📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Actor: ఇప్పుడు సినిమా నిర్మాణంలో ఎన్నో మార్పులు వచ్చాయి: రాజేంద్ర ప్రసాద్

Author Icon By Anusha
Updated: May 28, 2025 • 6:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘షష్టిపూర్తి’. ఇందులో అర్చన, రూపేశ్, ఆకాంక్ష సింగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ‘మా ఆయి’ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేశ్ నిర్మించిన ఈ చిత్రానికి పవన్ ప్రభ(Pawan Prabha) దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 30న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. 48 ఏళ్ల నుంచి తనని ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేసారు.రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) మాట్లాడుతూ తనకు ఎప్పుడూ మంచి పాత్రలే లభిస్తున్నాయని, తన వయసుకు తగ్గ పాత్రలు దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ‘షష్టిపూర్తి’ గొప్ప విజయం సాధిస్తుందని గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిజానికి అమరావతిలో ఈ సినిమాకు సంబంధించిన మొదటి ఫంక్షన్ చేయాలని అనుకున్నాం కానీ, అక్కడ అన్ని సౌకర్యాలు లేకపోవడంతో విజయవాడలో ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ నిర్వహించినట్లుగా చెప్పారు. ఒకప్పుడు తాను చిత్రాలు నిర్మించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు సినిమా నిర్మాణంలో ఎన్నో మార్పులు వచ్చాయని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

విచారణ

ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేదు. అయితే ఇప్పుడున్నంత డిస్టర్బెన్స్(Disturbance)కూడా అప్పట్లో లేదు. నేను ఇప్పటికీ షాట్ చేసిన తరువాత మానిటర్ చూడను. నాకు ఆ అలవాటు లేదు. మానిటర్ చూసుకుని వన్స్ మోర్ అని చెప్పాల్సింది దర్శకుడు. మన పని మనం చేసుకోవాలి. అభివృద్ధిని మనం మంచి కోసం వాడుకోవాలి. ప్రస్తుతం మన తెలుగు సినిమా ప్రపంచస్థాయికి వెళ్లింది” అని రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఒక పెద్ద సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు, అందులో నటించే స్టార్ హీరో మానిటర్ ముందు కూర్చొని 7 టేక్స్ చూసి ఫైనల్ గా మొదటి టేక్ ఓకే చేసినట్లుగా తెలిపారు.

Actor: ఇప్పుడు సినిమా నిర్మాణంలో ఎన్నో మార్పులు వచ్చాయి: రాజేంద్ర ప్రసాద్

ఫుల్‌స్టాప్

టాలీవుడ్ లో థియేటర్ల ఇష్యూపై స్పందిస్తూ థియేటర్లు మూసేయడం అనేది ఒక్కరి నిర్ణయంతో జరిగేది కాదని, అందరూ కలిసి నిర్ణయించుకోవాలని రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ”థియేటర్లు(Theaters) మూసేయడం అనేది ఒకరు చెబితే చేసేది కాదు. అది సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. దీన్ని ఎవరో మిస్‌ గైడ్‌ చేశారు. చివరకు ఏమైంది అది నిలబడలేదు కదా. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఫీల్‌ అయ్యాడంటే అది సరైనదే అవుతుంది. ఇలాంటివి క్రియేట్ చేసిన వారిని కనిపెడితే ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పడుతుంది. పవన్‌ కళ్యాణ్ ఈ విషయంలో బాధ్యత తీసుకొని దీని వెనక ఎవరున్నారో కనిపెట్టాలని విచారణకు ఆదేశించారు. థియేటర్లను బంద్‌ చేస్తాం అనే మాట చిన్నది కాదు ఇలాంటివి ఇంకెప్పుడూ జరగకూడదని కోరుకుంటున్నా” అని ఆయన అన్నారు.

Read Also : Karnataka: కాంగ్రెస్ బీజేపీ ఏకం అందుకే కమల్ పై ఫైర్

#RajendraPrasad #ShashtipoorthiMovie #TollywoodVeteran #TrailerLaunch #VijayawadaEvent Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.