हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Jaat Movie: జాట్ మూవీ వివాదం స్పందించిన నిర్మాణ సంస్థ

Anusha
Jaat Movie: జాట్ మూవీ వివాదం స్పందించిన నిర్మాణ సంస్థ

ప్రముఖ బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ జాట్ సినిమాలో నటించారు, ‘ గద్దర్ 2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సన్నీ డియోల్ ,ఇప్పటికే ‘బోర్డర్ 2’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు,జాట్ సినిమాతోతెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.ఈ చిత్రానికి క్రాక్, వీరా సింహ రెడ్డి చిత్రాల ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వహించాడు.గోపిచంద్ మలినేని గతంలో ‘క్రాక్’, ‘వీర సింహా రెడ్డి’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈసారి బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్‌తో జత కట్టాడు,టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించాయి. ఏప్రిల్ 10న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజైన ఈ యాక్షన్ మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. సౌత్ స్టేట్స్ లో ఎలాంటి ప్రభావం చూపనప్పటికీ, నార్త్ లో మాత్రం డీసెంట్ వసూళ్లు వస్తున్నాయి. 

మ‌నోభావాలు

మూవీ కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న ఈ నేపథ్యం లో జాట్ మూవీకి పెద్ద షాక్ తగిలింది. ఆ ఫిల్మ్‌లో న‌టించిన స‌న్నీ డియోల్‌తో పాటు ర‌ణ్‌దీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్‌పై కేసు రిజిస్ట‌ర్ చేశారు. ఆ ఫిల్మ్‌లోని ఓ సీన్‌లో మ‌త‌ప‌ర‌మైన మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. జ‌లంధ‌ర్ పోలీసులు ఆ కేసు ఫైల్ చేశారు. జాట్ డైరెక్ట‌ర్ గోపిచంద్ మ‌లినేనితో పాటు నిర్మాత‌ల‌పైన కూడా కేసు పెట్టారు. భార‌తీయ న్యాయ సంహిత‌లోని సెక్ష‌న్ 299 ప్ర‌కారం కేసు పెట్టిన‌ట్లు తెలుస్తోంది.ఆ ఫిల్మ్‌లో క్రైస్త‌వ మ‌నోభావాలు దెబ్బ‌తీసే రీతిలో ఓ సీన్ ఉన్న‌ట్లు ఫిర్యాదు న‌మోదు అయ్యింది. యేసు క్రీస్తును అగౌర‌వ‌ప‌రుస్తున్న రీతిలో సీన్ ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గుడ్ ఫ్రైడే, ఈస్ట‌ర్ ప‌ర్వ‌దినాలు ఉన్న ఈ ప‌విత్ర మాసంలో కావాల‌నే ఆ సినిమాను రిలీజ్ చేశార‌ని, క్రైస్త‌వుల్లో ఆగ్ర‌హాన్ని తెప్పించి, దేశంలో అల్ల‌ర్లు సృష్టించే ప్ర‌య‌త్నం చేశార‌ని, అందుకే డైరెక్ట‌ర్‌, నిర్మాత‌, ర‌చ‌యిత‌పై కేసు పెట్టిన‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.తాజాగా మూవీ టీమ్ స్పందించింది.

తొలగించాం

జాట్ సినిమాలోని ఒక నిర్దిష్ట సన్నివేశంపై వ్యతిరేకత వచ్చింది. ఆ సీన్ ని తక్షణమే సినిమా నుండి తొలగించాము.ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనేది మా ఉద్దేశం కాదు.దానికి మేము తీవ్రంగా చింతిస్తున్నాము.ఆ సన్నివేశాన్ని సినిమా నుండి తొలగించడానికి త్వరిత చర్య తీసుకున్నాము” అని చిత్ర బృందం వివరణ ఇచ్చింది.

Read Also:Retro Movie:’రెట్రో’ మూవీ ట్రైలర్ విడుదల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870