हिन्दी | Epaper

Poorna: కుటుంబంతో కలిసి బక్రీద్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకున్న పూర్ణ‌

Anusha
Poorna: కుటుంబంతో కలిసి బక్రీద్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకున్న పూర్ణ‌

టాలీవుడ్ హీరోయిన్,పూర్ణ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అందాల తార శ్రీ మహాలక్ష్మి సినిమా(Sri Mahalakshmi Movie)తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది . సీమ టపాకాయ్, అవును తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గానే కాకుండా స‌పోర్టింగ్ రోల్స్‌లోను మెరిసింది. దసరా, అఖండ, గుంటూరు కారం, డెవిల్ తదితర సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ తో అద‌ర‌గొట్టింది. అలాగే పలు టీవీ షోల్లోనూ క‌నిపించి సంద‌డి చేసింది. ఇక ఈ అమ్మ‌డు కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో పెళ్లి పీటలెక్కంది. 2022 జూన్ 12న దుబాయిలో వివాహం చేసుకుంది.

సంబంధించిన ఫొటోలు

ఏప్రిల్‌ 2023లో హమ్దాన్ అసిఫ్ అలీ అనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది పూర్ణ. అప్పుడ‌ప్పుడు పూర్ణ(Poorna) సోష‌ల్ మీడియాలో త‌న కుమారుడి ఫొటోల‌ని షేర్ చేస్తూ ఉంటుంది. ఆ మ‌ధ్య తన కుమారుడి రెండో పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహంచారు పూర్ణ దంపతులు.అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఇక నటి పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం తన భర్త, కొడుకులతో కలిసి నేడు బక్రీద్ పండుగ‌ను సెల‌బ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా స్పెషల్ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది.

అభిమానులు ఆశిస్తున్నారు

ఫ్యాన్స్ పూర్ణ ఫ్యామిలీని చూసి మురిసిపోతున్నారు. మీ కుమారుడు భ‌లే ముద్దుగా ఉన్నాడుగా అని కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తుంటే, మరి కొంద‌రు మీ జంట బాగుంద‌ని అంటున్నారు. కాగా పూర్ణ చివరిగా నాని ‘దసరా’ సినిమాలో కనిపించి మెప్పించింది. త్వరలోనే ఆమె మళ్ళీ సినిమాలోకి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా పూర్ణ మలయాళీ అమ్మాయి అయిన తెలుగు సినిమాలతో స్టార్‌డమ్ ని సంపాదించుకుంది. సినిమాలు మాత్రమే కాదు తెలుగు షోల్లో కూడా పాల్గొని ఇక్కడ ఆడియన్స్ కి బాగా దగ్గరయింది.

Read Also: Akhil Akkineni : ఘనంగా ముగిసిన అఖిల్ అక్కినేని వివాహం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చిత్ర పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి నవనీంద్ర బెహ్ల్ కన్నుమూత!

చిత్ర పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి నవనీంద్ర బెహ్ల్ కన్నుమూత!

త్రిషతో విజయ్ పెళ్లి.. తల్లి గ్రీన్ సిగ్నల్?

త్రిషతో విజయ్ పెళ్లి.. తల్లి గ్రీన్ సిగ్నల్?

శ్రీదేవి ఆస్తి వివాదం: బోనీ కపూర్ కుటుంబానికి హైకోర్టులో ఊరట

శ్రీదేవి ఆస్తి వివాదం: బోనీ కపూర్ కుటుంబానికి హైకోర్టులో ఊరట

ప్రత్యూష కేసులో కీలక మలుపు: నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థరెడ్డి

ప్రత్యూష కేసులో కీలక మలుపు: నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థరెడ్డి

మౌనీ రాయ్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్

మౌనీ రాయ్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్

ఆస్కార్ వేదికపై ప్రియాంక చోప్రా

ఆస్కార్ వేదికపై ప్రియాంక చోప్రా

‘తెలుసు కదా’వైఫల్యం పై రాశీ ఖన్నా ఏమన్నదంటే?

‘తెలుసు కదా’వైఫల్యం పై రాశీ ఖన్నా ఏమన్నదంటే?

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

బాలీవుడ్‌ను పలకరించిన సాయి పల్లవి.. జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ
2:13

బాలీవుడ్‌ను పలకరించిన సాయి పల్లవి.. జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ

📢 For Advertisement Booking: 98481 12870