📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Retro Movie:’రెట్రో’ మూవీ ట్రైలర్ విడుదల

Author Icon By Anusha
Updated: April 19, 2025 • 11:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘రెట్రో’. కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సూర్య తన హోమ్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. సమ్మర్ స్పెషల్ గా థియేటర్లలోకి తీసుకురానున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.కార్తీక్ సుబ్బరాజు మార్క్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ‘రెట్రో’ సినిమా రూపొందినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవవుతోంది. రెగ్యులర్ గా మనం చూసే ట్రైలర్స్ కి కాస్త భిన్నంగా రెండున్నర నిమిషాల నిడివితో ఈ వీడియోని కట్ చేసారు. ప్రధాన పాత్రలన్నిటినీ పరిచయం చేస్తూ, వివిధ సన్నివేశాల్లో నటీనటుల హావభావాలను చూపిస్తూ, కథేంటనేది తెలియకుండా ఆడియన్స్ కు అసలు అర్థం కాకుండా ఈ ట్రైలర్ ని రూపొందించారు.

గ్రాండ్ రిలీజ్

ట్రైలర్ ని బట్టి సూర్య క్యారక్టర్ ఆర్క్ మీదనే ఈ కథ నడుస్తుందనిపిస్తోంది. సూర్య ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లాగా ఉంది. పూజాతో ‘నన్ను చాలా ఏడిపించావ్’ అనే ఒక్క డైలాగ్ మాత్రమే చెప్పించారు. ప్రకాష్ రాజ్, జోజో జార్జ్, జయరామ్, నాజర్, కరుణాకరన్, సుజిత్ శంకర్, జార్జ్ మరియన్ ఇలా చాలామంది ప్రముఖ నటులు ఈ సినిమాలో కనిపిస్తున్నారు. అందరి గెటప్స్, సెటప్ చాలా కొత్తగా ఉన్నాయి. సంతోష్ నారాయణన్ బ్యాగ్రౌండ్ స్కోర్ విజువల్స్, ఎడిటింగ్ వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.కార్తీక్ సుబ్బరాజు సినిమాలను ఇష్టపడే వారికి, సూర్య ఫ్యాన్స్ కి ‘రెట్రో’ ట్రైలర్ చాలా బాగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య, జ్యోతిక నిర్మించారు. మే 1న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ విడుదల చేస్తారు. ‘కంగువ’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత సూర్య నుంచి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

ప్రతీ సినిమా

కోలీవుడ్, టాలీవుడ్‌లో అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు సూర్య. తెలుగులో స్ట్రెయిట్ సినిమాను చేయకపోయినా కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. గజిని తరువాత ఇక్కడ సూర్య క్రేజ్ అమాంతం పెరిగింది. సూర్య నటించిన ప్రతీ సినిమాను ఇక్కడ డబ్ చేస్తూనే వచ్చారు. ఇక సూర్య చేసినన్న డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ గెటప్స్ మరేతర హీరో చేసి ఉండడేమో. ఇక ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ అనే దాన్ని కోలీవుడ్‌లో సూర్యనే స్టార్ట్ చేశాడు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంలో సూర్య సిక్స్ ప్యాక్ లుక్‌లో అదరగొట్టేశాడు.

Read Also: IPL 2025: అసాధారణ బ్యాటింగ్‌తోనే విజయం సాధించాం: శ్రేయస్ అయ్యర్

#KarthikSubbaraj #PoojaHegde #RetroMovie #RetroTrailer #Suriya Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.