మెంట్: అభిమానులకు షాక్

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది.ఇక బుక్ మై షోలో రిలీజ్ రోజు సుమారు 1.28 మిలియన్‌కి పైగా టిక్కెట్లు (Tickets) బుక్ అయ్యయంటేనే ఈ సినిమాకి ప్రేక్షకులు ఎలా బ్రహ్మరథం పడుతున్నారో అర్థమవుతోంది.

భాషా వివాదంతో తెలుగు నాట ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలని కొంతమంది పిలుపునిచ్చినా టాక్ బాగుండటంతో ఈ వివాదం పక్కకి వెళ్లిపోయింది. కంటెంట్ బాగుంటే వివాదాలు ఏం చేయలేవని ఈ చిత్రం మరోసారి నిరూపించింది.‘కాంతార చాప్టర్ 1’పై సామాన్య ప్రేక్షకులే కాదు సెలబ్రెటీలు (Celebrities) సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ చిత్రంలో రిషబ్‌శెట్టి కొత్తలోకానికి తీసుకెళ్లాడని, హీరోగానే కాకుండా దర్శకుడిగానే నూటికి నూరు మార్కులు సంపాదించాడని కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వివాదాస్పద దర్శకుడిగా ముద్రపడిన రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.‘కాంతార ఒక అద్భుతం. దేశంలోని అందరు చిత్ర నిర్మాతలు రిషబ్ శెట్టి, అతడి టీమ్‌ని చూసి సిగ్గుపడాలి.

కంటెంట్‌తో పాటు వారి కృషి ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టింది. క్రియేటివ్ టీమ్ రాజీపడకుండా సహాయ సహకారాలు అందించిన హోంబలే ఫిల్మ్స్‌ని అభినందించి తీరాలి. రిషబ్ శెట్టి గొప్ప యాక్టరా.. గొప్ప డైరెక్టరా? అనే విషయాన్ని నేను తేల్చుకోలేకపోతున్నాను’ ట్వీట్ చేశారు ఆర్జీవీ.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

2025 biggest opening blockbuster film Breaking News director-actor Dussehra release Kannada Movie Kantara Chapter 1 latest news Rishab Shetty Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.