📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Raveena Tandon: తన కూతురుపై రవీనా టాండన్ ప్రశంసలు

Author Icon By Anusha
Updated: October 5, 2025 • 11:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ నటి రవీనా టాండన్ (Raveena Tandon) ఎప్పుడూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఇప్పుడు ఆమె కుమార్తె రషా తడానీ (Rasha Thadani) కూడా సినీ రంగంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో, తల్లి-కూతుళ్ల మధ్య ఉన్న బంధం, రషా చిన్ననాటి విశేషాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రవీనా తాజాగా ఒక ఆన్‌లైన్ మీడియాతో మాట్లాడినప్పుడు, తన కుమార్తె రషాలో కనిపించిన సహజ నటనా ప్రతిభను గుర్తు చేసుకున్నారు.

Bigg Boos 9: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే?

రషా కేవలం మూడు, నాలుగు నెలల వయసు నుంచే విభిన్నమైన హావభావాలు ప్రదర్శించేదని ఆమె గుర్తుచేసుకున్నారు.”రషా చిన్నప్పుడు అద్దం ముందు నిలబడి ఏడుస్తున్నట్లుగా నటించేది. అంత చిన్న వయసులో అద్దంలో తన హావభావాలను చూసుకోవాలని ఎలా అనిపించిందో అర్థమయ్యేది కాదు.

తనలో ఎవరో గొప్ప నటి ఆత్మ ఉందేమో అని మా అమ్మతో ఎప్పుడూ అనేదాన్ని. అప్పుడు ఆమె నా మాటలను పెద్దగా పట్టించుకోకపోయినా, ఇప్పుడు రషా నటన చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది” అని రవీనా తెలిపారు.తన వారసురాలిగా బాలీవుడ్‌ (Bollywood) లోకి అడుగుపెట్టిన రషా, ‘ఆజాద్’ అనే తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది.

Raveena Tandon

తక్కువ సమయంలో రషాకు ఇంతటి విజయం వస్తుందని

ముఖ్యంగా ఆ సినిమాలోని ఒక ప్రత్యేక గీతంలో ఆమె డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించి, దేశవ్యాప్తంగా యువతను ఆకట్టుకున్నాయి. ఇంత తక్కువ సమయంలో రషాకు ఇంతటి విజయం వస్తుందని తాము ఊహించలేదని, ఆమెను చూసి ఎంతో గర్వపడుతున్నామని రవీనా చెప్పారు.

చిన్నప్పుడు రాక్‌స్టార్ (Rockstar) అవ్వాలనుకున్న రషా, ఆ తర్వాత తన తల్లిలాగే స్టార్ హీరోయిన్‌గా స్థిరపడాలని నిర్ణయించుకుందని ఆమె వెల్లడించారు.ఇక రషా తడానీ త్వరలోనే తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ నటుడు రమేశ్ బాబు తనయుడు, ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం కానున్న చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికైంది. ఈ సినిమాతో రషా టాలీవుడ్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Bollywood actress Bollywood News Breaking News latest news rasha acting rasha thadani rasha thadani debut raveena interview raveena tandon raveena tandon daughter Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.