हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Virgin Boys Review: ‘వర్జిన్ బాయ్స్’ సినిమా రివ్యూ!

Ramya
Virgin Boys Review: ‘వర్జిన్ బాయ్స్’ సినిమా రివ్యూ!

‘వర్జిన్ బాయ్స్’ (Virgin Boys Review) – కంటెంట్ ఉందా, కటింగ్ ఉందా? యువతరం ఆలోచనలకు అద్దం పడుతుందా?

“స్టార్ క్యాస్టింగ్ అక్కర్లేదు.. భారీ బడ్జెట్‌తో పని లేదు.. కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు.. అందులోనూ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాని ఆదరిస్తారు.” ఈ మాటలు చిన్న సినిమాల ప్రమోషన్స్‌లో తరచుగా వినిపిస్తుంటాయి. ప్రస్తుత సోషల్ మీడియా హవాలో కంటెంట్ బాగుంటే, అది థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, ఓటీటీలో ఖచ్చితంగా ఆదరణ పొందుతుంది అనడంలో సందేహం లేదు. “ఫలానా సినిమా చాలా బావుంది.. ఈ వీకెండ్ ట్రై చెయ్ బ్రో” అంటూ సోషల్ మీడియాలో ఎంతోమంది సిఫార్సు చేస్తుంటారు. ఇలా కంటెంట్ మీద నమ్మకంతో ఈ వారం థియేటర్లలోకి వచ్చిన చిత్రం ‘వర్జిన్ బాయ్స్’ (Virgin Boys Review). పేరుకి తగ్గట్లే ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ యువతను ఆకర్షించాయి. బిగ్‌బాస్ ఫేమ్ శ్రీహాన్, మిత్రా శర్మ వంటి నటులు ఉండటం కూడా కొంతమందిని థియేటర్లకు రప్పించింది. మరి ఈరోజు (జులై 11) విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? నిజంగానే కంటెంట్ ఉందా లేక కేవలం “కటింగ్” మాత్రమేనా అనేది విశ్లేషిద్దాం.

Virgin Boys Review: ‘వర్జిన్ బాయ్స్’ సినిమా రివ్యూ!
Virgin Boys Review: ‘వర్జిన్ బాయ్స్’ సినిమా రివ్యూ!

కథా నేపథ్యం

“ఈ డిసెంబర్ 31st లోపు మేము వర్జినిటీ కోల్పోతాం.. ఇదే మా ఛాలెంజ్” – ముగ్గురు కాలేజీ కుర్రాళ్లు రోని (రోనిత్), ఆర్య (గీతానంద్), డుండీ (శ్రీహాన్) చేసిన ఈ శపథమే సినిమా స్టోరీలైన్. చిన్నప్పటి నుంచి బాయ్స్ స్కూల్, బాయ్స్ కాలేజీలో చదివిన ఈ ముగ్గురూ కోఎడ్యుకేషన్ కాలేజీలో మొదటిసారి అడుగుపెట్టాక వాళ్ల ఫీలింగ్స్, అమ్మాయిలతో చనువుగా ఉండలేకపోయామనే ఆత్రుత, అప్పటివరకు కళ్లెం వేసిన వయసు గుర్రాలు పరిగెడుతుంటే ఏం చేయాలో తెలియని వారి బాధలు – ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా వర్జినిటీ కోల్పోవాలి, అసలు అదేంటో అంతు చూడాలి అంటూ శపథం చేస్తారు. ఈ ఛాలెంజ్‌లో గెలవడానికి ఏం చేయాలా అని ఎదురుచూస్తున్న ఈ ముగ్గురికీ శ్లోక (అన్షుల ధావన్), లైలా (జెనీఫర్ ఇమ్మానుయేల్), సరయు (మిత్రా శర్మ) అనే అమ్మాయిలు పరిచయమవుతారు. మరి వీళ్ల ప్రేమలో పడిన మన వర్జిన్ బాయ్స్.. వాళ్ల ఛాలెంజ్‌లో నెగ్గారా? మొత్తానికి డిసెంబర్ 31st లోపు (By the 31st) వాళ్ల వర్జినిటీని కోల్పోయారా? వీళ్ల లైఫ్‌లో కాలేజ్ పీఈటీ మాస్టర్ చెప్పిన మాటల ఇంపాక్ట్ ఏంటి? అసలు వీళ్ల లవ్ రొమాంటిక్ రైడ్ చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ.

నవీన ఆలోచనలు: ప్రేమ అంటే సెక్స్‌యేనా?

“అమెరికాలో 18 ఏళ్లకే వర్జినిటీ కోల్పోతారట, కెనడాలో 17 ఏళ్లకే.. అరే ఆ దేశంలో అయితే 16 ఏళ్లకే అన్నీ అయిపోతాయట” – సినిమాలో వినిపించే ఓ సంభాషణ ఇది. అసలు వర్జినిటీ అంటే ఏంటి? పెళ్లికి ముందే సెక్స్ కరెక్టా? అసలు ప్రేమ అంటే సెక్స్ ఒక్కటేనా? ఇలాంటి ప్రశ్నలకు ఈ కథలో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ప్రీ-మేరిటల్ సెక్స్ (పెళ్లికి ముందు సంభోగం) పాపం అనే మైండ్‌సెట్ ఉన్న అమ్మాయి ఒకవైపు, ఇద్దరు ప్రేమతో ముట్టుకుంటే లవ్‌మేకింగ్ తప్పు ఎలా అవుతుంది అనే అబ్బాయి మరోవైపు – ఇలాంటి భిన్న ధ్రువాలైన అమ్మాయి-అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా చూపించారు. “నా శరీరాన్ని ఎవరు ఎప్పుడు టచ్ చేయాలో డిసైడ్ చేసుకోవాల్సింది నేను.. ఈ సొసైటీ కాదు” అనే బలమైన డైలాగ్ సినిమాలో ఉంది. నిజానికి ఈ డైలాగ్ విన్నప్పుడు కొంతమందికి “ఏంట్రా ఇంత పచ్చిగా మాట్లాడుతుంది.. అమ్మాయిలు ఇంత ఓపెన్‌గా ఇలా మాట్లాడటం కరెక్టేనా?” అనే భావన కలగొచ్చు. కానీ నిజానికి ఏది తప్పు ఏది రైట్ అనేది ఇలాంటి విషయాల్లో చెప్పాల్సింది సమాజం కాదు, మన మనఃసాక్షి. ఒకరి మైండ్‌సెట్‌పై వారు పుట్టి పెరిగిన పరిస్థితులు, ఆచార వ్యవహారాలు, సమాజం పోకడ, స్నేహాలు వంటివి ప్రభావం చూపుతాయి. ఈ జనరేషన్‌లో ప్రేమ, సంబంధాలపై కొత్త ఆలోచనలు రావడం సహజం. మన విద్య వ్యవస్థలో ‘సెక్స్’ అనే పదం వినిపిస్తేనే “అమ్మో బూతు” అంటూ చెవులు మూసుకునే వాళ్లు చాలామందే ఉన్నారు. కానీ నలుగురిలో చెవులు మూసుకునే అదే అబ్బాయి.. ఇంటికెళ్లి తలుపులు మూసుకొని ఏం చేస్తాడో ఎవరికి తెలుసు? ఈ చిత్రం కూడా అలానే సాగింది. ఫస్టాఫ్ మొత్తం వర్జిన్ బాయ్స్ తహతహలు, ఆరాటాలు, చిరు కష్టాలు చూపిస్తే.. ఇంటర్వెల్ ముందు అరగంట మాత్రం లిప్‌లాక్‌లు, యూత్‌ఫుల్ సీన్లతో నింపేశారు.

నటీనటుల పనితీరు

సెకండాఫ్‌లో కథా గమనాన్ని కాస్త మలుపు తిప్పడం సినిమాకి ప్లస్ అయింది. ముఖ్యంగా పీఈటీ మాస్టర్‌తో ప్రేమ పాఠాలు (అసలైన ప్రేమ అంటే ఏంటి) చెప్పించడం.. సెక్స్ అనేది ప్రేమలో ఒక భాగం మాత్రమే, అదే ప్రేమ కాదు అని తెలుసుకునే రెండు మూడు సందర్భాలు చూపించడం సినిమాకి అడ్వాంటేజ్ అయ్యాయి.

యాక్టింగ్ విషయానికొస్తే డుండీ అనే ఇన్నోసెంట్ పాత్రలో శ్రీహాన్ మెప్పించాడు. సినిమాలో కాస్తో కూస్తో కామెడీ పండిందంటే శ్రీహాన్ వల్లే. ముఖ్యంగా శ్రీహాన్ (Especially Srihan) ‘స్కేల్’ చేష్టలు థియేటర్లలో నవ్వులు పూయించాయి. మిగిలిన ఇద్దరు హీరోలు రోనిత్, గీతానంద్ కూడా మెప్పించారు. ఎమోషనల్ సీన్లలో గీతానంద్ నటన బాగుంది. హీరోయిన్ల విషయానికొస్తే జెనీఫర్, అన్షుల చూసుకున్నోళ్లకి చూసుకున్నంత అన్నట్లుగా అందాలు ఆరబోశారు. లిప్‌కిస్‌లు, బికినీ సీన్లు ఇలా డైరెక్టర్ ఏది చెబితే అది చేసుకుంటూ వెళ్లిపోయారు. మిత్రా శర్మకి నటనకి స్కోప్ ఉన్న మంచి పాత్ర వచ్చింది. మిత్రా కూడా తనకి వచ్చినంతవరకు బాగానే యాక్ట్ చేసింది కానీ కొన్ని ఎమోషనల్ సీన్లలో ఆమె నటన అంతగా కనెక్ట్ కాలేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల వరకు బాగానే మేనేజ్ చేశారు. బిగ్‌బాస్ కౌశల్ కూడా ఈ సినిమాలో ఉన్నాడు. కుర్రాళ్ల వర్జినిటీ ఛాలెంజ్‌కి సూత్రధారి, క్లైమాక్స్‌లో వారికి బట్టలు దానం చేసే పాత్రధారిగా అలా మెరిశాడు. ఇక ఇలాంటి యూత్‌ఫుల్ సినిమాలకు సాంగ్స్, బీజీఎమ్ పెద్దగా వినిపించవు ఎందుకంటే వాటితో ఎవరికీ పెద్ద పనిలేదు అన్నట్లుగానే ప్రేక్షకులు కళ్లప్పగించారు. అలాంటి సీన్లు ఉన్నాయి మరి!

వర్జిన్ బాయ్స్ కథ ఏమిటి?

ముగ్గురు స్నేహితులు తమ కన్యత్వాన్ని కోల్పోవడానికి ప్రయత్నిస్తారు, అడ్డంకులను ఎదుర్కొంటూనే ఒకరికి విజయం సాధిస్తారు . లైంగిక సంతృప్తి కోసం వారి అన్వేషణ యొక్క ఈ వినోదాత్మక చిత్రణలో వారు “ప్రేమ రాజు”గా మారడానికి రహస్యంగా పోటీ పడతారు.

“వర్జిన్ బాయ్స్ 2025” చిత్రంలో నటించిన నటులు ఎవరు?

ఈ చిత్రంలో మిత్రా శర్మ, గీతానంద్, శ్రీహన్, రోనిత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు..

ఇతర కీలక పాత్రల్లో జెన్నిఫర్ ఇమాన్యుల్, అన్షులా ధావన్, కౌశల్ మంద, షీతల్ తివారి ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:  Son Of Sardaar 2: అజయ్ దేవ్‌గణ్ ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ట్రైలర్ చూసారా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870