हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Rashmika Mandanna: సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రష్మిక అడిషన్ వీడియో

Sharanya
Rashmika Mandanna: సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రష్మిక అడిషన్ వీడియో

రష్మిక మందన్నా, ప్రస్తుత పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. కర్ణాటకకు చెందిన ఈ ముద్దుగుమ్మ, మోడలింగ్ రంగం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అతి తక్కువ సమయంలోనే తాను ఇండస్ట్రీలోకి వచ్చేందుకు చేసిన కృషి ఆమె తొలి అడిషన్ వీడియో నుంచే తెలుస్తోంది. కిరిక్ పార్టీ సినిమాతో కన్నడలో పరిచయమైన రష్మిక అదే సినిమా ద్వారా తన అభినయ సామర్థ్యాన్ని చాటింది.

కిరిక్ పార్టీ సినిమా సమయంలో ఆమె డిగ్రీ చదువుతోంది. అదే సమయంలో ఆమెకు సినిమా ఛాన్స్ రావడం, ఆ ఛాన్స్‌ను వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవడం ఆమె విజయం మొదటి పాఠం. ఈ సినిమా తర్వాత తెలుగులో “ఛలో” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత విజయ్ దేవరకొండ సరసన “గీత గోవిందం” చిత్రంలో నటించి, ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి, ఎంతో కష్టపడి స్టార్ హోదా సంపాదించిన ఈ నటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. సాధారణమైన అమ్మాయి, మోడల్‌గా, యాక్ట్రెస్‌గా, నేషనల్ క్రష్‌గా, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిన రష్మిక .

పుష్ప మూవీతో వెలుగులోకి

రష్మిక ఫేమ్‌కు రాకెట్ బూస్ట్ ఇచ్చిన సినిమా “పుష్ప”. అల్లు అర్జున్ సరసన నటించిన ఈ చిత్రంలో ఆమె శ్రీవల్లి పాత్రలో నటించి, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ పాత్ర ద్వారా ఆమెకు హిందీ ఇండస్ట్రీలో కూడా గుర్తింపు వచ్చింది. అంతే కాదు ఆమె డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మిషన్ మజ్నూ, గుడ్ బై వంటి హిందీ చిత్రాల్లో నటించిన రష్మిక తాజాగా రణబీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో నటించి, మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెకు బాలీవుడ్‌లో కూడా స్థానం ఏర్పడింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్న రష్మిక, ప్రస్తుతం అత్యంత బిజీ హీరోయిన్‌గా పేరు సంపాదించింది. నటనతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, సోషల్ మీడియా ఆక్టివిటీ లలోనూ రష్మిక టాప్ ప్లేస్‌లో ఉంది. రష్మిక నటించిన తాజా చిత్రం సికందర్. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే ఆమె నటనపై మాత్రం మంచి స్పందన వచ్చింది.

ఫస్ట్ అడిషన్ వీడియో

రష్మిక ఈరోజు (ఏప్రిల్ 5) తన 29వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె పాత ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఆమె తొలి అడిషన్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రష్మిక మొదటి డైలాగ్ చెప్పడానికి భయపడుతూ ఉండడం, స్వల్పంగానే అయినా తలవంచి ఇబ్బంది పడిన హావభావాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే అదే భయపడే అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతోంది అంటే ఆమె కష్టం, పట్టుదల స్పష్టంగా తెలుస్తుంది.

Also read: Silk Smitha: తెలుగు సినిమాలో ఓ వెలుగు వెలిగిన సిల్క్ స్మిత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870