हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Ramakrishna: దర్శకుడిగా రాహుల్ రామకృష్ణ తొలి అడుగు!

Ramya
Ramakrishna: దర్శకుడిగా రాహుల్ రామకృష్ణ తొలి అడుగు!

సహజనటుడి నుంచి దర్శకుడిగా.. రాహుల్ రామకృష్ణ కొత్త ప్రయాణం

తెలుగు సినీ అభిమానులకు తన సహజ నటనతో పాటు చమత్కారమైన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేకంగా గుర్తింపు పొందిన నటుడు రాహుల్ రామకృష్ణ, ఇప్పుడు దర్శకుడిగా (director) కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో శివ పాత్రతో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఆయన, తర్వాత ‘జాతిరత్నాలు’, ‘భరత్ అనే నేను’, ‘గీత గోవిందం’, ‘బ్రోచేవారెవరురా’ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సహాయ పాత్రల్లోనూ మెప్పించగల నటుడు అని సినీ ప్రపంచానికి నిరూపించిన రాహుల్, ఇప్పుడు కెమెరా వెనకకు వెళ్లేందుకు ముందుకొచ్చారు.

ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ రామకృష్ణ (Ramakrishna) స్వయంగా ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. “ద‌ర్శ‌కుడిగా నా తొలి ప్రాజెక్ట్. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే మీ షోరీల్స్‌, ఫొటోల‌ను నా మెయిల్‌కు పంపించండి” అని పేర్కొంటూ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు, సినీ వర్గాలు, కొత్త కళాకారులు — అందరూ ఒక్కసారిగా ఆసక్తితో ఈ కొత్త ప్రయాణం వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ చిత్రానికి రాహుల్ స్వయంగా నిర్మాతగానూ వ్యవహరించనున్నట్లు సమాచారం.

https://twitter.com/eyrahul/status/1933732800034947318?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1933732800034947318%7Ctwgr%5E00f52e5b5aa3769204c4b710c163254812b8b6b3%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F832558%2Frahul-ramakrishna-turns-director-new-journey-begins

రచయిత, నటుడు.. ఇప్పుడు దర్శకుడు!

రాహుల్ రామకృష్ణ (Ramakrishna) కేవలం నటుడిగా మాత్రమే కాకుండా, ఒక రచయితగా, జర్నలిస్టుగా కూడా పనిచేసిన అనుభవం కలవారు. అందువల్ల ఆయన సినిమాల కథాంశాల్లో భావప్రాప్తి, డైలాగుల్లో చమత్కారం, పాత్రల్లో వాస్తవికత అనేవి స్పష్టంగా కనిపిస్తాయి. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, తన తొలి చిత్రానికి సంబంధించిన కథను ఆయన ఇప్పటికే పూర్తి చేశారు. నటీనటుల ఎంపిక ప్రక్రియను కూడా మొదలుపెట్టారు. అయితే కథాంశం, ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలను మాత్రం రాహుల్ గోప్యంగా ఉంచుతున్నారు. కానీ చిత్ర పనులు మాత్రం వేగంగా కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అభిమానుల అంచనాలు బట్టి చూస్తే.. ఈ చిత్రం ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, హాస్యంతో ముడిపడి ఉండే కథగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో రాహుల్ పలు ఇంటర్వ్యూల్లో సమాజంలో జరిగే చిన్న చిన్న సంఘటనల్ని, మనుషుల మధ్య ఉన్న మానవ సంబంధాల్ని కథల్లో చెప్పాలనేది తన కోణమని పేర్కొన్నారు. దీనినిబట్టి చూస్తే, ఆయన డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం కూడా తాను చేసిన పాత్రల మాదిరిగానే డీప్ కాన్సెప్ట్ ఉండే అవకాశముంది.

నటుడిగా తనదైన ముద్ర.. దర్శకుడిగా ఏం చూపిస్తారో?

2017లో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో శివ పాత్ర ద్వారా రాహుల్ రామకృష్ణ అందరి మనసుల్లో నిలిచిపోయారు. ఆ పాత్రలోని హాస్యం, నైజంపైన అభిప్రాయాలు చెప్పే తీరు – ప్రేక్షకులను కనెక్ట్ చేసింది. తరువాతి సినిమాల్లోనూ అదే పంథాలో సాగుతూ, ఆయన ప్రతి సినిమాలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా ‘జాతిరత్నాలు’ వంటి సినిమాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులను తెగ నవ్వించాయి. నటుడిగా తనకు వచ్చిన ఆదరణ, రచయితగా ఉన్న అభిరుచి కలిసికట్టుగా పనిచేసి ఇప్పుడు దర్శకుడిగా మారేందుకు ఆయనను ప్రేరేపించినట్లు తెలుస్తోంది.

సినీ పరిశ్రమలో నటుడిగా తన ముద్ర వేసుకున్న రాహుల్ రామకృష్ణ, ఇప్పుడు దర్శకుడిగా ఎలా మెప్పిస్తారో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కథనం పట్ల ఆయనకున్న శ్రద్ధ, హాస్యాన్ని చొప్పించడంలో ఉన్న మేటి ప్రతిభ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపే అవకాశముంది. రాబోయే నెలల్లో ఈ సినిమా టైటిల్, పోస్టర్, ఇతర కీలక అంశాలపై అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

Read also: Gopal Rao: సినీ, టీవీ న‌టుడు ఎ. గోపాలరావు కన్నుమూత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870