हिन्दी | Epaper
గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Sri Sri Sri Rajawaru: శ్రీ శ్రీ శ్రీ రాజావారు (అమెజాన్ ప్రైమ్) సినిమా రివ్యూ!

Ramya
Sri Sri Sri Rajawaru: శ్రీ శ్రీ శ్రీ రాజావారు (అమెజాన్ ప్రైమ్) సినిమా రివ్యూ!

‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ (Sri Sri Sri Rajawaru)- ఒక సాధారణ కథాకథనం

నార్నే నితిన్ హీరోగా, చింతపల్లి రామారావు నిర్మాణంలో, సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ (Sri Sri Sri Rajawaru). జూన్ 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, జూలై 4న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ (Streaming on Amazon Prime) ప్రారంభించింది. ‘ఆయ్’, ‘మ్యాడ్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నార్నే నితిన్, ఈ సినిమాలో ఎంతవరకు ఆకట్టుకున్నాడో చూద్దాం.

కథా నేపథ్యం:

కథ 1996లో ఆత్రేయపురం అనే గ్రామంలో మొదలవుతుంది. సుబ్బరాజు (నరేశ్) దంపతుల కొడుకు రాజా (నార్నే నితిన్) పురిటిలోనే చనిపోయాడని అందరూ భావిస్తారు. కానీ అనుకోకుండా సిగరెట్ పొగ పీల్చడం ద్వారా అతను ప్రాణం పోసుకుంటాడు. దీని కారణంగా, టీనేజ్ నుంచే రాజాకు సిగరెట్ తాగే అలవాటు ఉన్నా, సుబ్బరాజు పట్టించుకోడు. దీంతో రాజా సిగరెట్‌కు బానిస అవుతాడు. అలాంటి రాజా, కృష్ణమూర్తి (రావు రమేశ్) కూతురు నిత్య (సంపద) ప్రేమలో పడతాడు.

కృష్ణమూర్తి రాజకీయంగా ఎదగాలని ప్రయత్నిస్తుంటాడు, ఈసారి ఎంపీటీసీ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే, సుబ్బరాజు కూడా అదే ఆలోచనలో ఉండటం అతడిని ఆందోళన పరుస్తుంది. గతంలో స్నేహితులైనప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వారి మధ్య దూరం పెంచుతాయి. ఈ నేపథ్యంలోనే, తన కూతురు సుబ్బరాజు కొడుకు రాజాను ప్రేమిస్తోందని కృష్ణమూర్తికి తెలుస్తుంది.

రాజాతో తన కూతురి వివాహం కృష్ణమూర్తికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. రాజా ఒక్క గంట కూడా సిగరెట్ తాగకుండా ఉండలేడనే విషయం అతనికి తెలుసు. దీంతో రాజాకు ఒక గడువు పెట్టి, ఆ గడువులోపు సిగరెట్ జోలికి వెళ్లకుండా ఉంటేనే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని సవాల్ విసురుతాడు. నిత్య కోసం రాజా సిగరెట్ మానేస్తాడా? ఆమెతో అతని వివాహం జరుగుతుందా? అనేది మిగతా కథ.

విశ్లేషణ:

గ్రామీణ నేపథ్యం, హీరో హీరోయిన్ల ప్రేమ, వారి తండ్రుల మధ్య రాజకీయ గొడవలు, హీరోకు ఉన్న సిగరెట్ అలవాటు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. గ్రామీణ రాజకీయాలు, ప్రేమ కథలు వంటి అంశాలతో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అదే తరహాలో అల్లుకున్న కథ ఇది. ఆసక్తికరమైన సన్నివేశాలు, అనూహ్యమైన మలుపులు ఎక్కడా కనిపించవు.

హీరో చైన్ స్మోకర్ అని చూపించడానికి తెరపై విపరీతంగా సిగరెట్లు తాగించారు, అది ప్రేక్షకులకు అసహనాన్ని కలిగిస్తుంది. ఈ కథలో కామెడీ, రొమాన్స్, గ్రామీణ నేపథ్యంలో సాంగ్స్‌కు మంచి అవకాశం ఉన్నప్పటికీ, వాటిని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించదు. ఈ కథకు ప్రధాన ఆకర్షణ ఏదైనా ఉందీ అంటే, అది విలేజ్ నేపథ్యంలోని లొకేషన్స్ అని చెప్పాలి.

నటీనటుల పనితీరు:

పల్లె అందాల మధ్య, ఫ్యామిలీ ఎమోషన్స్ (Family Emotions) నేపథ్యంలో కథలను నడిపించడంలో సతీశ్ వేగేశ్నకు మంచి నైపుణ్యం ఉంది. అయితే, ఈ కథకు గ్రామీణ నేపథ్యం బలంగా ఉన్నప్పటికీ, ఆ స్థాయిలో కథాకథనాలు కనిపించవు. రావు రమేశ్, నరేశ్ ఇద్దరూ తమ మార్క్ చూపించారు. నార్నే నితిన్ – సంపద నటన ఫర్వాలేదు. దాము నర్రావుల ఫోటోగ్రఫీ బాగుంది, గ్రామీణ దృశ్యాలు ఆకట్టుకుంటాయి. కైలాశ్ మీనన్ సంగీతం ఓ మోస్తరుగా అనిపిస్తుంది. మధు ఎడిటింగ్ ఓకే.

ముగింపు:

విలేజ్ నేపథ్యం, రెండు కుటుంబాలు, ఒక ప్రేమజంట, స్థానిక రాజకీయాలను కలుపుకుంటూ ఈ కథ సాగుతుంది. కొత్తదనం లేకపోవడం, ఏం జరుగుతుందో ప్రేక్షకులు ముందుగానే అంచనా వేయగలిగేలా ఉండటం సినిమాకు మైనస్‌గా నిలుస్తుంది. మొత్తంగా, ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ ఒక సాధారణ, రొటీన్ కథాకథనంతో కూడిన చిత్రం.

శ్రీ శ్రీ రాజావారు చిత్రానికి దర్శకుడు ఎవరు?

తెలుగు చిత్రమైన శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు.

‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రం రిలీజ్ డేట్?

ఈ ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రం థియేటర్లలో 2025 జూన్ 6న విడుదలైంది

శ్రీ శ్రీ శ్రీ రాజవారు ఓటీటీ ప్లాటుఫామ్?

అమెజాన్ ప్రైమ్

Read hindi news: hindi.vaartha.com

Read also: Venkatesh: చిరంజీవి సినిమాలో గెస్ట్ రోల్‌పై వెంకటేశ్ క్లారిటీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870