📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్

Sunitha: సునీత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ప్రవస్తి

Author Icon By Anusha
Updated: April 23, 2025 • 6:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలపై స్పందిస్తూ పాడుతా తీయగా జడ్జీ, సింగర్ సునీత ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో సింగర్ ప్రవస్తిని ఒళ్లో పెట్టుకుని ముద్దు చేశానని కానీ ఆమె తనపై డిబేట్ చేసే స్థాయికి వెళ్లిందంటూ ప్రసస్తి ఆరోపణల్ని ఖండించారు సునీత.అయితే సునీత వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మరో వీడియో రిలీజ్ చేశారు సింగర్ ప్రవస్తి. అసలు వీడియో రైట్స్ విషయంలో సునీత చెప్పినవన్నీ అబద్దాలే అంటూ ఆధారాలను బయటపెట్టి కీలక వ్యాఖ్యలు చేసింది సింగర్ ప్రవస్తి.సునీత గారూ.. మీరు చాలా విషయాలు మాట్లాడారు. నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను.. ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దు చేశాను.. అలాగని ఇప్పుడు చేయలేం కదా అని అన్నారు. నేను మిమ్మల్ని ఒళ్లో కూర్చోబెట్టుకోమని అడగడం లేదు మేడమ్.. ఒక మనిషికి నాకు రెస్పెక్ట్ ఇవ్వమన్నాను. ఒక సింగర్‌గా నేను ఆ రెస్పెక్ట్ కోరుకున్నాను.మీరు ఆ రీల్‌లో ఎంత బాగా మాట్లాడారో.. రియల్‌లో కూడా అంత బాగా మాట్లాడి ఉంటే ఇదంతా జరిగేదే కాదు. నేను చిన్నప్పుడు ఎలా పాడేదాన్నో.. ఇప్పుడు అలా పాడటం లేదని అన్నారు. అది మీ ఒపీనియర్. దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తున్నా. సాంగ్ సెలక్షన్ గురించి కూడా మాట్లాడారు. వీడియో రైట్స్ గురించి కూడా మాట్లాడారు. ఇవిగో చూడండి.. రైట్స్ ఉన్నాయో లేదో.

జడ్జిమెంట్

మాకు దేనికైతే వీడియో రైట్స్ ఉన్నాయో.. ఆ సాంగ్స్ మాత్రమే ఎంచుకున్నాం. అందులో నుంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకుని ఇచ్చాం. కాబట్టి మీరు చెప్పినట్టుగా నా సాంగ్స్ రిజెక్ట్ చేయడానికి కారణం వీడియో రైట్స్ కాదు. దేని గురించో కూడా చెప్తాను. రాఘవేంద్రరావుగారి స్పెషల్ ఎపిసోడ్‌లో భాగంగా.. ఆయన సినిమాల్లోని భక్తి పాటల్లో నేను సాంగ్ సెలెక్ట్ చేసుకుని ప్రొడక్షన్ వాళ్లకి పంపిస్తే.. ఇది ఇవ్వడం కుదరదని చెప్పారు. కానీ.. వేరే కంటెస్టెంట్‌తో అదే సాంగ్ పాడించారు. ఆమె లిరిక్స్ మర్చిపోయినా కూడా మంచి కామెంట్స్ ఇచ్చారు. మీరు సైగలు చేసి మరీ పాడించారు. మరి ఇది పక్షపాతం చూపించడం కాదా మేడమ్?? మీరు మీ జడ్జిమెంట్ చెప్పకుండా ఎందుకు సైగలు చేశారనేదానికి కూడా మీరు సమాధానం చెప్పండి.ఇళయరాజా సార్.. ఎస్పీ బాలు సార్ ఎపిసోడ్‌లో మీరొక పాటకి అక్కడ లేకుండానే జడ్జిమెంట్ ఇచ్చేసి వెళ్లారు. కన్యాకుమారి అనే పాటకి మీరు షోలో లేకుండానే.. ఎక్కడికో వెళ్లాలని.. ఆ పాటని వినకుండానే ముందే జడ్జిమెంట్ ఇచ్చేసి వెళ్లిపోయారు. సాంగ్ వినకుండా చూడకుండా మీరు ఎలా జడ్జిమెంట్ ఇచ్చేసి వెళ్లిపోయారో చెప్పండి.

ఎందుకు టాప్‌

నేను ఎవరెవరి పేర్లో వాడానని అన్నారు. నేను వాళ్లలో ఇద్దరి పేర్లు మాత్రమే వాడాను. మరో ఇద్దరి పేర్లు మీరు యాడ్ చేశారు. ఆ ఇద్దరి పేర్లు నేను ఎక్కడా మాట్లాడలేదు. మీరు ఎక్కడ విన్నారో ఎలా ఉన్నారో నాకు తెలియదు మేడమ్ వాళ్ల పేర్లు ఎక్కడలేదు. శ్రీలిత పేరునేను ఎత్తలేదు. నేను అడిగింది ఏంటంటే లిరిక్స్ మర్చిపోయిన వాళ్లు.. సరిగా పాడలేని వాళ్లు ఎందుకు టాప్‌లో ఉన్నారని. లిరిక్స్ మర్చిపోయినా తప్పు కాదు చేతి మీద రాసుకుని వచ్చి పాడుతుంటే దాన్ని కామెడీగా మార్చేశారు. అప్పుడు అది కాంపిటేషన్ అని గుర్తురాలేదు. కానీ చివరికి వాళ్లకే ఎక్కువ మార్కులేశాడు. ఇది కాదా పక్షపాతం చూపించడం అంటే.ఇప్పటికీ నేను మీ ఫ్యాన్‌నే’ అంటూ చేతులు జోడిస్తూ.. తన బాధను వ్యక్తపరిచింది సింగర్ ప్రవస్తి.

Read Also:  Sreenidhi Shetty: హిట్ 3 సినిమా కోసం తెలుగు నేర్చుకున్నా : శ్రీనిధి శెట్టి

#CounterStatement #SingerPravasthee #SunithaControversy #TruthRevealed #VideoRightsIssue Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.